తొలి SUV ఎలక్ట్రిక్ స్కూటర్.. వారంటీ ఆఫర్ అదుర్స్..!
బెంగళూరుకు చెందిన ప్రముఖ ఎలక్ట్రిక్ వెహికల్ స్టార్టప్ రివర్ (River) ఇండీ అనే సరికొత్త స్కూటర్ ను లాంఛ్ చేసింది. ప్రత్యేకమైన డిజైన్ తో ఈ కొత్త స్కూటర్ కంపెనీ ప్రవేశపెట్టింది. ఇప్పటి వరకు 4 వీలర్స్ లో మాత్రమే (SUV Sports Utility Vehicle) చూశాము. కానీ టూ వీలర్స్‌లోనూ SUV తరహా వాహనాన్ని రివర్ ఇండీ డిజైన్ చేసింది.
పవర్ ఫుల్ మోటార్ ను ఈ బైక్ అమర్చారు. కేవలం 3.9 సెకన్లలోనే 0 నుంచి 40 కిలోమీటర్ల వేగాన్ని ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ అందుకుంటుంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే దాదాపు 120 km రేంజ్ వరకు దీనిపై ప్రయాణించవచ్చు. ఈ స్కూటర్ పై గరిష్టంగా 90kmph వేగంతో వెళ్ళవచ్చు. 9 బీహెచ్‌పీ వద్ద ఇది 26 NM శక్తిని ఉత్పత్తి చేస్తుంది.

5 గంటల్లో ఛార్జింగ్..
4 kwh కెపాసిటీ కలిగిన బ్యాటరీని అమర్చారు. 5 గంటల్లో బ్యాటరీని దాదాపు 80 శాతం పూర్తి చేయవచ్చని సంస్థ పేర్కొంది. ఈ స్కూటర్ లో ప్రత్యేకంగా రివర్స్ పార్కింగ్ అసిస్ట్ ను రూపొందించారు. ఇది బైక్ లోని ప్రత్యేక ఫీచర్ గా అభివర్ణించవచ్చు. అలానే రెండు USB పోర్టల్స్ కూడా ఉన్నాయి.
ఇండీ సరికొత్త టెక్నాలజీతో వచ్చింది. సస్పెన్షన్ లో టెలిస్కోపిక్ ఫ్రంట్, వెనుక ట్విన్ రియర్ హైడ్రాలిక్ సస్పెన్షన్ లు ఉన్నాయి. 240mm ఫ్రంట్ డిస్క్, 200mm వెనుక డిస్క్ ద్వారా ఈ స్కూటర్ రన్ అవుతుంది. హై క్వాలిటీ డిస్ ప్లే అందించారు. ఇది సూర్యకాంతిలో (హై కాంట్రాస్ట్)లో కూడా స్పష్టంగా కనిపిస్తుంది.

అతి పెద్ద స్టోరేజ్ కెపాసిటీ..
డిజైన్-ఫస్ట్ విధానం ద్వారా రోజువారీ వినియోగదారులను పెంచుకోవడమే లక్ష్యంగా ఈ స్కూటర్ ను లాంఛ్ చేసినట్లు ఆ సంస్థ సీఈవో, సహ వ్యవస్థాపకుడు అరవింద్ మణి తెలిపారు. యుటిలిటీ, లైఫ్‌స్టైల్ అనే రెండు విభిన్నమైన వేరియంట్ లో ఈ స్కూటర్ ను తీసుకువస్తున్నట్లు ఆయన వెల్లడించారు. డిజైన్ ఎలిమెంట్స్, స్పెషల్ ఫీచర్లులు ఇండీకి మరింత క్రేజ్ ఇస్తాయని అని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ నూతన EVలో అండర్ సీట్ స్టోరేజ్ 43 లీటర్లుగా ఉంది. భారత్ లో ఎలక్ట్రిక్ స్కూటర్ స్టోరేజి పరంగా ఇదే అతిపెద్ద స్పేస్ కల్గిన స్కూటర్ గా చెప్పవచ్చు. ముందు భాగంలో మెటల్ క్రాష్ గార్డ్ లు ఉన్నాయి. స్కూటర్ కిందపడినా ఇది దెబ్బతినకుండా ప్రొటెక్ట్ చేస్తుంది. యూనిక్ మోడల్ లుక్ చతురస్రాకారంలో రెండు HD LED లైట్స్ ని తీసకువచ్చింది. ఇది స్కూటర్ ను ప్రత్యేక లుక్ కల్పిస్తుంది.

5 సంవత్సరాల వారంటీ..
మాన్ సూన్ బ్లూ, సమ్మర్ రెడ్, స్ప్రింగ్ ఎల్లో మూడు కలర్ ఆప్సన్స్ లో ఈ స్కూటర్ అందుబాటులో ఉండనుంది. కంపెనీ బ్యాటరీ, స్కూటర్ రెండింటికీ 5 సంవత్సరాల/50,000 కి.మీ వారంటీ అందిస్తోంది. ఇది అతిపెద్ద నిర్ణయంగా చెప్పవచ్చు. దీని వల్ల మోటర్ కస్టమర్ కి మరింత భరోసా కల్పించినట్లు అవుతుందని సంస్థ భావిస్తోంది.
ఈ స్కూటర్ ను బుక్ చేసుకునాలి అనుకునేవారు కేవలం తమ సంస్థ వెబ్ సైట్ లో రూ.2500 చెల్లించి బుక్ చేసుకోవచ్చు. ఎక్స్ షోరూమ్ లో ఈ సరికొత్త స్కూటర్ ధర రూ.1.25 లక్షలుగా ఉంది. ఈ స్కూటర్ బుకింగ్ చేసుకున్న వారు ఆగస్టులో స్కూటర్ ను డెలివరీ చేస్తుంది. మరెందుకు ఆలస్యం ఈ స్కూటర్ ను ఇప్పుడే రివర్ ఇండీ వెబ్ సైట్ లో బుక్ చేసుకోండి.


Click it and Unblock the Notifications








