201 కి.మీ రేంజ్‌తో ప్యూర్‌ EV నుంచి కొత్త స్కూటర్‌.. తక్కువ ధర, ఎక్కువ లాభాలు.!!

స్టార్టప్ కంపెనీ Pure EV మార్కెట్లోకి సరికొత్త ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ ePluto 7G Max ను విడుదల చేసింది. రెట్రో థీమ్‌ కాన్సెప్ట్‌తో స్టార్టప్‌ ప్యూర్‌ ఈవీ ఈ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ను ప్రవేశపెట్టగా.. దేశవ్యాప్తంగా బుకింగ్‌లు ప్రారంభమైనట్లు సంస్థ ప్రకటించింది. రానున్న పండుగ సీజన్‌లో స్కూటర్‌ డెలివరీలు ప్రారంభం అవుతాయని పేర్కొంది.

Pure EV కంపెనీ ePluto 7G Max ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ను ప్రారంభించడంతో పండుగ సీజన్‌లో సేల్స్‌ను పెంచుకోవాలనే నిశ్చయించుకుంది. కాగా ఈ సరికొత్త స్కూటర్‌ను రూ. 1,14,999(ఎక్స్‌ షోరూమ్‌ ధర) వద్ద కంపెనీ విడుదల చేసింది. ఈ స్కూటర్‌ ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే 201 కి.మీ రేంజ్‌ను ఇవ్వనుంది.

Pure-EV-ePluto-7G-Max

కొత్త ePluto 7G Max ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ ఫీచర్లను పరిశీలిస్తే ఇందులో ఈవీ హిల్‌- స్టార్ట్‌ అసిస్ట్‌, డౌన్‌ హిల్‌ అసిస్ట్‌, కోస్టింగ్‌ రీజెన్‌, రివర్స్‌ మోడ్‌ వంటి అధునాతన ఫీచర్లు ఉన్నాయి. ఇంకా లాంగ్‌ లైఫ్‌ బ్యాటరీ కోసం స్మార్ట్‌ AI వంటి ఫీచర్‌తో వస్తుంది.

రెట్రో- థీమ్‌తో వస్తున్న ఈ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ నాలుగు ఆకర్షణీయమైన కలర్స్‌లో అందుబాటులో ఉంది. మాట్‌ బ్లాక్‌, రెడ్‌, బూడిద, తెలుపు కలర్స్‌లో మీక ఇష్టమైన దానిని ఎంచుకోవచ్చు. ఇక ePluto 7G Max స్కూటర్‌లో బ్యాటరీ విషయానికొస్తే ఇందులో 3.5 KWh లిథియం- అయాన్‌ బ్యాటరీ ప్యాక్‌తో వస్తుంది. ఇందులోని ఎలక్ట్రిక్‌ మోటార్‌ 3.21 bhp గరిష్ఠ శక్తిని ఉత్పత్తి చేస్తుంది.

మరో ప్రత్యేకత ఏమిటంటే.. ePluto 7G Max స్కూటర్లో ASI - 156 సర్టిఫైడ్‌ బ్యాటరీ ప్యాక్‌.. ఏఐ ద్వారా ఆధారితమైన స్మార్ట్‌ బ్యాటరీ మేనేజ్‌మెంట్‌తో వస్తుందని Pure EV స్పష్టం చేసింది. ఇంకా ఈ స్కూటర్‌ను మీరు డ్రైవ్‌ చేసేటప్పుడు మూడు డ్రైవింగ్‌ మోడ్‌లను ఎంచుకునే సదుపాయం ఉంది. ePluto 7G Max ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ బ్యాటరీ 60,000 కి.మీ స్టాండర్ట్‌ వారంటీతో వస్తుంది.

ఇక ePluto 7G Max ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ డిజైన్‌ విషయానికొస్తే ఇందులో LED లైట్లు, పూర్తి డిజిటల్‌ ఇన్‌స్ట్రుమెంట్‌ క్లస్టర్‌తో వస్తుంది. ఇందులో రివర్స్‌ మోడ్‌ అసిస్ట్‌, పార్కింగ్‌ అసిస్ట్‌ ఫీచర్లను ప్రవేశపెట్టడం ద్వారా రైడర్‌కు అన్ని విధాలా సౌలభ్యంగా ఉంటుంది. ఆటో పుష్‌ ఫంక్షన్‌ మరో ప్రత్యేకత.

ePluto 7G Max స్కూటర్‌ విడుదలపై ప్యూర్‌ ఈవీ కో ఫౌండర్‌, సీఈవో రోహిత్‌ వదేరా హర్షం వ్యక్తం చేశారు. ఈ స్కూటర్‌ను 7G మోడల్‌ యొక్క అప్‌గ్రేడెడ్‌ వెర్షన్‌గా పేర్కొన్నారు. డైలీ 100 కి.మీ ప్రయాణించే కస్టమర్లను లక్ష్యంగా పెట్టుకుని స్కూటర్‌ను రూపొందించినట్లు చెప్పారు. తరచుగా ఛార్జింగ్‌ చేసే అవసరం లేకుండా 201 కి.మీ రేంజ్‌ ఇచ్చే బ్యాటరీని ప్రవేశపెట్టినట్లు వివరించారు.

దేశీయ మార్కెట్లో ఇప్పటికే పలు ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ తయారీ కంపెనీలు స్టార్టప్‌లుగా ప్రారంభమై.. మంచి దూకుడును ప్రదర్శిస్తున్నాయి. పర్యావరణ హితంగా ఉండటమే కాకుండా పెరుగుతున్న పెట్రోల్‌, డీజిల్‌ ధరలకు ఇవి ఒక ప్రత్యామ్నాయంగా ఉంటున్నాయి. ఎక్కువగా సిటీ కమ్యూటర్స్‌ను లక్ష్యంగా చేసుకుని తయారీ కంపెనీలు ఎలక్ట్రిక్‌ స్కూటర్లను ప్రవేశపెడుతున్నాయి.

మరి స్టార్టప్‌గా మార్కెట్లోకి అడుగుపెట్టిన ప్యూర్‌ ఈవీ.. తన కొత్త ePluto 7G Max స్కూటర్‌పై చాలా ఆశలు పెట్టుకుంది. ఈ పండుగ సీజన్‌లో మంచి సేల్స్‌ సాధించాలని లక్ష్యంతో ఉంది. కస్టమర్లు కూడా ఎక్కువగా పండుగ సీజన్‌లో వాహనాలను కొనుగోలు చేసేందుకు ఆసక్తి కనబరుస్తారు. మరి ఈ కొత్త ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ ఏ మేరకు తన సత్తా చాటుతుందో చూడాలి.

More from DriveSpark

Article Published On: Thursday, October 5, 2023, 16:58 [IST]
English summary
Pure ev launches epluto 7g max electric scooter with 201 km range
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+