రాయల్ ఎన్‌ఫీల్డ్ Shotgun 650 బైక్ ఆవిష్కరణ.. అందుబాటులో 25 మాత్రమే.. వారికి మాత్రమే ఛాన్స్.!!
గోవాలో జరిగిన మోటోవర్స్ 2023 ఈవెంట్‌లో శుక్రవారం(నవంబర్ 24) రాయల్ ఎన్‌ఫీల్డ్ లిమిటెడ్-ఎడిషన్ షాట్‌గన్ 650ని(Royal Enfield ShotGun 650) ఆవిష్కరించారు. ఈ బాబర్-స్టైల్ బైక్‌ను ప్రస్తుతం కేవలం 25 యూనిట్లు మాత్రమే అందుబాటులో ఉంది. కాగా Motoverse ఈవెంట్‌లో లక్కీ డ్రా ద్వారా అదృష్టవంతులకు ఈ బైక్‌ను విక్రయిస్తారు.
రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి మరో కొత్త స్టైలిష్ బైక్ షాట్‌గన్ 650 అత్యుత్తమ బాబర్ స్టైలింగ్‌తో వస్తుంది. బైక్ డిజైన్ విషయానికొస్తే.. ఇది లాంగ్ ప్రొఫైల్, లో-స్లంగ్ వైఖరిని కలిగి ఉంది. ఆఫ్‌సెట్ కన్సోల్‌తో కూడిన నేక్డ్ రౌండ్ హెడ్‌ల్యాంప్ ప్రత్యేక ఆకర్షణీయంగా నిలుస్తుంది. అంతే కాకుండా బార్-ఎండ్ మిర్రర్‌లు, ఒకే సీటు, చంకీ, చాప్‌డ్ రియర్ ఫెండర్, హార్డ్‌వేర్ ప్యాకేజీ కోసం ఆల్-బ్లాక్ థీమ్‌తో సరికొత్తగా రూపొందించారు.

రాయల్ ఎన్‌ఫీల్డ్ షాట్ లిమిటెడ్-రన్ బైక్ కలర్‌ను పరిశీలించినట్లయితే ఇది ఢిపరెంట్ పెయింట్ స్కీమ్‌ను కలిగి ఉందనే చెప్పవచ్చు. షాట్‌గన్ 650 పెయింట్ స్కీమ్ అనేది బ్లూ అండ్ బ్లాక్ కలర్స్ షేడ్స్‌తో ఎలిగెంట్ లుక్‌ను కలిగి ఉంది. ఎల్లో కలర్ లైట్లతో బైక్‌కు హైలైట్ లుక్ జోడించిందనే చెప్పవచ్చు.
రాయల్ ఎన్‌ఫీల్డ్ షాట్‌గన్ 650 ఫీచర్లను పరిశీలిస్తే.. ఇందులో సర్క్యులర్ హెడ్‌లైట్, ఇండికేటర్, బ్రేక్ లైట్ పూర్తిగా LED లైటింగ్ సిస్టమ్‌తో వస్తుంది. అదనంగా ట్రిప్పర్ నావిగేషన్ మాడ్యూల్‌తో సెమీ-డిజిటల్ సర్క్యులర్ కన్సోల్ సెటప్‌ను కలిగి ఉంది. బ్లూ అండ్ బ్లాక్ కలర్ షేడింగ్స్, యల్లో లైట్లు, ఆకర్షణీయమై ఎల్‌ఈడీ లైటింగ్ సిస్టమ్‌తో బైక్ నిజంగానే రాయల్ లుక్‌ను అందుకుంది.

ఇక రాయల్ ఎన్‌ఫీల్డ్ షాట్‌గన్ 650 లో బ్లాక్ కలర్‌లో పెయింట్ చేయబడిన అల్లాయ్ వీల్స్‌ను కలిగి ఉంది. ఇవి చంకీ టైర్‌లతో పాటు రివర్స్ యాంగిల్‌లో ఉన్న ఫ్రంట్ ఫోర్క్‌లు, చుట్టూ డిస్క్ బ్రేక్‌లతో ఉంటాయి. ఇంకా ఇందులో పీ-షూటర్ ఎగ్జాస్ట్‌ల సెట్‌ను కూడా చూడవచ్చు.
షాట్‌గన్ 650 పవర్‌ట్రెయిన్ విషయానికొస్తే రాయల్ ఎన్‌ఫీల్డ్ లైనప్‌లోని ఇతర 650 మోటార్‌సైకిళ్లలో కనిపించే అదే 649cc, ఎయిర్/ఆయిల్-కూల్డ్, సమాంతర-ట్విన్ సిలిండర్ ఇంజిన్‌ను ఉపయోగించారు. ఇతర 650 బైక్‌ల మాదిరిగానే 47bhp, 52Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 6-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జత చేయబడి ఉంటుంది.

మొత్తంగా, చెన్నైకి చెందిన రెట్రో-మోటార్‌సైకిల్ తయారీదారు తన Motoverse ఈవెంట్‌కు హాజరైన అభిమానుల కోసం ఈ కస్టమ్ ఆఫర్‌కు సంబంధించి స్పెక్స్ గురించి ఎలాంటి సమాచారం అందించలేదు. అయితే మున్ముందు రాయల్ ఎన్‌ఫీల్డ్ షాట్‌గన్ 650 మోటారు ట్యూనింగ్‌లో ఏవైనా ట్వీక్‌లు చేస్తుందో లేదో వేచి చూడాలి.
కొత్త ShotGun 650 ద్వారా రాయల్ ఎన్‌ఫీల్డ్ తన లైనప్‌ను విస్తరించేందుకు కృషి చేస్తోంది. కస్టమర్లకు ప్రత్యేకమైన, హై క్వాలిటీ కస్టమ్ బైక్‌లను అందించడానికి రాయల్ ఎన్‌ఫీల్డ్ నిబద్ధతను ప్రదర్శిస్తోంది. షాట్‌గన్ 650 బాబర్-స్టైల్ డిజైన్, లిమిటెడ్ ఎడిషన్‌లతో ప్రస్తుతం విక్రయాలు జరపనుంది.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








