రాయల్ ఎన్‌ఫీల్డ్ ఎలక్ట్రిక్ బైక్‌పై ఎండీ కీలక ప్రకటన..!!
భవిష్యత్ ఆటోమొబైల్ రంగం ఎలక్ట్రిక్ వాహనాలదే అని ప్రముఖ కార్ల తయారీ సంస్థలు ఉన్న బలంగా నమ్ముతున్నాయి. అందుకే అన్ని సంస్థలు ఎలక్ట్రిక్ వాహనాలను మార్కెట్‌లోకి విడుదల చేస్తున్నాయి. రాయల్ ఎన్‌ఫీల్డ్ కూడా రానున్న రెండు సంవత్సరాల్లో తమ మొదటి ఎలక్ట్రిక్ బైక్‌ను చేయనుంది. ఇందుకు సంబంధించిన వివరాలను రాయల్ ఎన్‌ఫీల్డ్ ఎండీ సిద్ధార్థ లాల్ వెల్లడించారు.
రాయల్ ఎన్‌ఫీల్డ్ మొట్టమొదటి ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్ ప్రస్తుతం అభివృద్ధి దశలో ఉందని.. రెండు సంవత్సరాల్లో తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని వెల్లడించారు. ఈ కొత్త బైక్ కోసం చాలా కష్టబడుతున్నట్లు చెప్పారు. ప్రస్తుతం తాము ప్రోటోటైప్ వాహనాలను నడుపుతున్నామని, తమకు ఇంకా సమయం ఉందని తెలిపారు. ఈవీ మార్కెట్‌లోకి రావడానికి రెండు సంవత్సరాల సమయం పట్టవచ్చని తెలిపారు.

ఎలక్ట్రిక్ బైక్ గురించి రాయల్ ఎన్‌ఫీల్డ్ సీఈవో గోవిందరాజన్ కూడా స్పందించారు. ప్రస్తుతం తమ దృష్టి అంతా అవసరమైన సామర్థ్యాలను పెంపొందించడంపై ఉందని తెలిపారు. ఇందుకోసం 100 మందిని కేటాయించినట్లు చెప్పారు. తమ ఉత్పత్తి వ్యూహం చాలా విస్తృతమైన ప్రక్రియని తెలిపారు.
ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఎలాంటి మోటార్ సైకిల్‌ను తయారు చేయాలో తెలుసుకోవడం సవాల్‌గా ఉందని చెప్పారు. ఎలక్ట్రిక్ వాహనాల కోసం ప్రత్యేక ఒప్పందాలు చేయవలసి ఉందని సీఈవో గోవిందరాజన్ తెలిపారు. బ్యాటరీ మేనేజ్‌మెంట్ సిస్టమ్, మోటార్ కంట్రోలర్ యూనిట్ సిస్టమ్, డిజైన్ ఇలా అన్ని పనులు చేయాల్సి ఉంటుందన్నారు.

ప్రస్తుతం ఈ పనులు అన్నింటినీ పూర్తి వేగంతో అమలు చేస్తున్నామని చెప్పారు. పూర్తి బ్యాక్ ఎండ్ సిస్టమ్ ఏర్పాటుచేసే ప్రక్రియలో ఉన్నామని చెప్పారు. తమ దృష్టి అత్యాధునిక ఈవీలపై ఉందని స్పష్టం చేశారు. కొన్ని ఎలక్ట్రిక్ వాహనాలను పరిశీలిస్తున్నామని, దీని ఆధారంగానే ధరలు నిర్ణయిస్తామని గోవిందరాజన్ వివరించారు.
రాయల్ ఎన్‌ఫీల్డ్ తన ఎలక్ట్రిక్ వాహనాల ప్లాన్‌ను వేగవంతం చేసేందుకు స్పానిష్ ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్ తయారీదారు స్టార్క్ ఫ్యూచర్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ప్రస్తుత పోటీని అనుగుణంగా రాయల్ ఎన్‌ఫీల్డ్ ఎలక్ట్రిక్ బైక్‌ను తీసుకురావాలని భావిస్తోంది. 2025 నాటికి రాయల్ ఎన్‌ఫీల్డ్ ఎలక్ట్రిక్ బైక్ అందుబాటులోకి రానుంది.
రానున్న ఎలక్ట్రిక్ వాహనం రాయల్ ఎన్‌ఫీల్డ్ బ్రాండ్‌ను చెక్కుచెదరకుండా కాపాడుతుందని భావిస్తున్నారు. ఈ ప్రాజెక్టు కోసం రూ.1000కోట్లు కేటాయించారు. ప్రాజెక్టును అమలు చేసేందుకు కొత్త బృందాన్ని కూడా నియమించింది. రాయల్ ఎన్‌ఫీల్డ్ తన ఈవీ కోసం సుమారు 1.5 లక్షల యూనిట్ల ఉత్పత్తి సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఇది మాడ్యూలర్ ప్లాంట్. భవిష్యత్‌లో ఉత్పత్తి సామర్థ్యాన్ని విస్తరించేందుకు అనుమతిస్తుంది. కస్టమర్ డిమాండ్‌కు అనుగుణంగా పనిచేస్తుంది.
*బెంగళూరుకు చెందిన బుల్లెటీర్ కస్టమ్స్ బృందం రాయల్ ఎన్‌ఫీల్డ్ ఎలక్ట్రిక్ బైక్‌ను తయారు చేసింది. ఛాసిస్ దగ్గర నుంచి మోటర్ వరకు చాలా మార్పులు చేశారు. 90 కిలోమీటర్ల వేగంతో వెళ్లేలా రూపొందించారు. రాయల్ ఎన్‌ఫీల్డ్ 1984 స్డాండర్డ్ బైక్‌లో మార్పులు చేసి.. ఆకర్షించే ఎలక్ట్రిక్ బైక్‌గా మార్చాడు.
ఈ బృందం తయారు చేసిన ఎలక్ట్రిక్ రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్ 65-75 km/h వేగంతో చాలా సౌకర్యంగా ప్రయాణం చేయవచ్చు. ఈ బైక్ గరిష్ఠ వేగం 90km/h అని బుల్లెటీర్ కస్టమ్స్ బృందం తెలిపింది. నలుపు, ఎరుపు, తెలుపు రంగుల కలయికతో చాలా క్లాసీ మరియు నియో రెట్రో లుక్‌ను కలిగి ఉంది.
డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, Threads, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








