Royal Enfield EV Bike రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి సర్‌ప్రైజ్.. త్వరలోనే కరెంట్ తో నడిచే బుల్లెట్ విడుదల..!
దేశంలో రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్ కి యువతలో చాలా క్రేజ్ ఉంది. ఆ కంపెనీ నుంచి వివిద మోడళ్లలో బైక్ లు భారీగా ఆకట్టుకుంటున్నాయి. మరీ ముఖ్యంగా యువకులకు ఈ బైక్స్ వరంగా ఉన్నాయి. ఎక్కువగా 18 నుంచి 35 ఏళ్ల మధ్య వయస్కులు ఈ బైక్స్ ని కొనుగోలు చేస్తున్నారు. మార్కెట్ లో లభించే ప్రీమియం బైక్స్ లో ఇవి ఎక్కువగా సేల్ అవుతున్నాయి.
దేశంలో రోజు రోజుకుర ద్విచక్ర వాహనాల మార్కెట్ పుంజుకుంటుంది. దానికి తోడు ఎలక్ట్రిక్ వాహనాలు (EV)ల కొనుగోలు వేగంగా జరుగుతోంది. అందుకు తగినట్లుగానే యువత కోసం వీటిని ఎంచుకుంటున్నారు. మారుతన్న కాలనుగుణంగా 'రాయల్ ఎన్‌ఫీల్డ్' EVలను పరిచయం చేయనుంది. రాబోయే రోజుల్లో ట్రెండ్‌గా మారనున్న ఈవీ కొనుగోళ్ల కోసం కంపెనీ కొత్త ఎలక్ట్రిక్ బైక్‌లను పరిచయం చేయనుంది.

త్వరలోనే అందుబాటులోకి..
ప్రస్తుతం దేశంలో ఓలా, ఈథర్, టీవీఎస్, హీరో, బజాజ్ కంపెనీలు ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల మార్కెట్లో తమ ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. కాకపోతే ఇవి కేవలం స్కూటర్లను మాత్రమే పరిమితమయ్యాయి. కొన్ని స్టార్టప్ సంస్థలు మినహా ఏ పెద్ద కంపెనీ బైక్‌లను ఉత్పత్తిపై దృష్టి సారించడం లేదు. దీనిని పరిగణలోకి తీసుకున్న రాయల్ ఎన్ ఫీల్డ్ తన సొంత ఆకర్షణీయమైన ఎలక్ట్రిక్ బైక్‌లను తయారు చేయనున్నట్లు వెల్లడించింది.
ఈ కంపెనీ నుంచి సరికొత్త రెండు ఎలక్ట్రిక్ మోటార్‌సైకిళ్లను అభివృద్ధి చేయనుంది. ఆ బైక్‌లలో ఒకదానిని (L1A కోడ్‌నేమ్)గా నామకరణం చేసినట్లు రాయల్ ఎన్‌ఫీల్డ్ నిపుణులు స్వయంగా వెల్లడించారు. స్పానిష్ ఎలక్ట్రిక్ వెహికల్ స్టార్టప్ 'స్టార్క్' సహకారంతో మరో మోటార్ సైకిల్ తయారు చేస్తున్నట్లు చెప్పింది.
తొలి ఎలక్ట్రిక్ బైక్..
ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్‌లో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉన్న స్టార్క్ కంపెనీ యొక్క ఆఫ్-రోడ్ మోటార్‌సైకిల్ 80 bhp శక్తిని ఉత్పత్తి చేస్తుందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. 2 గంటల్లో ఛార్జ్ చేస్తే దాదాపు 6 గంటలు ప్రయాణించవచ్చు. ఈ సంస్థ నుంచి వస్తున్న తొలి ఎలక్ట్రిక్ బైక్ గా ఇది నిలువనుంది.
ఈ అధునాతన రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్‌లకు సంబంధించి రేంజ్ తో పాటు ఇతర పవర్‌ట్రెయిన్ ఫీచర్ల గురించి ఎటువంటి సమాచారం అందుబాటులో లేదు. వీటిలో ఆఫ్ రోడ్ బైక్స్ అంటే చాలా మంది యువత ఇష్టపడతారు. ప్రస్తుత సమాచారం ప్రకారం హిమాలయన్ మోటార్‌సైకిల్ ఉన్నట్లు కొత్త ఎలక్ట్రిక్ బైక్‌లను రూపకల్పన చేయనున్నట్లు మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.
2024 ప్రథమార్థంలో మార్కెట్ లోకి..
L1A కోడ్ పేరుతో లాంఛ్ అవుతున్న బైక్ విషయానికి వస్తే ఇది ఈ సంవత్సరం చివరి నాటికి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. అయితే ఇది భారతీయ మార్కెట్లోకి వచ్చే ఏడాది (2024) ప్రథమార్థంలో విడుదల కానుంది. ఎలక్ట్రిక్ వెహికిల్ కావడం ప్రీమియం లుక్స్ తదితర అంశాలను బేరీజు వేసుకుంటే దీని ధర ఎక్కువగా ఉండే అవకాశం ఉంది.
శతాబ్దానికి పైగా రాయల్ ఎన్‌ఫీల్డ్ ప్రీమియం బ్రాండ్ లో దూసుకెళ్తుంది. ఇప్పుడు ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల తయారీ వైపు మళ్లడంతో కొత్త ఊహగానాలు పెరిగాయి. త్వరలోనే ఈ సంస్థకు సంబంధించి కొత్త ఫ్యాక్టరీని ప్రారంభించేందుకు తమిళనాడులోని చెయ్యార్‌లో 60 ఎకరాల భూమిని సేకరించి రూ.1,500 కోట్లు పెట్టుబడి పెట్టాలని నిర్ణయించింది.
ప్రస్తుతం మార్కెట్లో రాయల్ ఎన్ఫీల్డ్ హంటర్ 350 దీని ధర రూ.1,49,900, క్లాసిక్ 350 రూ.1,90,092కు అందుబాటులో ఉన్నాయి. అలానే బుల్లెట్ 350 రూ.1,50,999, కాంటినెంటల్ జీటీ 650 రూ.3,19,000, హిమాలయన్ రూ.2,15,900, సూపర్ మీటోర్ 650 రూ.3,48,900, ఇంటర్‌సెప్టర్ 650 రూ.3,03,000 వంటి మరిన్నీ మోడళ్లను ఆ సంస్థ విక్రయిస్తోంది.


Click it and Unblock the Notifications








