Royal Enfield Himalayan Electric Concept బైక్ 2023 ఆవిష్కరణ.. ఈ సెగ్మెంట్‌లో గట్టి పోటీ ఇవ్వనుందా.??
రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్‌లంటే యూత్‌కు ఎంత క్రేజ్ అనేది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. టూ వీలర్ విభాగంలో రాయల్‌గా, రారాజుగా వెలిగిపోతున్నాయి. అందుకే ఇవి ప్రీమియం బైక్‌లుగా ప్రజాదరణ పొందుతున్నాయి. రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్‌ల ధర ఎక్కువగా ఉన్నప్పటికీ.. ఖర్చు విషయంలో వెనకాడకుండా యువకులు ఈ బైక్‌ను సొంతం చేసుకుంటున్నారు.
ఈ నేపథ్యంలో రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి యూత్‌కు మరో గుడ్ న్యూస్. త్వరలో ఈ రాయల్ బైక్‌లు ఎలక్ట్రిక్ వెర్షన్‌లో అందుబాటులోకి కానున్నాయి. ఈ మేరకు రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ ఎలక్ట్రిక్ కాన్సెప్ట్ బైక్ మోడల్‌ను EICMA 2023 (International Motorcycle and Accessories Exhibition) లో హిమాలయన్ 452తో పాటు ఆవిష్కరించింది. అయితే ఈ ఇ బైక్ బ్యాటరీ, రేంజ్, ఫీచర్ల గురించి ఎలాంటి సమాచారం వెల్లడించలేదు.

కాగా EICMA 2023 లో ప్రదర్శించబడిన రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ ఎలక్ట్రిక్ కాన్సెప్ట్ బైక్ డిజైన్ విషయానికొస్తే.. ఈ బైక్ డిజైన్ దాదాపు కొత్త హిమాలయన్ 452 బైక్‌ను పోలి ఉన్నట్లుగా కనిపిస్తోంది. చూడగానే ఇట్టే అందరినీ ఆకట్టుకుంటుంది.
ఈ కొత్త ఎలక్ట్రిక్ కాన్సెప్ట్ రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్(Royal Enfield Himalayan Electric Concept) బైక్‌లో సర్క్యులర్ LED హెడ్‌ల్యాంప్ ఉంది. పెద్ద విండ్ స్క్రీన్, ఎలక్ట్రిక్ మోటారును కలిగి ఉంది. ఫ్యూయెల్‌తో నడిచే హిమాలయన్ బైక్‌తో పోలిస్తే, ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ ఆఫ్-రోడ్ డ్రైవింగ్‌కు కూడా మరింత అనుకూలంగా ఉంటుందని సమాచారం.

ఈ బైక్‌లో ఫ్రంట్ అప్-సైడ్ డౌన్ ఫోర్క్స్, రేర్ అడ్జస్టబుల్ షాక్ సస్పెన్షన్ సెటప్ ఉన్నాయి. కాగా ప్రస్తుతం రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ ఎలక్ట్రిక్ బైక్ ప్రస్తుతం తయారీ దశలో ఉంది. ఇంకా దీనికి చాలా టెస్టులు చేయాల్సి ఉన్న నేపథ్యంలో రోడ్లపైకి రావడానికి కొంచెం సమయం పట్టనుంది. సమచారం ప్రకారం ఈ బైక్ 2025 లో విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
కాగా నేడు ప్రపంచ మార్కెట్‌లో విడుదలైన హిమాలయన్ 452 అడ్వెంచర్ బైక్ బుకింగ్ నేటి నుంచి ప్రారంభమైంది. ఈ హిమాలయన్ 452 అడ్వెంచర్ బైక్‌ను చాలా అధునాతనంగా రూపొందించారు. లిక్విడ్-కూల్డ్ ఇంజిన్‌తో వస్తున్న మొట్టమొదటి రాయల్ ఎన్‌పీల్డ్ మోటార్‌సైకిల్ ఇది. ఇందులో పూర్తి డిజిటల్ TFT ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌ను కలిగి ఉంది.

హిమాలయన్ 452 అడ్వెంచర్ బైక్‌లో స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ, స్విచ్ యాక్సెసబుల్ ABS (యాంటీలాక్ బ్రేకింగ్ సిస్టమ్) ఫీచర్లను కలిగి ఉంది. ఇందులో 21/17-అంగుళాల స్పోక్ వీల్ వచ్చింది. తొలిసారిగా హిమాలయన్ 452 మోటార్ సైకిల్ వేర్వేరు రైడింగ్ మోడ్‌లతో వస్తోంది. ఇవి ఎకో, ఫర్మామెన్స్ Rear ABS ON, ఫర్మామెన్స్ (Rear ABS Off) మోడ్‌లుగా ఉన్నాయి. రైడ్ బై రైడ్, స్విచ్‌బుల్ ABSను కలిగి ఉంటుంది.

కాగా పెట్రోల్, డీజిల్ వాహనాలకు ప్రత్యామ్నాయంగా రానున్న రోజుల్లో దేశీయ మార్కెట్లో దాదాపు అన్ని ఈవీలు అందుబాటులోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాయల్ ఎన్‌ఫీల్డ్ కొత్త హిమాలయన్ ఎలక్ట్రిక్ కాన్సెప్ట్ బైక్‌ను ఆవిష్కరించడం ద్వారా ఈ సెగ్మెంట్‌లో బలమైన పోటీదారుగా నిలుస్తోంది. ఈ బైక్.. ఔత్సాహికులను ఆకర్షిస్తుందనడంలో సందేహం లేదు.



Click it and Unblock the Notifications








