రాయల్ ఎన్‌ఫీల్డ్‌ కొత్త మోటార్‌సైకిల్‌.. ఉత్తమ ఆఫ్‌రోడర్‌గా నిలవనుందా?

భారత్‌ ఆటోమొబైల్‌ మార్కెట్‌లో మోటార్‌ సైకిళ్ల సెగ్మెంట్‌లో భారీ పోటీ నెలకుంటోంది. దేశ విదేశాలకు చెందిన అనేక సంస్థలు కస్టమర్లును ఆకట్టుకోవడం కోసం సరికొత్త ద్విచక్ర వాహనాలను విడుదల చేస్తున్నాయి. తద్వారా తమ మార్కెట్‌ను నిలుపుకొనేందుకు కొత్త బైక్‌లను అందుబాటులోకి తీసుకొస్తున్నాయి.

తాజాగా రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ సంస్థ తన కొత్త హిమాలయన్‌ 452 మోటార్‌సైకిల్‌ (Royal Enfield Himalayan 452) ఫొటోలను విడుదల చేసింది. ఈ బైక్‌కు సంబంధించి గతంలో విడుదలైన టీజర్ ఆకట్టుకుంది. ఈ తాజా ఫొటోలో హిమాలయన్‌ 452 బైక్‌ గేమ్‌వైట్‌ రంగులో కనిపించింది. ఈ మోటార్‌సైకిల్‌ నవంబర్‌ 7న భారత్‌లో విడుదల కానుంది.

Royal enfield himalayan 452

హిమాలయన్‌ 452 ఇంజిన్‌, పనితీరు: రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ హిమాలయన్‌ 452 బైక్‌ 451.65cc సింగిల్‌ సిలిండర్‌ లిక్విడ్‌ కూల్డ్‌ ఇంజిన్‌ను కలిగి ఉంటుంది. ఇది గరిష్ఠంగా 40 bhp శక్తి, 40Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజిన్‌ 6-స్పీడ్‌ గేర్‌బాక్స్‌ను కలిగి ఉంటుంది. స్లిప్‌, అసిస్ట్ క్లచ్‌ ఫీచర్‌ను కలిగి ఉంది. ఈ బైక్‌ 196 కిలోలు ఉంటుందని తెలుస్తోంది.

ఎన్‌ఫీల్డ్‌ హిమాలయన్‌ 452 ఫీచర్లు : ఎన్‌ఫీల్డ్‌ హిమాలయన్‌ 452 మోటార్‌సైకిల్‌ (Royal Enfield New Bike) బ్లూటూత్‌ కనెక్టివిటీ, ఆల్‌ LED లైటింగ్, డ్యూయల్‌ ఛానల్‌ ABS, మల్టిపుల్ రైడ్‌ మోడ్‌, ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్‌, సహా వృత్తాకార డిజిటల్‌ ఇన్‌స్ట్రుమెంట్‌ క్లస్టర్‌ను కలిగి ఉంటుంది.

Royal enfield himalayan 452 bike

ఉత్తమ ఆఫ్‌ రోడర్‌ : ఈ మోటార్‌ సైకిల్‌ ఫిక్స్‌డ్‌ హెడ్‌ల్యాంప్‌, పెద్ద ఫ్యూయల్‌ ట్యాంక్‌, స్ల్పిట్‌ సీట్లు, మిడ్‌ సెట్‌ ఫుట్‌పెగ్‌ సహా మరిన్ని డిజైన్ ఫీచర్లు ఉన్నాయి. గతం మోడల్‌ కంటే మెరుగైన ఆఫ్‌ రోడర్‌గా కనిపిస్తుంది. ఈ బైక్‌ ముందువైపు USD ఫోర్క్స్‌, వెనుకవైపు సెమీ అడ్జస్టబుల్‌ మోనోషాక్‌ సస్పెన్షన్‌ను కలిగి ఉంటుంది. ముందు, వెనుక డిస్క్ బ్రేకులను అమర్చారు.

గత మోడల్ కంటే : హోమోలోగేషన్‌ పత్రాల ప్రకారం.. త్వరలో విడుదల కానున్న రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ హిమాలయన్ 452 మోటార్‌సైకిల్‌ పొడవు 2.245mm, 852mm వెడల్పు, 1510mm వీల్‌బేస్‌ను కలిగి ఉంటుంది. ప్రస్తుతం ఉన్న హిమాలయన్‌ మోటార్‌సైకిల్‌ కంటే పెద్దగా రానుంది.

సురక్షితమైన రైడింగ్‌ అనుభవాన్ని అందించేందుకు రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ డ్యూయల్‌ ఛానల్‌ ABS, ఆఫ్‌రోడ్ మోడ్, హజార్డ్‌ లైట్లు, సైడ్‌ స్టాండ్‌ పెట్టినప్పుడు ఆటోమేటిక్‌గా ఇంజిన్‌ను స్విచ్‌ ఆఫ్‌ చేసే ఫీచర్‌ కూడా కొత్త హిమాలయన్‌ బైక్‌ సొంతం. దీంతోపాటు ఈ బైక్‌ ట్యూబ్‌ లెస్‌ టైర్లు, స్పోక్డ్‌ వీల్స్‌ను కలిగి ఉండనుంది.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, Threads, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

More from DriveSpark

Article Published On: Sunday, October 29, 2023, 9:18 [IST]
English summary
Royal enfield himalayan 452 teased again pics goes viral
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+