అల్లాయ్ వీల్స్ తో సరికొత్త రాయల్ ఎన్ ఫీల్డ్ బైక్స్ విడుదల..
ప్రముఖ ప్రీమియం బ్రాండ్ రాయల్ ఎన్‌ఫీల్డ్ భారతీయ మార్కెట్లో రెండు ప్రముఖ బైక్‌లను విడుదల చేసింది. ఇంటర్‌సెప్టర్ 650, కాంటినెంటల్ GT 650 పేర్లతో వివిధ అప్‌డేట్‌లతో భారత మార్కెట్లోకి ఈ బైక్స్ అందుబాటులోకి తెచ్చింది. ఈ బైక్స్ సంబంధించిని పూర్తి వివరాలు ఈ కథనంలో మీకోసం అందిస్తున్నాం..
చెన్నైకి చెందిన ఈ తయారీదారు కొత్త బైక్‌లలో ట్యూబ్‌లెస్ టైర్‌లతో ముందు వెనక భాగంలో సరికొత్తగా అల్లాయ్ వీల్స్‌ను అమర్చింది. 2023 రాయల్ ఎన్‌ఫీల్డ్ ఇంటర్‌సెప్టర్ 650 ధర రూ.3.03 లక్షలుగా నిర్ణయించింది. అలానే కాంటినెంటల్ GT 650 ధర రూ.3.19 లక్షలుగా ఉంది. ఈ ధరలన్నీ చెన్నై ఎక్స్ షోరూమ్ ప్రకారం ఉండనున్నాయి.

వివిధ కలర్లలో అందుబాటులోకి..
2023 రాయల్ ఎన్‌ఫీల్డ్ ఇంటర్‌సెప్టర్ 650, కాంటినెంటల్ GT650 బైక్‌లు కొత్త రంగులతో సంస్థ పరిచయం చేసింది. ఇంటర్‌సెప్టర్ 650 బైక్‌ను నాలుగు కలర్లలో సంస్థ తీసుకువచ్చింది. బ్లాక్ రే, బార్సిలోనా బ్లూ, బ్లాక్ పెర్ల్, కాలి గ్రీన్ కలర్లలో ఇవి అందుబాటులో ఉండనున్నాయి. అలానే సన్‌సెట్ స్ట్రిప్, కాన్యన్ రెడ్ కలర్స్‌లో కూడా అందుబాటులో ఉంటుంది.
ఇక కాంటినెంటల్ GT 650 బైకు స్లిప్ స్ట్రీమ్ బ్లూ, అపెక్స్ గ్రే కలర్ ఆప్షన్‌లను బ్లాక్ రే బార్సిలోనా బ్లూ వంటి బ్లాక్ అవుట్ బిట్స్ తో రానుంది. కేఫ్ రేసర్ డక్స్ డీలక్స్, బ్రిటిష్ రేసింగ్ గ్రీన్, రాకర్ రెడ్ పెయింట్, మిస్టర్ క్లీన్ రంగులలో కూడా ఈ బైక్ అందుబాటులో ఉంటుంది.

భారీ ఇంజన్..
బ్లాక్ అవుట్ బిట్స్‌లో ఇంజిన్ ప్రాంతం ఎగ్జాస్ట్‌కు డార్క్ ఫినిషింగ్ ఉంటుంది. ట్యూబ్‌లెస్ టైర్లపై కాస్ట్ అల్లాయ్ వీల్స్ స్టాండర్డ్‌గా అందించబడతాయి. కొత్త LED హెడ్‌లైట్ యూనిట్, USB ఛార్జింగ్ పోర్ట్, కొత్త స్విచ్ గేర్, మెరుగైన సీట్ సౌకర్యం ఉన్నాయి.
ఇంజన్‌లో ఎలాంటి మార్పులను కంపెనీ చేయలేదు. ఇంటర్‌సెప్టర్ 650 మరియు కాంటినెంటల్, GT 650 బైక్‌లు 648 cc ఎయిర్-అండ్ ఆయిల్-కూల్డ్ ప్యారలల్ ట్విన్-సిలిండర్ ఫ్యూయల్-ఇంజెక్టెడ్ ఇంజన్‌ని కలిగి ఉన్నాయి. ఈ ఇంజన్ 7,250 RPM వద్ద 47bhp పవర్ ను 5,250 RPM వద్ద 52 NM టార్క్ ఉత్పత్తి చేయగలవు.

వెంటనే బుక్ చేసుకోండి..
ఈ అత్యాధునిక బైక్స్ 6-స్పీడ్ గేర్‌బాక్స్‌తో రానున్నాయి. స్లిప్పర్, అసిస్ట్ క్లచ్, డ్యూయల్-ఛానల్ ABS సిస్టమ్ ఈ రెండు ట్విన్ బైక్‌లలో స్టాండర్డ్ ఫిట్‌మెంట్‌లు అమర్చబడ్డాయి. ఈ కొత్త రాయల్ ఎన్‌ఫీల్డ్ 650 ట్విన్ బైక్‌లను కొనుగోలు చేయాలనుకునే వారు భారత్ లో బుక్ చేసుకోవచ్చు.
డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్ కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








