అప్పట్లో బుల్లెట్ ధర రూ. 18,700.. వైరల్ అవుతున్న 1986 నాటి బిల్: ఇక్కడ చూడండి

ఆధునిక కాలంలో ఎక్కువ మంది ఇష్టపడే బైకులలో 'రాయల్ ఎన్‌ఫీల్డ్' ప్రధానంలో చెప్పుకోదగ్గది. కావున ప్రస్తుతం ఈ రాయల్ ఎన్‌ఫీల్డ్ బైకులు ఎక్కడపడితే అక్కడ రోడ్లమీద విరివిగా కనిపిస్తున్నాయి. అయితే ఒకప్పుడు ఈ బైకులు అక్కడక్కడా కనిపించేవి. ఈ రోజు రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్ ధర ఎలా ఉందో అందరికి తెలుసు. అయితే 1986 లో రాయల్ ఎన్‌ఫీల్డ్ ధర రూ. 18,700 మాత్రమే. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

అప్పట్లో బుల్లెట్ ధర రూ. 18,700.. వైరల్ అవుతున్న 1986 నాటి బిల్: ఇక్కడ చూడండి

ఇటీవల ఇంటర్నెట్‌లో హల్ చల్ చేస్తున్న ఒక పోస్ట్ చూస్తే 1986 లో రాయల్ ఎన్‌ఫీల్డ్ ధర ఎలా ఉందొ తెలిసిపోతుంది. ఈ పోస్ట్ రాయల్ ఎన్‌ఫీల్డ్ 4567k ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ఇందులో మీరు గమనించినట్లయితే ఇది 1986 జనవరి 23 నాటిదని తెలుస్తోంది. ఇది కూడా M/s R S ఇంజనీరింగ్ ఇండస్ట్రీస్ పేరు మీద బిల్ చేయబడింది. ఇందులో ఈ బైక్ ఖరీదు రూ. 18,800 అని తెలుస్తోంది. అయితే ఇందులో రూ. 250 డిస్కౌంట్ లేదా ఇతరత్రా కారణాల వల్ల తగ్గించడం జరిగింది. అంతే కాకుండా దీనికి రూ. 150 కలిపారు.

అప్పట్లో బుల్లెట్ ధర రూ. 18,700.. వైరల్ అవుతున్న 1986 నాటి బిల్: ఇక్కడ చూడండి

ఈ బిల్ ప్రకారం 1986 లో రాయల్ ఎన్‌ఫీల్డ్ ఖరీదు రూ. 18,700 అని స్పష్టమవుతోంది. ఈ బిల్ కూడా అప్పట్లో చేతి వ్రాత ద్వారా రాయబడింది. అంతే కాకుండా బైక్ మోడల్ బుల్లెట్ 350 సిసి అని ఇందులో గమనించవచ్చు. అయితే ఇప్పుడు ధరలు పోల్చుకుంటే దాదాపు 10 కంటే ఎక్కువ రెట్లు పెరిగినట్లు తెలుస్తోంది.

అప్పట్లో బుల్లెట్ ధర రూ. 18,700.. వైరల్ అవుతున్న 1986 నాటి బిల్: ఇక్కడ చూడండి

ఈ బిల్లు ప్రకారం, ఆ సమయంలో జార్ఖండ్ లోని బొకారో స్టీల్ సిటీలోని కొఠారి మార్కెట్లో ఉన్న సందీప్ ఆటో కంపెనీ డీలర్‌షిప్ అని అర్థమవుతోంది. అంతే అప్పట్లోనే అక్కడ కంపెనీ డీలర్‌షిప్ ఉంది. ఈ బిల్లు మీద రాయల్ ఎన్‌ఫీల్డ్ లోగో ఉంది. అప్పట్లో బుల్లెట్ 350 ధర రూ. 18,700 కాగా, ప్రస్తుతం స్టాండర్డ్ బుల్లెట్ 350 ఆన్ రోడ్ ధర సుమారు రూ .1.7 లక్షల వరకు ఉంది.

అప్పట్లో బుల్లెట్ ధర రూ. 18,700.. వైరల్ అవుతున్న 1986 నాటి బిల్: ఇక్కడ చూడండి

చెన్నైకి చెందిన బైక్ తయారీ సంస్థ రాయల్ ఎన్‌ఫీల్డ్ గత కొన్ని సంవత్సరాలుగా అభివృద్ధి చెందుతూనే ఉంది. అయితే 1901 లో ఇంగ్లాండ్ లోని వోర్సెస్టర్ షైర్, రెడ్దిచ్ కు చెందిన కంపెనీ తమ మొదటి రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ బైక్ తయారు చేసింది. ఆ తరువాత భారతీయ కార్ల తయారీ సంస్థ ఐషర్ మోటార్స్ లిమిటెడ్ లో భాగమైన భారత సంతతికి చెందిన మద్రాస్ మోటార్స్ రాయల్ ఎన్ఫీల్డ్ నుండి లైసెన్స్ పొందింది.

