Pure EV ePluto 7G Pro సరికొత్త లుక్‌లో ప్యూర్ ఎలక్ట్రిక్ స్కూటర్ విడుదల.. ధర 94,999.. 150కి.మీ రేంజ్..!

ఎలక్ట్రిక్ టూ-వీలర్ స్టార్టప్, ప్యూర్ EV కొత్త ePluto 7G ప్రో ఎలక్ట్రిక్ స్కూటర్‌ను విడుదల చేసింది. ప్యూర్ EV ePluto 7G ప్రో ఆ కంపెనీకి చెందిన టాప్ ఎలక్ట్రిక్ స్కూటర్ లైనప్‌లో కొత్త టాప్-స్పెక్ ఎంపికగా ఉంది. సరికొత్త ఫీచర్లు, అధునాతన టెక్నాలజీతో రాబోతున్న ఈ స్కూటర్ కి సంబంధించిన మరిన్ని వివరాలు మీకోసం..

అదిరిపోయే బ్యాటరీ సామర్థ్యంతో ప్యూర్ EV ePluto 7G ప్రో రాబోతుంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 100-150 కిమీల రేంజ్ ను అందిస్తుంది. ఈ ప్యూర్ EV ePluto 7G Pro ecoDryft మోటార్‌సైకిల్ ప్లాట్‌ఫారమ్‌ పై పనిచేస్తుంది. 1.5 kW ఎలక్ట్రిక్ మోటార్ తో.2.4 kW MCU నుంచి శక్తిని పొందుతుంది. ఇది CAN-ఆధారిత ఛార్జర్‌తో వస్తుంది.

Pure EV ePluto 7G Pro

కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ స్మార్ట్ BMS బ్లూటూత్ కనెక్టివిటీతో 3.0 kWh AIS 156 సర్టిఫైడ్ బ్యాటరీని పొందుతుంది. ప్యూర్ EV మూడు వేర్వేరు మోడ్‌లలో 100-150 కిమీల రేంజ్ ను అందిస్తుంది. కొత్త ప్రో వెర్షన్ స్మార్ట్‌ఫోన్ కంటే శక్తివంతమైన ప్రాసెసింగ్‌ను కలిగి ఉండనుంది. నాలుగు విభిన్న మైక్రోకంట్రోలర్‌లు అనేక సెన్సార్‌లతో ఇది వస్తుంది. OTA ఫర్మ్‌వేర్ అప్‌డేట్‌లకు అనుకూలంగా సెటప్ ఇందులో ఉంటుంది.

అత్యధికంగా అమ్ముడవుతున్న 7G మోడల్ ఈ అప్‌గ్రేడ్ వెర్షన్ ఆవిష్కరణ చేయడం సంతోషంగా ఉందని కంపెనీ సహ వ్యవస్థాపకుడు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రోహిత్ వదేరా అన్నారు. ePluto 7G ప్రో ఓ స్ట్రాంగ్ మోడల్ గా లాంగ్ రన్ వెహికిల్ గా పనిచేస్తుంది అని తెలిపారు. సుదీర్ఘ శ్రేణి స్కూటర్లను కోరుకునే కస్టమర్లను ఇది మెప్పు పొందుతుందని ఆశిస్తున్నట్లు చెప్పారు. ఈ స్కూటర్ కు సంబంధించి ప్రీ-లాంచ్ సమయంలో 5000+ అందుకున్నందుకు మేము సంతోషిస్తున్నామని పేర్కొన్నారు.

ప్రారంభించిన మొదటి నెలలో 2000+ కంటే ఎక్కువ బుకింగ్‌లను ఆశిస్తున్నాము. ఇప్పటికే ప్యూర్ EV స్కూటర్లు మార్కెట్‌లలో బాగా పేరొందాయని ఆయన వివరించారు. FY2024 చివరి నాటికి 300 టచ్‌పాయింట్‌లకు పైగా దాని పరిధిని విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆయన అన్నారు. ePluto 7G ప్రో ఒకినావా, ఆంపియర్, హీరో ఎలక్ట్రిక్ వంటి వాటికి పోటీగా పనిచేస్తుంది అని అన్నారు.

మాట్ బ్లాక్, గ్రే, వైట్ అనే మూడు కలర్ ఆప్షన్‌లలో ఈ స్కూటర్ అందించబడుతుంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ కి సంబంధించిన బుకింగ్‌లు ఇప్పటికే ప్యూర్ EV డీలర్‌షిప్‌లలో ప్రారంభమయ్యాయి. అతి త్వరలోనే దాదాపు ఈ నెలాఖరులో డెలివరీలు ప్రారంభించే అవకాశం ఉంది.

కొత్త PURE EV ePluto 7G రెట్రో డిజైన్ లాంగ్వేజ్‌ని కలిగి ఉంది. ఇది వృత్తాకార LED DRLతో రౌండ్ LED హెడ్‌ల్యాంప్‌ను పొందుతుంది. ఇది కస్టమర్లను ఆకట్టుకునే అవకాశం ఉంది. చూడటానికి చేతక్ లుక్ లో కనిపించే ఈ స్కూటర్ మార్కెట్ లో తన సత్తాను చాటే అవకాశం ఉంది. ఈ స్కూటర్ ధర రూ.94,999 (ఎక్స్ షోరూమ్) వద్ద అందుబాటులో ఉండనుంది.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్ కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Thursday, May 11, 2023, 15:09 [IST]
English summary
Pure ev epluto 7g pro launched at 94999 comes with 100 to150 range
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+