2024లో విడుదల కానున్న రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ మోటార్‌ సైకిళ్లు.. వాటి ప్రత్యేకతలు తెలుసా?

రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ 2024 (Royal Enfield) కోసం ప్రణాళికలు సిద్ధం చేసింది. 2024 సంవత్సరంలో 4 మోటార్‌ సైకిళ్లను విడుదల చేసేందుకు ప్లాన్‌ చేస్తోంది. ఈ జాబితాలో రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ షాట్‌గన్‌ 650 సహా మరో మూడు బైక్‌లు ఉన్నాయి. అయితే ఈ మూడు బైక్‌లు ఎటువంటి స్పెసిఫికేషన్లను కలిగి ఉంటాయి. ధరలు ఎలా ఉంటుంది. పూర్తి వివరాలు మీకోసం.

రాయల్ ఎన్‌ఫీల్డ్‌ షాట్‌గన్‌ 650 : Motoverse 2023 వద్ద రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ షాట్‌గన్‌ 650 మోటార్‌ సైకిల్‌ విడుదల అయింది. ఈ బైక్‌ అధికారిక విడుదల కార్యక్రమం జనవరిలో ఉంటుందని తెలుస్తోంది. అయితే ఈ షాట్‌గన్‌ 650 ధర Meteor 650 కంటే తక్కువగా ఉంటుందని అంచనా వేస్తున్నారు.

royal enfield shotgun

రాయల్ ఎన్‌ఫీల్డ్‌ షాట్‌గన్‌ 650 బైక్‌ 18 అంగుళాల ఫ్రంట్‌ వీల్స్‌, 17 అంగుళాల వెనుక వీల్స్‌ను కలిగి ఉంటుందని తెలుస్తోంది. కొంచెం భిన్నమైన హ్యాండిల్‌ బార్‌ మరియు పుట్‌రెస్ట్ ను కలిగి ఉంటుందని తెలుస్తోంది. సీటింగ్‌ కూడా భిన్నమైన డిజైన్‌తో వస్తుందని తెలుస్తోంది.

రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ హంటర్‌ 450: రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ తన 450cc సెగ్మెంట్‌ వాహనాల శ్రేణిని విస్తరించాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. ఇందుకోసం 2024 సంవత్సరంలో హంటర్‌ 450 మోటార్ సైకిల్‌ను లాంచ్‌ చేయనుంది. ట్రయంఫ్‌ స్పీడ్ 400కు పోటీనిచ్చే అవకాశం ఉంది. హంటర్‌ బైక్‌ 452cc సింగిల్‌ సిలిండర్‌ లిక్విడ్‌ కూల్డ్‌ DOHC 4- వాల్వ్‌ ఇంజిన్‌ను కలిగి ఉంటుంది. ఈ ఇంజిన్‌ 40.02ps శక్తి, 40Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

royal enfield bobber 350

రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ క్లాసిక్ బాబర్ 350: ఈ బైక్‌ ఆధారంగా రాయల్‌ ఎన్‌ఫీల్డ్ బాబర్‌ మోటార్‌ సైకిల్‌ను అభివృద్ధి చేసేందుకు ప్లాన్‌ చేస్తోంది. ఈ బైక్ కీలక ఫీచర్లను కలిగి ఉంటుందని తెలుస్తోంది. వైట్ వాల్‌ టైర్లు, ఎత్తైన హ్యాండిల్‌బార్‌ను కలిగి ఉంటుందని తెలుస్తోంది. అవసరానికి అనుగుణంగా అమర్చుకొనే వెనుక సీటును కలిగి ఉంటుంది. ఈ ఇంజిన్‌ 349cc సింగిల్ సిలిండర్‌ ఎయిర్ మరియు ఆయిల్‌ కూల్డ్‌ SOHC ఇంజిన్‌ను కలిగి ఉంటుంది.

royal enfield 650 scrambler

రాయల్‌ ఎన్‌ఫీల్ట్ స్క్రాంబ్లర్‌ 650 : భారత్‌లోని వివిధ ప్రాంతాల్లో రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ తన స్ర్కాంబర్లర్ 650 మోటార్‌ సైకిల్ టెస్టింగ్‌ చేయడాన్ని చూడవచ్చు. భారత్‌ సహా విదేశాల్లోనూ ఈ బైక్‌ను టెస్టింగ్ చేస్తున్నారు. ఈ మోటార్‌ సైకిల్‌ కీలక ఫీచర్లను కలిగి ఉంది. మెరుగైన గ్రౌండ్‌ క్లియరెన్స్‌ను కలిగి ఉంటుందని తెలుస్తోంది. 648cc పేర్లల్‌ ట్విన్‌ సిలిండర్‌ ఇంజిన్‌తో వస్తుంది.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, Threads, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Tuesday, December 19, 2023, 13:35 [IST]
English summary
Royal enfield plans to launch 4 motor cycles in india in 2024
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+