Royal Enfield నుంచి మరో శక్తివంతమైన మోటార్‌సైకిల్‌... ఏంటి ఈ బైక్‌ ప్రత్యేకత?

రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ నుంచి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న హిమాలయన్‌ 452 మోటార్‌ సైకిల్‌ (Royal Enfield Himalayan 452) త్వరలో భారత్‌ మార్కెట్‌లోకి విడుదలకు సిద్ధమవుతుంది. ఈ మోటార్‌ సైకిల్‌ తాజాగా ఆవిష్కరించబడింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన రీల్స్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

త్వరలో విడుదలకానున్న రాయల్‌ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్‌ 452.. ప్రస్తుతం కొనుగోలుకు అందుబాటులో హిమాలయన్‌ బైక్‌లోని లోపాలను సరిచేయనుంది. ఫలితంగా కొత్త ఎన్‌ఫీల్డ్ హిమాలయన్‌ 452 బైక్‌ శక్తివంతమైనదిగా మారుతుందని భావిస్తున్నారు. కేటీఎం 390 అడ్వెంచర్‌, BMW G310 జీఎస్‌, యెజ్డి అడ్వెంచర్‌ బైక్‌లకు గట్టిపోటీని ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.

Royal Enfield Himalayan 452 bike

లీక్‌ అయిన సమాచారం ఆధారంగా రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ హిమాలయన్‌ 452 మోటార్‌ సైకిల్‌ 451.65 సీసీ లిక్విడ్‌ కూల్డ్‌ ఇంజిన్‌ను కలిగి ఉంటుంది. ఈ ఇంజిన్‌ 8000 rpm వద్ద 39.5bhp శక్తిని ఉత్పత్తి చేస్తుందని తెలుస్తోంది. అలాగే 36-39Nm గరిష్ఠ టార్క్‌ను ఉత్పత్తి చేయనుందని తెలుస్తోంది.

కొత్త రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ హిమాలయన్ 452 మోటార్‌ సైకిల్‌ 6 స్పీడ్‌ గేర్‌బాక్స్‌ను కలిగి ఉంటుంది. అలాగే ఈ మోడల్‌ స్లిప్‌ మరియు అసిస్ట్‌ క్లచ్‌ను కలిగి ఉంటుందని తెలుస్తోంది. బైక్‌ బరువు 210 కిలోలు ఉంటుందని తెలుస్తోంది. టర్న్‌ బై టర్న్‌ నేవిగేషన్‌ వ్యవస్థను కలిగి ఉంటుంది.

ఈ రాయల్ ఎన్‌ఫీల్డ్‌ హిమాలయన్‌ కొత్త బైక్‌.. బ్లూటూత్‌ కనెక్టివిటీ, ఆల్‌ LED లైటింగ్, డ్యూయల్‌ ఛానల్‌ ABS, మల్టిపుల్ రైడింగ్‌ మోడ్‌లు, ట్రాక్షన్‌ కంట్రోల్‌ సిస్టమ్‌, డిజిటల్‌ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌ వంటి అనేక కీలక ఫీచర్లను కలిగి ఉంటుందని భావిస్తున్నారు.

ప్రస్తుతం విక్రయానికి అందుబాటులో ఉన్న హిమాలయన్‌ మోడల్‌లో పోలిస్తే.. ఈ కొత్త మోటార్‌ సైకిల్‌ మరింత మెరుగైన ఆఫ్‌రోడర్‌గా కనిపిస్తుంది. ఫిక్సిడ్‌ హెడ్‌ల్యాంప్‌, పెద్ద ఫ్యూయల్‌ ట్యాంక్‌, స్ల్పిట్‌ సీట్లు, మిడ్‌ సెట్‌ పుట్‌పెగ్‌లను కలిగి ఉంటుంది. బైక్‌ ముందు భాగంలో USD ఫోర్క్‌, వెనుక భాగంలో సెమీ అడ్జస్టబుల్‌ మోనోషాక్‌ సస్పెన్షన్‌ను కలిగి ఉంటుంది. ముందు, వెనుక డిస్క్‌ బ్రేకులు సహా ప్రీమియం ఫీచర్లతో వస్తుందని తెలుస్తోంది.

హూమోలోగేషన్‌ ఫోటోలు ఆధారంగా.. రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ హిమాలయన్‌ 452 మోటార్‌ సైకిల్‌ పొడవు 2,245mm, వెడల్పు 852mm, 1515mm వీల్‌బేస్‌ను కలిగి ఉంటుంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న హిమాలయన్‌ బైక్‌ కంటే.. కొత్త హిమాలయన్‌ 452 మరింత పెద్దదిగా ఉండనుందని సమాచారం.

ప్రస్తుతం కొనుగోలుకు అందుబాటులో ఉన్న రాయల్‌ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్‌ మోటార్‌ సైకిల్‌ ధర రూ.2.16 లక్షలుగా (ఎక్స్‌షోరూం) ఉంది. అయితే త్వరలో విడుదల కానున్న హిమాలయన్‌ 452 మోటార్‌ సైకిల్‌ ధర రూ.2.50 లక్షలుగా (ఎక్స్‌షోరూం)గా ఉంటుందని భావిస్తున్నాము. అయితే ఈ ఫీచర్లు, ధరపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, Threads, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

More from DriveSpark

Article Published On: Monday, October 9, 2023, 18:55 [IST]
English summary
Royal enfield himalayan 452 bike revealed ahead of launch
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+