డీజిల్ తో ప్రయాణించే రాయల్ ఎన్ ఫీల్డ్ బైక్.. ఫుల్ ట్యాంక్ చేస్తే 900కి.మీ ప్రయాణం..!!

రాయల్ ఎన్ ఫీల్డ్ భారతీయ మార్కెట్ లో పరిచయం అక్కర్లేని టూ వీలర్ బ్రాండ్. ప్రీమియం బైక్స్ లో ది బెస్ట్ ఛాయిస్ గా రాయల్ ఎన్ ఫీల్డ్ ను వినియోగదారులు భావిస్తారు. అయితే ఆ బైక్ డీజిల్ తో నడుస్తుంది అనే విషయం మీకు తెలుసా. అవును మీరు వింటుంది నిజమే రాయల్ ఎన్ ఫీల్డ్ బైక్ డీజిల్ ఇంజన్ తో నడుస్తుంది. అది ఎక్కడ ఎలా అని తెలుసుకోవాలంటే ఈ పూర్తి కథనాన్ని చదివేయండి మరి.

ఆ సంస్థ నుంచి బుల్లెట్ క్లాసిక్ సిరీస్ మోటార్‌ సైకిలల్లో రాయల్ ఎన్ ఫీల్డ్ లు బాగా ప్రాచుర్యం పొందాయి. 1993లో రాయల్ ఎన్‌ ఫీల్డ్ డీజిల్ ఇంజన్ తో నడిచే బైక్ ను తీసుకువచ్చింది. అనంతరం నూతన భద్రతా ప్రమాణాలతో పాటు ఇతర పర్యావరణ అనుమతుల కారణంగా ఈ బైకును నిలిపివేశారు. మార్కెట్లో డీజిల్ ఇంజన్‌ తో నడిచిన బైక్ గా అప్పట్లో సంచలనం సృష్టించింది.

రాయల్ ఎన్ ఫీల్డ్ టారస్

325 సీసీ..

ప్రస్తుతం ఈ బైక్ కి చెందిన ఓ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. 'బైక్ విత్ గర్ల్' యూట్యూబ్ ఛానల్ లో ఓ అమ్మాయి బైక్ పై వచ్చి డీజిల్ పట్టించమని చెప్పగా.. అది పెట్రోల్ బైక్ అని వారు వాదిస్తారు. సేల్స్ బాయ్స్ ఆ అమ్మాయి మధ్య జరిగిన సంభాషణ ప్రస్తుతం ఆసక్తి రేపుతోంది.

టారస్ ఎన్ ఫీల్డ్ గా ఈ బైక్ ను పిలుస్తారు. అయితే ఇతర ఎన్‌ ఫీల్డ్ మోటార్‌ సైకిళ్ల మాదిరిగా కాకుండా, టారస్ కు 350-సీసీ ఇంజిన్‌ ను ఉపయోగించలేదు. ఈ ఇంజన్ ను ఎక్కువగా ఎన్ ఫీల్డ్ బైక్స్ లో వాడేవారు. 325 సీసీలో గ్రేవ్స్ లొంబార్డిని ఫోర్-స్ట్రోక్ డీజిల్ ఇంజన్‌ తో దీనిని రూపొందించారు.

రాయల్ ఎన్ ఫీల్డ్

మైలేజ్ లో తోపు..

ఈ మోటార్‌ సైకిల్‌ ను చాలా మంది కొనుగోలు చేయడానికి ఒక కారణం ఈ బైక్ ఇచ్చే మైలేజ్. సాధారణ బుల్లెట్ లా కాకుండా దాదాపు 60 కి.మీ నుంచి 70కి.మీ మధ్య ఈ బైక్ మైలేజ్ ఇస్తుంది. అంటే ఒక్కసారి ట్యాంక్ ఫుల్ చేస్తే 900 కి.మీ. దీనిపై ప్రయాణించవచ్చు అన్నమాట. అప్పట్లో ఇంత మైలేజ్ ఇవ్వడం అంటే మామూలు మాటలు కాదు.

స్టైలిష్ లుక్ కోసం ఓ మోటార్ సైకిల్ ను కొనాలని అనుకునేవారికి అప్పట్లో ది బెస్ట్ ఛాయిస్ గా ఈ బైక్ ఉండేది. హోండా స్ప్లెండర్ కంటే ఎక్కువగా మైలెజ్ ఇవ్వడంతో పాటు భారీ ఇంజన్ దీనికి అమార్చదాంతో తక్కువ సమయంలో ఎక్కువ క్లిక్ అయిన బైక్ గా పేరొందింది. అయితే వీటిని ప్రభుత్వం నిలిపివేయడంతో ఈ సూపర్ బైక్ కాస్తా కొన్ని రోజుల మురిపెంగానే మిగిలిపోయింది.

రాయల్ ఎన్ ఫీల్డ్

వ్యవసాయ మిత్రుడిగా సేవలు..

ఈ బైక్ కు కుడివైపు అమర్చిన ప్రంట్ వీల్ బెల్ట్ ను సులభంగా తీయవచ్చు. దీని ద్వారా నీటిని మోటార్ సైకిల్ ఆధారంగా పంపు చేసేందుకు రైతులు ఉపయోగించేవారు. ఈ విధంగా వ్యవసాయ పనుల్లో కూడా ఈ బైక్ ను ఉపయోగించేవారు. అలానే మిగతా అన్ని సాధారణ పనుల్లో కూడా మల్టిపుల్ పర్పస్ గా ఈ బైక్ ను వాడేవారు.

ధర..

1993లో వచ్చిన ఈ బైక్ ధర అక్షరాల 72 వేల రూపాయలు, అంటే అప్పట్లో ఈ బైక్ చాలా ఖరీదు అన్నమాట. కేవలం కిక్ ద్వారానే ఈ బైక్ ను స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. సేమ్ రాయల్ లుక్ లో కనిపించే ఈ బైక్ అందుబాటులో ఉంటే ఎన్ని వండర్స్ సృష్టించేదో. అయినప్పటికీ డీజిల్ తో నడిచే బైక్ ఒకటి ఉంది అంటేనే నమ్మశక్యంగా లేదు కదా. ఏ కంపెనీలు అయిన ఇలాంటి బైక్ ను మరోసారి పరిచయం చేసినా ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదు.

More from DriveSpark

Article Published On: Tuesday, February 28, 2023, 14:40 [IST]
English summary
Royal enfield motorcycle runs with diesel and it gives 900km mileage with the full tank
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+