Royal Enfield Himalayan 450 బైక్‌ ఆవిష్కరణ.. పాత మోడల్ కంటే మెరుగైన ఫీచర్లు..!

రాయల్ ఎన్‌ఫీల్డ్‌ హిమాలయన్‌ 450 (Royal Enfield Himalayan 450) మోటార్‌ సైకిల్‌ను ఆవిష్కరించారు. EICMA 2023 ఈవెంట్‌లో ఈ బైక్‌ను లాంచ్‌ చేసింది. హిమాలయన్‌ పేరును కలిగి ఉన్న రెండో జనరేషన్‌ బైక్‌ ఇది. ఈ బైక్‌ బుకింగ్‌లు ఇవాళ్టి నుంచి ప్రారంభం అయ్యాయి.

రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ ఎలక్ట్రిక్‌ వెర్షన్‌ బైక్‌ను (Royal Enfield Electric version) కూడా ఇవాళ ఆవిష్కరించింది. ఈ బైక్‌ సైడ్‌ ప్లేట్లపైన HIM-E పేరును గుర్తించవచ్చు. అయితే ఎలక్ట్రిక్ వెర్షన్‌ గుర్తించి ఇతర వివరాలను రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ వెల్లడించలేదు. త్వరలో వెల్లడించే అవకాశం ఉంది.

Royal Enfield Himalayan 450 bike

రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ హిమాలయన్‌ 450 కొత్త పవర్‌ట్రైయిన్‌ను కలిగి ఉంటుంది. ఈ బైక్‌ 451.65cc లిక్విడ్‌ కూల్డ్‌ డ్యూయల్‌ ఓవర్‌హెడ్‌ కామ్‌షాఫ్ట్‌, 4 వాల్వ్‌ ఇంజిన్‌ను కలిగి ఉంటుంది. ఈ బైక్‌ ఇంజిన్‌ 84mm బోర్‌ మరియు 81.5mm స్ట్రోక్‌ను కలిగి ఉంటుంది. ఈ ఇంజిన్ 8000rpm వద్ద 39.5bhp శక్తిని ఉత్పత్తి చేస్తుంది. 5500rpm వద్ద 40Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజిన్‌ 6-స్పీడ్‌ గేర్‌బాక్స్‌ను కలిగి ఉంటుంది.

హిమాలయన్‌ 450 మోటార్‌ సైకిల్ ముందువైపు 43mm USD ఫోర్క్‌లు, వెనుకవైపు మోనోషాక్‌ సస్పెన్షన్‌ను కలిగి ఉంది. బ్రేకింగ్ విషయానికి వస్తే ముందువైపు 320mm డిస్క్‌, వెనుకవైపు 270mm డిస్క్‌ బ్రేకులను కలిగి ఉంటుంది. ఈ బైక్ డ్యూయల్‌ ఛానల్‌ ABS ఫీచర్‌ను కలిగి ఉంటుంది. రైడర్ వెనుక ABSను ఆఫ్‌ చేసుకొనే అవకాశం ఉంది.

Royal Enfield Himalayan 450 motor cycle

తొలిసారిగా రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ హిమాలయన్‌ 450 మోటార్‌ సైకిల్‌ వేర్వేరు రైడింగ్‌ మోడ్‌లతో వస్తుంది. ఇవి ఎకో, ఫర్మామెన్స్‌ Rear ABS ON, ఫర్మామెన్స్‌ (Rear ABS Off) మోడ్‌లుగా ఉన్నాయి. రైడ్‌ బై రైడ్‌, స్విచ్‌బుల్‌ ABSను కలిగి ఉంటుంది.

ఫీచర్ల పరంగానూ హిమాలయన్‌ మోటార్‌సైకిల్‌ అప్‌గ్రేడ్‌ చేయబడింది. తొలిసారిగా కలర్‌ TFT డిస్‌ప్లేతో వస్తుంది. వృత్తాకారంలో ఉన్న ఈ డిస్‌ప్లే బ్లూటూత్‌ కనెక్టివిటీ సహా గూగుల్‌ మ్యాప్‌ సపోర్టుతో కూడిన టర్న్‌ బై టర్న్‌ నావిగేషన్‌ వ్యవస్థను కలిగి ఉంది. దీంతోపాటు వృత్తాకార హెడ్‌ల్యాంప్‌లతో కూడిన పుల్‌ LED లైటింగ్‌ సెటప్‌తో వస్తుంది. మరియు ఇంటిగ్రేటెడ్‌ టెయిల్‌ ల్యాంప్, బ్రేక్‌ లైట్లను కలిగి ఉంటుంది.

Royal Enfield Himalayan new bike

198 కిలోల బరువు : పాత మోడల్ హిమాలయన్‌ బైక్‌తో పోలిస్తే కొత్తగా ఆవిష్కరించిన హిమాలయన్‌ 450 బైక్ 17 లీటర్ల ఫ్యూయల్‌ ట్యాంక్‌ను కలిగి ఉంటుంది. మరియు పాత మోడల్ కంటే 3 కిలోలు తక్కువగా ఉండి 198 కిలోల బరువు ఉంటుంది. మరియు 230mm గ్రౌండ్ క్లియరెన్స్ ఉంటుంది.

కొత్త హిమాలయన్ 450 బైక్‌ మూడు వేరియంట్లలో లభిస్తుంది. హిమాలయన్‌ (Himalayan), హిమాలయన్‌ పాస్‌ (Himalayan Pass), హిమాలయన్‌ సమ్మిట్‌ (Himalayam Summit) వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది. అయితే బేస్‌ వేరియంట్‌ హిమాలయన్‌ కాజా బ్రౌన్‌ రంగులో మాత్రమే లభిస్తుంది. మిడ్‌ లెవల్‌ వేరియంట్‌ స్లేట్‌ హిమాలయన్‌, స్లేట్‌ పాపీ బ్లూ, అదే టాప్‌ ఎండ్‌ వేరియంట్ కామెట్‌ బ్లూ లేదా హాన్లే బ్లాక్‌ రంగులో లభిస్తుంది.

Royal Enfield Himalayan 450 unveiled

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, Threads, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

More from DriveSpark

Article Published On: Tuesday, November 7, 2023, 16:25 [IST]
English summary
Royal enfield himalayan 450 revealed
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+