రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ హిమాలయన్‌ 450 డెలివరీలు ప్రారంభం.. ధర రూ. 2.69 లక్షలు, ఆ రోజు వరకే ఆఫర్‌.!!

భారత మార్కెట్లో ప్రముఖ ప్రీమియం మోటార్‌ సైకిల్‌ బ్రాండ్‌ రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌. ఇంజిన్ సౌండ్‌, స్టైలిష్‌ డిజైన్‌తో కుర్రకారు మనసులను దోచుకుంటున్న రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌... సరికొత్త అప్‌డేట్లతో ముందుకు వస్తోంది. కాగా ఇటీవల ఈ సంస్థ నుంచి భారీ అంచనాలతో హిమాలయన్‌ 450 బైక్‌ విడుదలైంది. ఈ బైక్‌ డెలివరీలు ఈ రోజు నుంచి ప్రారంభమయ్యాయి.

రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ హిమాలయన్‌ 450(Royal Enfield Himalayan 450) బైక్‌ డెలివరీలు ఈ రోజు నుంచి మొదలయ్యాయి. రూ. 2.69 లక్షల(ఎక్స్ షోరూమ్‌) ప్రారంభ ధరతో సంస్థ ఈ బైక్‌ను లాంచ్ చేసింది. కాగా ఈ ధర ఈ ఏడాది చివరి వరకే అందుబాటులో ఉంటుంది. ఆ తర్వాత ధరలు మారే అవకాశాలు ఉన్నాయి. ఈ బైక్‌ ఫీచర్లు, డిజైన్‌, పర్ఫామెన్స్‌ను పరిశీలిస్తే..

Royal-Enfield-Himalayan-450

కొత్త హిమాలయన్ 450 బైక్‌ మార్కెట్లో మూడు వేరియంట్లలో అందుబాటులో ఉంది. అయితే ఈ మూడు వేరియంట్ల మధ్య వ్యత్యాసం రంగుల్లో మాత్రమే.. కాగా మునుపటి వెర్షన్‌ అడ్వెంచరస్‌ బైక్‌ రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ మోటార్‌సైకిల్‌ విభాగంలో సరసమైన, మెరుగైన పనితీరుతో ప్రశంసలు అందుకుంది.

ఇక రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ హిమాలయన్ 450 ఇంజిన్‌ పనితీరు విషయానికొస్తే.. ఇది కొత్త 452 cc లిక్విడ్ కూల్డ్ DOHC సింగిల్ సిలిండర్ ఇంజిన్‌తో వస్తుంది. ఈ ఇంజిన్ 40 బీహెచ్‌పీ పవర్, 40 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజిన్ 6 స్పీడ్ గేర్‌బాక్స్‌తో జత చేయబడి ఉంటుంది.

Royal-Enfield-Himalayan-450

రాయల్ ఎన్‌ఫీల్డ్‌ హిమాలయన్ 450 బైక్‌లో ఎకో, పెర్ఫార్మెన్స్ అనే రెండు విభిన్న రైడింగ్ మోడ్‌లను ప్రవేశపెట్టింది. డిజైన్‌ను పరిశీలిస్తే LED లైటింగ్‌తో ఆకర్షణీయంగా ఉంటుంది. ఇందులో స్పెసిఫికేషన్‌లను అప్‌డేట్‌ చేశారు. స్లిప్పర్ క్లచ్, అసిస్ట్ క్లచ్ కూడా స్టాండర్డ్‌గా అందించారు. కాగా ఈ బైక్ బరువు 196 కిలోలు.

మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా ఈ బైక్‌లో అధునాతన ఫీచర్లు అందించారు. పూర్తి LED లైటింగ్, రైడ్ బై వైర్, స్విచబుల్‌ ABS, నావిగేషన్, బ్లూటూత్ కనెక్టివిటీతో కూడిన పెద్ద సర్క్యులర్‌ TFT స్క్రీన్‌ను పొందుపరిచారు. భారత మార్కెట్లో రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ 450 KTM 390 అడ్వెంచర్‌కు గట్టి పోటీ ఇవ్వనుంది.

Royal-Enfield-Himalayan-450

రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ హిమాలయన్‌ 450 బైక్‌ బ్రేకింగ్ విషయానికి వస్తే.. దీనిని మునుపటి వెర్షన్‌ కంటే మరింతగా మెరుగుపరిచారు. బైక్ ముందు 320 mm డిస్క్ బ్రేక్, వెనుక వైపు 270 mm డిస్క్ బ్రేక్‌ను కలిగి ఉంటుంది. బైక్‌లో ముందువైపు 21 అంగుళాల వీల్స్‌, వెనుకవైపు 17 అంగుళాల వీల్స్‌ను అమర్చారు.

కొత్త హిమాలయన్ 450 గ్రౌండ్ క్లియరెన్స్ 230 mm కాగా ముందు మరియు వెనుక ఫోర్కులు 200 mm గా ఉన్నాయి. ఇందులో సరికొత్త ట్విన్-స్పార్ ఫ్రేమ్, 17 లీటర్ల ట్యాంక్‌ కెపాసిటీ ఇంజిన్‌తో మరింత ఆకర్షణీయంగా ఉంది. మార్కెట్లో యెజ్డీ అడ్వెంచర్, బీఎమ్‌డబ్ల్యూ జీ 310 జీఎస్, ట్రయంఫ్ స్క్రాంబ్లర్ 400 ఎక్స్‌ వంటి అడ్వెంచర్‌ సెగ్మెంట్‌ బైక్‌లతో పోటీపడుతుంది.

Royal-Enfield-Himalayan-450

More from DriveSpark

Article Published On: Thursday, November 30, 2023, 15:22 [IST]
English summary
Royal enfield himalayan 450 bike deliveries commence in india check details here
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+