అప్పట్లో బుల్లెట్ ధర రూ. 18,700.. వైరల్ అవుతున్న 1986 నాటి బిల్: ఇక్కడ చూడండి

ప్రస్తుతం వెలుగులోకి వచ్చిన బిల్ ప్రకారం, అందులో స్టాండర్డ్ 350 సిసి బైక్ ఉంది. ఇది కంపెనీ లైనప్ లో చాలా ముఖ్యమైన బైక్. ఇది భారతదేశానికి స్వతంత్రం వచ్చిన మొదట్లో వినియోగించడానికి ఎక్కువగా ఉపయోగించేవారు. కొత్త పరిపాలన సరిహద్దు గస్తీలో తన సైన్యం ఉపయోగించడానికి తగిన మోటార్ బైక్ ఈ బుల్లెట్ అయింది. 1954 లో ప్రభుత్వం 800 యూనిట్ల 350 సిసి బైకులను కొనుగోలు చేసింది. దీన్ని బట్టి చూస్తే అప్పట్లోనే ఈ బైక్ ఎంత ఆదరణ పొందిందో అర్థమవుతుంది.

అప్పట్లో బుల్లెట్ ధర రూ. 18,700.. వైరల్ అవుతున్న 1986 నాటి బిల్: ఇక్కడ చూడండి

రెడ్డిచ్ బిజినెస్ భారతదేశంలోని మద్రాస్ మోటార్స్ తో కలిసి 1955 లో "ఎన్ఫీల్డ్ ఇండియా" ను సృష్టించింది, తద్వారా మద్రాసు లైసెన్స్ కింద 350 సిసి రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ మోటార్ బైక్ ఉత్పత్తి చేసింది. దాదాపు 70 సంవత్సరాలు తరువాత ఏకంగా భారతీయ మార్కెట్లో తిరుగులేని బైకుగా చెలామణి అవుతోంది.

అప్పట్లో బుల్లెట్ ధర రూ. 18,700.. వైరల్ అవుతున్న 1986 నాటి బిల్: ఇక్కడ చూడండి

ప్రస్తుతం రాయల్ ఎన్‌ఫీల్డ్ అత్యంత ప్రజాదరణ పొందిన టూ వీలర్ బ్రాండ్. అంతే కాకుండా ఎక్కువ అమ్మకాలు పొందుతున్న బ్రాండ్స్ లో కూడా ఇది ఒకటి. పకంపెనీ ఎప్పటికప్పుడు అప్డేటెడ్ బైకులను విడుదల చేస్తూ శరవేగంగా ముందుకు దూసుకెళ్తోంది. ప్రస్తుతం 350 సిసి విభాగంలో అధిక ప్రాధాన్యత పొందిన ఈ బ్రాండ్ ప్రస్తుతం 450 స్పీచ్ డ్యూయల్ ఓవర్ హెడ్

ఏడు దశాబ్దాల తరువాత కంపెనీ ఇప్పుడు దేశంలో అత్యంత విజయవంతమైన ద్విచక్ర వాహన బ్రాండ్లలో ఒకటిగా మారింది. ప్రస్తుతం ఇది బహుళ విభాగాలలో ప్రొడ్ కట్ లను కలిగి ఉంది మరియు భవిష్యత్తులో మరిన్ని ప్రవేశపెట్టే మార్గంలో ఉంది. కంపెనీ ప్రస్తుతం సరికొత్త 450 సిసి డ్యూయల్ ఓవర్ హెడ్ క్యామ్‌షాఫ్ట్ ఇంజిన్ మీద పనిచేస్తోంది.

అప్పట్లో బుల్లెట్ ధర రూ. 18,700.. వైరల్ అవుతున్న 1986 నాటి బిల్: ఇక్కడ చూడండి

ఇక సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ బిల్లుకు ఇప్పటి వరకు 53 వేలకు పైగా లైకులు వచ్చాయి. అంతే కాకుండా ఒక వ్యక్తి తన వద్ద 1984 నాటి మోడల్ ఉందని, దాని ధర రూ. 16,100 మాత్రమేనని వెల్లడించాడు. 38 సంవత్సరాలు అయినా ఇప్పటికీ అది తన వద్ద భద్రంగా ఉందని తెలిపాడు. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి తెలుగు డ్రైవ్‌స్పార్క్ ఛానల్ చూస్తూ ఉండండి.

More from DriveSpark

Article Published On: Monday, January 2, 2023, 13:39 [IST]
English summary
Royal enfield bullet price in 1986 details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+