రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ 450 బైక్ లాంచ్.. ధర రూ. 2.69 లక్షలు
భారత మార్కెట్లో అడ్వెంచర్ మోటార్ సైకిల్ విభాగంలో రైడర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న బైక్ రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ 450(Royal Enfield Himalayan 450). అద్భుతమైన పనితీరు, తక్కువ ధరలో ఇప్పటికే హిమాలయన్ ప్రాచుర్యం పొందింది. కాగా ఇప్పుడు అప్‌డేటెడ్ మోడల్ హిమాలయన్ 450 నేడు లాంచ్ అయింది. ఇప్పటికే ఈ బైక్ ఆవిష్కరణతో కస్టమర్లలో భారీ అంచనాలను కలిగి ఉంది.
కాగా ఇటీవల రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ 450 బైక్‌ను ఆవిష్కరించిన తర్వాత బుకింగ్‌లు జోరందుకున్నాయి. హిమాలయన్ పేరుతో రెండో వెర్షన్ బైక్ ఇది. ఈ క్రమంలో రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ 450 బైక్‌ను గోవాలో 2023 మోటోవర్స్ ఎక్స్‌పోలో అధికారికంగా మార్కెట్‌లోకి విడుదల చేశారు. ఈ బైక్ ధర రూ. 2.69 లక్షలు(ఎక్స్ షోరూమ్)గా ప్రకటించారు.

ఈ క్రమంలో కొత్త రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ 450ను ఫీచర్ల పరంగా పాత మోడల్‌తో పోలిస్తే అప్‌గ్రేడ్ చేశారు. ఈ కొత్త బైక్‌లో పూర్తి LED లైటింగ్ సిస్టమ్ ఉంటుంది. రైడ్ బై రైడ్, స్విచ్ యాక్సెసబుల్ ABS, నావిగేషన్, బ్లూటూత్ కనెక్టివిటీతో కూడిన పెద్ద సర్క్యులర్ TFT స్క్రీన్ ఫీచర్లు ఉన్నాయి. ఈ అడ్వెంచరస్ బైక్ మార్కెట్లో KTM 390 అడ్వెంచర్‌కి గట్టి పోటీ ఇవ్వనుంది.
ఇంజిన్ విషయానికొస్తే కొత్త రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ 450 కొత్త పవర్‌ట్రెయిన్‌ను కలిగి ఉంటుంది. 450 సీసీ లిక్విడ్ కూల్డ్ ఓవర్‌హెడ్ కామ్‌షాఫ్ట్ 4 వాల్వ్ ఇంజిన్‌ను కలిగి ఉంటుంది. ఈ బైక్ 3000 rpm వద్ద గరిష్టంగా 40 bhp పవర్ మరియు 40 nm గరిష్ఠ టార్క్‌ను ఉత్పత్తి చేసేలా ఇంజిన్ రూపొందించారు. అంతే కాకుండా ఈ బైక్ ఇంజిన్ 6 స్పీడ్ గేర్‌బాక్స్‌తో జత చేయబడి ఉంటుంది.

కొత్త రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ 450 లోని స్పెసిఫికేషన్‌లను పరిశీలిస్తే.. ఈ బైక్‌లో స్లిప్పర్ క్లచ్, అసిస్ట్ క్లచ్‌ను స్టాండర్డ్ ఫీచర్‌గా అందించారు. ఈ బైక్ బరువు 196 కిలోలు. పాత మోడల్ కంటే 3 కిలోలు తక్కువ. ఇక బ్రేకింగ్ విషయానికి వస్తే, హిమాలయన్ 450లో పాత మోడల్ కంటే మెరుగ్గా ఉండనుంది.
కొత్త హిమాలయన్ 450 బైక్ ముందు 320 mm డిస్క్ బ్రేక్ మరియు వెనుక 270 mm డిస్క్ బ్రేక్ కలిగి ఉంటుంది. బైక్‌లో ముందువైపు 21 అంగుళాల వీల్స్, వెనుకవైపు 17 అంగుళాల వీల్స్‌ను అమర్చారు. కాగా ఈ అడ్వెంచర్ బైక్ పెట్రోల్ ట్యాంక్ కెపాసిటీ 17 లీటర్లుగా ఉంటుందని సమాచారం.

కాగా కొత్త రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ 450 బైక్ మొత్తం 3 వేరియంట్లలో అందుబాటులో ఉండనుంది. ఎకో, ఫర్మామెన్స్ Rear ABS ON, ఫర్మామెన్స్ (Rear ABS Off) మోడ్‌లుగా ఉన్నాయి. ఇంకా ఈ బైక్ 230mm గ్రౌండ్ క్లియరెన్స్‌ను కలిగి ఉంటుంది.
ఇంకా కొత్త హిమాలయన్ 450 బైక్ మూడు వేరియంట్లలో రానుంది. హిమాలయన్ (Himalayan), హిమాలయన్ పాస్ (Himalayan Pass), హిమాలయన్ సమ్మిట్ (Himalayam Summit) వేరియంట్లలో విక్రయించనున్నారు. కాగా వేరియంట్ల ప్రకారం బైక్ ధరలు మారనున్నాయి. ఒక్కో వేరియంట్ మధ్య రూ. 5 వేల వరకు వ్యత్యాసం ఉంది.

బేస్ వేరియంట్ హిమాలయన్ గాజా బ్రౌన్ కలర్ ధర రూ. 2.69 లక్షలు.. మిడ్ లెవెల్ వేరియంట్ స్లేట్ హిమాలయన్ రూ. 2.74 లక్షలు.. స్లేట్ పాపీ బ్లూ కలర్స్ ఇంకా.. టాప్ ఎండ్ వేరియంట్ కామెట్ వైట్.. రూ. 2.79 లక్షలు కాగా హాన్లే బ్లాక్ కలర్ రూ. 2.84 లక్షలుగా ప్రకటించింది.

కొత్త రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ 450.. కేటీఎం 350 బైక్‌తో పాటు యెజ్డీ అడ్వెంచర్, బీఎండబ్ల్యూ జీ 310 జీఎస్, ట్రయంఫ్ స్క్రాంబ్లర్ 400 ఎక్స్‌లతో నేరుగా పోటీపడనుంది. ఈ బైక్‌లన్నీ ప్రస్తుతం భారత మార్కెట్లో అడ్వెంచర్ సెగ్మెంట్‌లో భారీ డిమాండ్ కలిగి ఉన్న మోటార్‌సైకిళ్లు.



Click it and Unblock the Notifications








