రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ 452 బైక్ క్రేజీ అప్‌డేట్.. ఆకర్షణీయమైన కలర్స్‌తో డిఫరెంట్ లుక్.!!
రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్‌లంటే యువతకు చాలా క్రేజ్.. దశాబ్దాలుగా యువతను అలరిస్తున్న ఈ వింటేజ్ మోడళ్లు.. ఆధునిక సాంకేతికతో పలు మార్పులు చెందుతూ బైక్ ప్రియులను అలరిస్తున్నాయి. ఈ నేపథ్యంలో త్వరలో మార్కెట్లోకి రానున్న రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్(Royal Enfield Himalayan 452) 452 బైక్ గురించి కీలక వివరాలు విడుదలయ్యాయి. అవేంటంటే..
భారత మార్కెట్లో రైడర్లు ఎంతగానో ఎదురుచూస్తున్న బైక్ మోడల్స్‌లో రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ 452 ఒకటి. డుగ్గు డుగ్గు సౌండ్, అద్భుతమైన ఫీచర్లు, ఆధునిక సాంకేతిక సౌకర్యాలతో ఈ బైక్ అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో కొత్త హిమాలయన్ 452 బైక్ ఫీచర్లు, కలర్స్ వివరాలను విడుదల చేశారు.

యువ కస్టమర్ల దృష్టిని ఆకర్షించేలా కొత్త రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ 452 ఫీచర్లు ఉన్నాయి. ముఖ్యంగా ఈ బైక్ ఎన్ని కలర్ ఆప్షన్స్‌లో రానుంది, డిస్‌ప్లే ఫీచర్లు, డిజైన్‌కు సంబంధించి పలు అప్‌డేట్లు విడుదలయ్యాయి. ఇప్పటికే కుర్రకారు గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్‌లు.. ఈ కొత్త బైక్‌తో సంచలనం సృష్టిస్తుందేమో..
2023 రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ 452 బైక్ ఐదు విభిన్న కలర్ ఆప్షన్స్‌లో అందుబాటులోకి రానుందని సంస్థ వెల్లడించింది. ఇది కాకుండా, ఈ బైక్ మూడు విభిన్న వేరియంట్లలో విక్రయానికి అందుబాటులో ఉంది. బేస్, పాస్ మరియు సమ్మిట్ వేరియంట్లలో కస్టమర్లు కొనుగోలు చేయవచ్చు.

సుదూర ప్రయాణాలకు, అడ్వెంచర్ రైడర్లను దృష్టిలో ఉంచుకుని ఈ బైక్‌ను రూపొందించారు.
బేస్ అనేది బేస్ ట్రిమ్‌గా భావించాలి. ఇందులో కాజా బ్రౌన్ (Kajah Brown) రంగు ఎంపికను అందిస్తోంది. రెండో వేరియంట్ పాస్.. ఈ వేరియంట్ బైక్.. స్లేట్ హిమాలయన్ సాల్ట్ మరియు స్లేట్ పాపీ బ్లూ డ్యూయల్ కలర్ ఆప్షన్‌లలో అందించబడుతుంది.
ఇక టాప్-లెవెల్ సమ్మిట్ ట్రిమ్ రెండు విభిన్న కలర్ ఆప్షన్లలో రానుంది. హాన్లే బ్లాక్ మరియు కామెట్ వైట్ కలర్స్‌లో కస్టమర్లను ఆకట్టుకోనుంది. కొత్త రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ 452 బైక్‌కి మరింత లుక్ ఇచ్చేందుకు ఫ్యూయెల్ ట్యాంక్‌కు పైభాగానికి మరియు దిగువన ఈ ఆకర్షణీయమైన కలర్స్‌తో డిజైన్ చేశారు.

ఇది కాకుండా, వీల్, ఫ్రంట్ మడ్‌గార్డ్ మరియు సైడ్ కేస్ కూడా అదే కలర్‌తో వస్తుంది. ఈ కలర్ స్కీమ్ ద్వారా కొత్త హిమాలయన్ 452 బైక్ లుక్.. ఇతర హిమాలయన్ మోడళ్ల నుంచి డిఫరెంట్‌గా ఉంటుంది. కొత్త హిమాలయన్ 452 పూర్తిగా డిజిటల్ TFT ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, బ్లూటూత్ కనెక్టివిటీ, గూగుల్ మ్యాప్, LED లైట్, లాంగ్ ట్రావెల్ UST ఫోర్క్ మరియు మోనో షాక్‌లతో వస్తుంది.
ఇంకా ఈ బైక్‌లో డబుల్ సెక్షన్ సీటు, వెనుక లగేజ్ క్యారియర్(5kg లోడ్), పొడవైన హ్యాండిల్ బార్, పెద్ద విండ్ స్క్రీన్, డ్యూయల్ ఛానల్ ABS, ఫ్యూయల్ ట్యాంక్ గార్డు, డ్యూయల్ మాడ్యులర్ గార్డ్ సిస్టమ్‌తో ఈ బైక్ లుక్ మరింత పెరుగుతుంది. ఈ బైక్‌లో స్పోక్ అల్లాయ్ వీల్ అమర్చారు.

ఇంజిన్ విషయానికి వస్తే, ఈ బైక్‌లో 451.65 సీసీ కెపాసిటీ గల లిక్విడ్ కూల్డ్ మోటార్‌తో పనిచేస్తుంది. ఈ ఇంజిన్ గరిష్టంగా 40 bhp పవర్, 40 NM టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ మోటారుతో 6-స్పీడ్ గేర్‌బాక్స్ అందించారు. దీంతో పాటు, స్లిప్ మరియు అసిస్ట్ క్లచ్ సౌకర్యాలు ఈ బైక్‌లో అందించడం ద్వారా రైడింగ్‌లో చాలా సులభమైన షిఫ్టింగ్ అనుభవాన్ని అందిస్తుంది.
అలాగే రైడర్లు సజావుగా ప్రయాణించేందుకు ఈ బైక్‌లో ట్యూబ్ లెస్ టైర్, స్పోక్డ్ వీల్స్ ఉన్నాయి. కొత్త హిమాలయన్ 452 బరువు కేవలం 196 కిలోలు మాత్రమే అని రాయల్ ఎన్‌ఫీల్డ్ నిర్ధారించింది. ఇక ఛాసిస్ విషయానికొస్తే ఇందులో స్టీల్ ట్విన్ స్పార్ ట్యూబులర్ ఫ్రేమ్ ఉపయోగించారు.

కొత్త హిమాలయన్ 452 బైక్ ఫ్యూయెల్ ట్యాంక్ కెపాసిటీ 17 లీటర్లు కాగా, సీట్ హైట్ 825mm ఉంటుంది. దీనిని 845mm వరకు అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇంకా 805mm వరకు తగ్గించుకోవచ్చు. గ్రౌండ్ క్లియరెన్స్ 230mm. ఈ బైక్ 4 రైడింగ్ మోడ్‌లలో రానుంది. పర్ఫామెన్స్ విత్ ABS, పర్ఫామెన్స్ విత్‌ఔట్ Rear ABS, ఎకో విత్ ABS, ఎకో విత్‌ఔట్ Rear ABS మోడ్‌లలో కొనుగోలు చేయవచ్చు.



Click it and Unblock the Notifications








