ఫ్లెక్స్ ఫ్యూయల్‌తో నడిచేలా రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్ తయారీ.. ఎప్పుడు విడుదల కానుందంటే..?
ప్రపంచంలోనే తొలిసారిగా ప్రముఖ కార్ల తయారీ సంస్థ టయోటా.. ఇథనాల్‌లో నడిచే ఇన్నోవో MPVను భారత్‌లో విడుదల చేసింది. కొన్ని రోజుల క్రితం కేంద్ర రవాణా, రహదారులు శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఈ కారును విడుదల చేశారు. ఈ కారు హైబ్రిడ్ టెక్నాలజీతో అందుబాటులోకి వచ్చింది. అంటే ఎలక్ట్రిఫైడ్ ఫీచర్‌ను కూడా కలిగి ఉంది.
దేశంలో కాలుష్యాన్ని నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం ఇటువంటి ప్రత్యా్మ్నాయ ఇంధనాల వినియోగాన్ని ప్రోత్సహిస్తోంది. అయితే ఇదే సమయంలో రాయల్ ఎన్‌ఫీల్డ్ కీలక ప్రకటన చేసింది. ఇదే తరహా ఫ్లెక్స్ ఫ్యూయల్‌తో నడిచే బైక్ తయారీపై పనిచేస్తున్నట్లు వెల్లడించింది. 2024 మూడో త్రైమాసికంలో ఫ్లెక్స్ ఫ్యూయల్ విడుదల కావచ్చని తెలిపింది.

అయితే ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఏ వాహనాన్ని ఫ్లెక్స్ ఫ్యూయల్‌తో నడిచే బైక్‌గా అభివృద్ధి చేస్తున్నారనే వివరాలను రాయల్ ఎన్‌ఫీల్డ్ వెల్లడించలేదు. అయితే అత్యధికంగా విక్రయాలు నమోదు చేసిన క్లాసిక్ 350 బైక్‌ను ఫ్లెక్స్ ఫ్యూయల్‌గా అభివృద్ధి చేస్తుందని భావిస్తున్నాం. రాయల్ ఎన్‌ఫీల్డ్ మాత్రమే TVS, హోండా సహా ఇతర సంస్థలు కూడా ఫ్లెక్స్ ఇంధనంతో నడిచే వాహనాలను తయారు చేస్తున్నాయి.
దేశానికి ముడి చమురు దిగుమతి చేసుకొనేందుకు ప్రభుత్వం భారీగా ఖర్చు చేస్తోంది. దీంతోపాటు దేశంలో కాలుష్యం భారీగా పెరుగుతోంది. ఈ ప్రత్యామ్నాయ ఇంధనంతో నడిచే వాహనాలను ప్రోత్సహించడం ద్వారా పెట్రోల్ డిమాండ్ కూడా తగ్గుతుందని ప్రభుత్వం భావిస్తోంది. దీంతోపాటు పెట్రోల్-ఇథనాల్ ద్వారా కాలుష్యం తగ్గుతుంది. ఇటువంటి అనేక కారణాలతో ఫ్లెక్స్ ఫ్యూయల్ వాహనాలను ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది.
ప్రముఖ వాహన తయారీ సంస్థలు కూడా ఇటువంటి వాహనాల ఉత్పత్తిని వేగవంతం చేస్తున్నాయి. ఫ్లెక్స్ ఇంధనం గ్యాసోలిన్, ఇథనాల్ మిశ్రమం ప్రస్తుతం E10 పెట్రోల్ మాత్రమే అందుబాటులో ఉంది. త్వరలో E20 వాహనాలు అందుబాటులోకి రానున్నాయి. BS6 స్టేజ్ 2 వాహనాలు ఇటువంటి ఇంధనంతో నడిచే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి.
పెట్రోల్‌తో పోల్చితే ఇథనాల్‌ను ఉత్పత్తి చేసేందుకు చాలా తక్కువ ఖర్చు అవుతుంది. ఇథనాల్ పూర్తిగా వ్యవసాయ వ్యర్థాలతో తయారు చేయవచ్చు. ఫలితంగా ఇతర దేశాలపై ఆధారపడకుండా ప్రత్యామ్నాయ ఇంధనాన్ని సొంతంగా తయారుచేసుకోవచ్చు. ఫలితంగా కాలుష్యం కూడా నియంత్రణలోకి వస్తుందని ప్రభుత్వం భావిస్తోంది.
టయోటా ఇన్నోవా హైక్రాస్ ఫ్లెక్స్ ఫ్యూయల్ ఎంపీవీ విడుదల సందర్భంగా నితిన్ గడ్కరీ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రత్యామ్నాయ ఇంధనాన్ని వినియోగించడం వల్ల ముడిచమురు దిగుమతులు తగ్గుతాయని, ఫలితంగా ఆర్థిక వ్యవస్థ మెరుగుపడుతుందని పేర్కొన్నారు. దీంతోపాటు కాలుష్యం కూడా గణనీయంగా తగ్గుతుందని తెలిపారు. దేశంలో సుమారు 40 శాతం కాలుష్యానికి కేవలం వాహన ఉద్గారాలే కారణం అని తెలిపారు. కాలుష్యం కారణంగా ఢిల్లీ ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు.
ప్రత్యామ్మాయ, జీవ ఇంధనాల వినియోగాన్ని ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా కృషిచేస్తోందని మంత్రి చెప్పారు. గత సంవత్సరం ఇథనాల్‌తో కూడిన పెట్రోల్‌ను ప్రవేశపెట్టింది. 2025 సంవత్సరం నాటికి దేశంలో సుమారుగా అన్ని వాహనాల్లో 20 శాతం ఇథనాల్ ఇంధనాన్ని వినియోగించాలని ప్రభుత్వం భావిస్తోంది.
డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, Threads, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications








