River Indie Full Review Video రివర్ ఇండీ ఎలక్ట్రిక్ స్కూటర్ రివ్యూ వీడియో.. పెద్ద స్టోరేజ్ స్పేస్ ప్రత్యేకత..

బెంగళూరుకు చెందిన ఈవీ స్టార్టప్ రివర్(River) తన మొదటి ఎలక్ట్రిక్ స్కూటర్ ఇండీ(River Indie Electric Scooter) ని టెస్ట్ రైడ్ చేసేందుకు మా డ్రైవ్ స్పార్క్ టీంను ఆహ్వానించింది. బెంగళూరులో ఈ స్కూటర్ టెస్ట్ రైడ్ గురించి పలు ఆసక్తికర విషయాలు ఇక్కడ మీతో ఈ వీడియో ద్వారా పంచుకుంటున్నాం.

రివర్‌ ఇండీ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ డిజైన్‌ చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ముందు, వెనుక వైపు బాక్సీ లైటింగ్‌ సెటప్‌తో ఇతర ఎలక్ట్రిక్‌ స్కూటర్ల కంటే భిన్నంగా కనిపిస్తుంది. ఫ్రంట్‌ ఫెండర్‌ బ్లాక్‌ కలర్‌లో మరింత అందంగా కనిపిస్తుంది. దీనిని 14 అంగుళాలు అల్లాయ్‌ వీల్స్‌తో రూపొందించారు. రివర్‌ ఇండీ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ విశాలమైన సీటును కలిగి ఉంది. ఈ స్కూటర్‌ మాన్‌సూన్‌ బ్లూ, సమ్మర్‌ రెడ్‌, స్ప్రింగ్‌ యెల్లో కలర్‌ ఆప్షన్స్‌లో అందుబాటులో ఉంది.

కొత్త రివర్‌ ఇండీ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌లో ఎలక్ట్రిక్ మోటార్‌ను పరిశీలించినట్లయితే ఇందులో 9 bhp వద్ద 26 Nm గరిష్ఠ అవుట్‌పుట్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది బెల్ట్ డ్రైవ్ సెటప్ ద్వారా వెనుక చక్రానికి శక్తిని అందిస్తుంది. ఇందులో 4 kWh లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్‌ను అందించారు. ఒకే ఛార్జ్‌పై 120 కి.మీ రేంజ్‌ ఇస్తుంది. ఇంకా 5 గంటల్లో 0 నుంచి 80 శాతం ఛార్జింగ్ అవుతుంది.

River-Indie-Electric-Scooter

ఇక రివర్ ఇండీ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌.. పెద్ద స్టోరేజ్ ఆప్షన్‌లతో ప్రత్యేకమైన డిజైన్‌ను కలిగి ఉంది. ఈ స్టోరేజ్‌ ఆప్షన్‌ మీరు ఎక్కువ లగేజీని పెట్టుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. వేగవంతమైన ఛార్జింగ్ ఆప్షన్‌ మరియు కాంబి-బ్రేకింగ్ సిస్టమ్‌ను కొద్దిగా సర్దుబాటు చేసినట్లయితే కస్టమర్లకు ఇంకా సంతృప్తిగా ఉండేది. స్పోర్టీ ఫీచర్‌తో ప్రత్యేకమైన ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ను వెతుకుతున్న వారికి రివర్‌ ఇండీ మంచి ఆప్షన్‌.

More from DriveSpark

Article Published On: Tuesday, September 12, 2023, 12:05 [IST]
English summary
River indie electric scooter features battery performance specs full review video
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+