CEAT ఇండియన్ సూపర్‌క్రాస్ రేసింగ్‌లో పాల్గొననున్న Reise Motosports.. ఈసారి ఉత్కంఠభరితంగా రేస్.!!
రైజ్ మోటోస్పోర్ట్స్(Reise MotoSports) CEAT ఇండియన్ సూపర్‌క్రాస్ రేసింగ్ లీగ్ (CEAT ISRL)లో 6వ జట్టుగా చేరింది. దీంతో, ఇండియన్ సూపర్‌క్రాస్‌లో కొత్త పరిణామాన్ని నిర్వచించేందుకు రైజ్ మోటోస్పోర్ట్స్ జట్టు సిద్ధంగా ఉంది. 2024 జనవరిలో జరగనున్న ఈ రేసు ఉత్కంఠభరితంగా సాగనుంది. పూర్తి సమాచారం ఈ కథనంలో..
రైజ్ మోటో అనేది ముంబయికి చెందిన టైర్ల తయారీ సంస్థ. మహన్సారియా గ్రూప్‌లో భాగమైన రైజ్ మోటో నవంబర్ 2022 నుండి కార్యకలాపాలను ప్రారంభించింది. రైజ్ మోటో భారతీయ భూభూగానికి(రోడ్లకు) సరిపోయే టైర్లను తయారు చేయడానికి అత్యాధునిక యూరోపియన్ టెక్నాలజీని ప్రవేశపెట్టింది.

భారత మార్కెట్లో Reise Moto కు చెందిన అధిక-పనితీరు కలిగిన టైర్లు వినియోగదారుల నుంచి మంచి ఆదరణ పొందాయి. గ్లోబల్ టైర్ సప్లయర్ మిడాస్‌తో జతకట్టిన రైజ్ మోటో.. బైక్ రైడర్స్ కోసం ప్రముఖ యూరోపియన్ బ్రాండ్‌లకు చెందిన రైడింగ్ దుస్తులు, యాక్సెసరీలు ఇంకా అవసరమైన పరికరాలను విక్రయించాలని యోచిస్తోంది.
భారతీయ బైక్ రైడర్‌లకు సురక్షితమైన రైడ్ కోసం యూరోపియన్ నాణ్యమైన ఉత్పత్తులను అందించాలని Reise Moto లక్ష్యంగా పెట్టుకుంది. ఇది రైడర్‌లకు స్టైల్, సేఫ్టీతో పాటు మెరుగైన పనితీరును అందిస్తుంది.

ఈ సందర్భంగా, CEAT నిర్వహిస్తున్న ఇండియన్ సూపర్‌క్రాస్ రేసింగ్ లీగ్ కోసం 'రైజ్ మోటోస్పోర్ట్స్'. రైజ్ మోటో సూపర్‌క్రాస్ రేసింగ్ టీమ్‌ని సృష్టించింది. రైజ్ మోటోస్పోర్ట్స్ CEAT ఇండియన్ సూపర్‌క్రాస్ రేసింగ్ లీగ్‌లో చేరిన 6వ జట్టుగా నిలిచింది. ఈ సూపర్‌క్రాస్ రేసింగ్ సిరీస్ జనవరి 2024లో ప్రారంభం కానుంది.
దీనిపై రైజ్ మోటో & మహాంచార్య గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ యోగేష్ మహాంచార్య మాట్లాడారు.RAISE ప్రారంభమైనప్పటి నుండి మోటార్‌స్పోర్ట్స్‌లో చురుకుగా పాల్గొంటూ రైడర్లకు మద్దతుదారుగా ఉంటోందని తెలిపారు. తమ స్వంత రేసింగ్ జట్టును ప్రారంభించాలని యోచిస్తున్నట్లు పేర్కొన్నారు.

అదేవిధంగా, రైడర్‌లు మరియు బైక్ ఔత్సాహికుల శక్తివంతమైన కమ్యూనిటీతో మంచి సంబంధాన్ని పెంపొందించడానికి కృషి చేస్తున్నట్లు మహాంచార్య అన్నారు. సూపర్‌క్రాస్ ఇండియా వైస్-ఫౌండర్ వీర్ పటేల్.. రైజ్ మోటోస్పోర్ట్స్ చేరిక మా లీగ్‌కి మరో ఉత్సాహం మరియు నైపుణ్యాన్ని జోడిస్తుందని హర్షం వ్యక్తం చేశారు.
రైజ్ మోటోకు మోటార్‌స్పోర్ట్స్ పట్ల ఉన్న అభిరుచి మరియు నిబద్ధత, ఇండియన్ సూపర్‌క్రాస్ రేసింగ్ స్థాయిని పెంచే మా మిషన్‌తో సంపూర్ణంగా సరిపోతాయని వీర్ పేటేల్ అన్నారు. లీగ్ విజయానికి వారి సహకారం కోసం తాము ఎదురుచూస్తున్నట్లు చెప్పారు. ఈ లీగ్‌కు సంబంధించిన మరిన్ని వివరాల కోసం ఇండియన్ సూపర్‌క్రాస్ వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.

భారత్‌లో సూపర్‌క్రాస్ రేసింగ్ కొత్త అయినప్పటికీ, ఈ రకమైన రేసింగ్ ఇప్పుడిప్పుడే బాగా ప్రాచుర్యం పొందుతోంది. దీనిని మరింత ప్రాచుర్యంలోకి తీసుకురావడానికి, ప్రముఖ టైర్ తయారీదారు CEAT 2024 కోసం ఇండియన్ సూపర్‌క్రాస్ రేసింగ్ ఈవెంట్‌ను నిర్వహిస్తోంది. Reise Moto వంటి బలమైన జట్లు పాల్గొంటున్నందున, ఇండియన్ సూపర్‌క్రాస్ రేసు ఆసక్తికరంగా ఉండనుంది.
డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








