రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ ఫ్యాన్స్‌కి గుడ్‌ న్యూస్‌.. ఇకపై లక్షల్లో ఖర్చు చేయకుండానే ఈ బైక్స్‌ రైడ్‌ చేయొచ్చు.!!

బైక్‌ ప్రియుల్లో రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌(Royal Enfield Bikes Rental Program) మోటార్‌సైకిళ్లకు ఉన్న క్రేజ్‌ అంతా ఇంతా కాదు. దశాబ్దాలుగా వింటేజ్‌ రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ కాలం నుంచి నేటి తరం అప్‌డేటెడ్‌ రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ బైక్‌ల వరకూ.. యూత్‌లో ఆ క్రేజ్‌ కొనసాగుతూనే ఉంది. సౌండ్‌తో యువత హృదయాలను కొల్లగొట్టిన బుల్లెట్‌ బైక్‌ను కొనుగోలు చేయాలని ప్రతి ఒక్కరూ ఆరాటపడుతుంటారు.

రాయల్ ఎన్‌ఫీల్డ్(Royal Enfield Bikes) దాని ప్రత్యేకమైన ఎలిగెంట్‌ లుక్‌, సౌండ్‌ మరియు ఆకర్షణీయమైన డిజైన్‌తో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. రాయల్ ఎన్‌ఫీల్డ్‌ భారతీయ మార్కెట్లో ఒక ప్రముఖ ప్రీమియం మోటార్ సైకిల్ బ్రాండ్‌గా కొనసాగుతోంది. అయితే ఇప్పుడు బైక్‌ లవర్స్‌ కోసం రాయల్ ఎన్‌ఫీల్డ్ అదిరిపోయే బంపర్‌ ఆఫర్‌ను ప్రకటించింది.

Royal-Enfield-Rental

రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ బైక్‌ను కొనుగోలు చేయలేని వారికి ఇప్పుడు మేం చెప్పే విషయం నిజంగా గుడ్‌ న్యూస్ అనే చెప్పొచ్చు. ఇకపై ఈ(Royal Enfield Bullet) బైక్‌ రైడ్‌ని ఆస్వాదించడానికి ఓ అద్భుతమైన అవకాశాన్ని అందిస్తోంది. మీరు రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ బైక్‌ను అద్దెకు తీసుకుని రైడ్‌ చేసుకునే వెసులుబాటును సంస్థ కల్పిస్తోంది.

ఈ కొత్త రాయల్ ఎన్‌ఫీల్డ్(Royal Enfield Bikes for rent in 25 cities) బైక్ రెంటల్ ప్రోగ్రామ్‌ను మొదటగా 25 నగరాల్లో ప్రారంభించనున్నారు. దీనిపై 40 కంటే ఎక్కువ మంది అద్దె ఆపరేటర్లు పనిచేస్తారు. 300 కంటే ఎక్కువ బైక్‌లు షార్ట్‌ టైమ్‌ సర్వీస్‌లో అద్దెకు అందుబాటులో ఉంటాయి. అహ్మదాబాద్, ముంబయి, గుజరాత్, మహారాష్ట్ర, చండీగఢ్, ధర్మశాల, లేహ్, మనాలి, హరిద్వార్ మరియు రిషికేశ్ ఇంకా ఇతర నగరాల్లో ప్రారంభించాలని యోచిస్తున్నారు.

Royal-Enfield-Rental

రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ బైక్‌ను నడపాలనుకునేవారు ఈ బైక్‌ను అద్దెకు తీసుకోవాలంటే కూడా చాలా సులువు. కస్టమర్‌ ఫ్రెండ్లీగా రెంట్‌ ప్రాసెస్‌ ఉంటుంది. ఆసక్తి గల వారు రాయల్ ఎన్‌ఫీల్డ్ రెంటల్ వెబ్‌సైట్‌ను సందర్శించి, గమ్యస్థానం, పికప్ డేట్‌ అండ్‌ టైమ్‌, డ్రాప్-ఆఫ్ డేట్‌ అండ్‌ టైమ్‌ను ఎంచుకోవాలి. సైట్‌(Royal Enfield Rental Website)లో అందుబాటులో ఉన్న మోడల్‌ల జాబితాను ప్రదర్శిస్తుంది. మీకు నచ్చిన రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ మోడల్‌ను ఎంచుకున్న అనంతరం రెంట్‌ వివరాలను చూపిస్తుంది.

ఆ తర్వాత ఫారమ్‌ను ఫిల్‌ చేసి సబ్‌మిట్‌ చేసిన అనంతరం బైక్‌ ఆపరేటర్ వివరాలు అందిస్తుంది. ఇంకా ఈ బైక్‌ అద్దెకు నడపాలి అనుకుంటే రీఫండబుల్ డిపాజిట్ చెల్లించాల్సి ఉంటుంది. బైక్‌ను రైడ్‌ చేశాక.. అద్దె స్టేషన్‌లో బైక్‌ను ఇచ్చిన తర్వాత ఈ డిపాజిట్‌ మొత్తం కస్టమర్లకు చెల్లిస్తారు. రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్స్‌ రెంటల్‌ విధానం వెనుక ఉన్న విజన్‌ను చీఫ్ బ్రాండ్ ఆఫీసర్ మోహిత్ ధర్ జయాల్ వివరించారు.

Royal-Enfield-Rental

రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ మోటార్‌సైకిల్ రెంటల్‌ ప్రాసెస్‌పై టూర్ ఆపరేటర్లు, మెకానిక్‌లు స్వచ్ఛమైన మోటార్‌సైక్లింగ్ మిషన్‌ను రూపొందించడంలో కీలక పాత్ర పోషించారని మోహిత్‌ తెలిపారు. కొత్త రాయల్ ఎన్‌ఫీల్డ్‌ రెంటల్స్ ప్రోగ్రామ్ భారతదేశం అంతటా తమ బైక్‌లకు యాక్సెస్‌ను అందిస్తుందన్నారు. అది అద్దె నిర్వాహకులకు విలువైన మద్దతునిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

రాయల్ ఎన్‌ఫీల్డ్‌ ఇప్పుడు భారతీయ మార్కెట్ కోసం ఫ్లెక్స్-ఫ్యూయల్ బైక్‌లను తయారు చేయనుంది. చెన్నైకి చెందిన ద్విచక్ర వాహన తయారీ సంస్థ తన మొదటి ఫ్లెక్స్-ఫ్యూయల్ బైక్‌ను 2024లో విడుదల చేయనుంది. అయితే ప్రస్తుతానికి, రాయల్ ఎన్‌ఫీల్డ్ తన ఏ బైక్‌ను ఫ్లెక్స్-ఇంధనంతో నడపడానికి సవరించనుందనే సమాచారం వెల్లడి కాలేదు. అత్యంత ఆదరణ పొందిన రాయల్ ఎన్‌ఫీల్డ్(Royal Enfield Classic 350) క్లాసిక్ 350ని సవరించే అవకాశం ఉంది.

రాయల్ ఎన్‌ఫీల్డ్‌ క్లాసిక్ 350 బైక్ బ్రాండ్ అత్యధికంగా అమ్ముడైన బైక్. ఇది ఫ్లెక్స్-ఫ్యూయెల్‌తో నడుస్తుంది. క్లాసిక్ 350 కొత్త J- ప్లాట్‌ఫారమ్‌పై ఆధారపడి ఉంటుంది. అందువల్ల, J-ప్లాట్‌ఫారమ్‌పై ఆధారపడిన ఇతర మోటార్‌సైకిళ్లు భవిష్యత్తులో ఫ్లెక్స్-ఫ్యూయెల్‌కి సపోర్ట్‌ చేసే అవకాశం ఉంది. ఇతర బైక్‌లు మెటోర్ 350, హంటర్(Royal Enfield Hunter) 350 మరియు క్లాసిక్ 350 వంటి అదే ప్లాట్‌ఫారమ్‌పై ఆధారపడి ఉంటాయి.

More from DriveSpark

Article Published On: Thursday, September 21, 2023, 16:33 [IST]
English summary
Royal enfield bikes rental program in 25 cities across india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+