భారత్ మార్కెట్‌లోకి మరో ఎలక్ట్రిక్ స్కూటర్.. ఛార్జింగ్ అయిపోయినా ఇబ్బంది లేకుండా..!
భారత్ ఆటోమొబైల్ మార్కెట్‌లో ఎలక్ట్రిక్ వాహనాల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ప్రజల్లో కూడా వీటిపై అవగాహన వస్తోంది. ఫలితంగా నెలవారీ విక్రయాలు కూడా జోరందుకుంటున్నాయి. కస్టమర్ల అవసరాలు, ప్రాధాన్యతలకు అనుగుణంగా ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థలు కూడా వాహనాలను విడుదల చేస్తున్నాయి.
భారత మార్కెట్‌లోకి మరో ఎలక్ట్రిక్ వాహనం విడుదల అయింది. RunR సంస్థ HS EV పేరిట ఎలక్ట్రిక్ స్కూటర్‌ను లాంచ్ చేసింది. ఇప్పటి వరకు వాణిజ్య అవసరాలకు మాత్రమే వీటిని విక్రయించిన సంస్థ.. ఇక నుంచి ప్రజల రోజువారీ అవసరాలకు కోసం అందుబాటులో ఉంచనుంది.

రన్‌ఆర్ మొబిలిటీ (RunR Mobility) సంస్థ భారత్‌లోని ప్రధాన నగరాల్లో షోరూంలను తెరవాలని భావిస్తోంది. దీంతోపాటు ఈ ఆర్థిక సంవత్సరం నాటికి 40 బ్యాటరీ స్వాపింగ్ స్టేషన్లను ఏర్పాటుచేయాలని నిర్ణయించింది. ఈ స్కూటర్లపై ఆసక్తి ఉన్నవారు సంబంధిత డీలర్లను సంప్రదించి, టెస్ట్ రైడ్ చేయవచ్చని తెలిపింది.
ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ధరలు రూ.1.25 లక్షల మరియు రూ.1.30 లక్షలుగా (ఎక్స్‌షోరూం) ఉన్నాయి. ఈ స్కూటర్లు వైట్, బ్లాక్, గ్రే, రెడ్, గ్రీన్ మొత్తం ఐదు రంగుల్లో కొనుగోలుకు అందుబాటులో ఉంది. ప్రస్తుతానికి HS EVలు భారత్‌లోనే అందుబాటులో ఉంటాయి.
ఛార్జింగ్ అయిపోయినా ఇబ్బంది లేకుండా : బ్యాటరీ స్వాపింగ్ స్టేషన్లు అందుబాటులోకి వచ్చాక, ఈ స్కూటర్ బ్యాటరీని ఇచ్చి, పూర్తి ఛార్జింగ్ చేసిన బ్యాటరీని పొందవచ్చని తెలుస్తోంది. దాంతోపాటు అక్టోబర్ 2023 చివరి నాటికి 200 HS EVలను దేశంలోని వివిధ ప్రాంతాల్లో అందుబాటులో ఉంచాలని సంస్థ భావిస్తోంది.
RunR సంస్థ HS ఎలక్ట్రిక్ స్కూటర్లు 60V 40AH Li లిక్విడ్ కూల్డ్ వైర్ బౌండ్ బ్యాటరీలని కలిగి ఉంటుంది. ఈ బ్యాటరీని సింగిల్ ఛార్జింగ్ ద్వారా 110 కి.మీ దూరం ప్రయాణం చేయవచ్చని సంస్థ వెల్లడించింది. మరియు ఈ స్కూటర్ గరిష్ఠంగా 70 kmph వేగంతో ప్రయాణం చేయవచ్చని సంస్థ తెలిపింది.
దీంతోపాటు ఈ స్కూటర్ కీలక ఫీచర్‌లను కలిగి ఉంది. డిజిటల్ స్క్రీన్, వెహికల్ లోకేషన్ ట్రాకింగ్, రిమోట్ ప్లీట్ మేనేజ్‌మెంట్, ఓవర్ ది ఎయిర్ అప్‌డేట్లు, వెనుకవైపు LED టెయిల్‌ల్యాంప్‌లు ఉన్నాయి. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ట్యూ్బ్‌లెస్ టైర్లతో కూడిన అల్లాయ్ వీల్స్‌ను కలిగి ఉంటుంది.
ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ విడుదలపై రన్‌ఆర్ మొబిలిటి వ్యవస్థాపకుడు సేతుల్ షా ఆనందం వ్యక్తం చేశారు. కొత్త షోరూం ప్రారంభోత్సవం తమ విజయాలకు నిదర్శనమన్నారు. ప్రజలకు తమకు ఉన్న అంతరాన్ని తగ్గించామని చెప్పారు. తమ విలువైన కస్టమర్లకు మేడ్ ఇన్ ఇండియా పరిష్కారాలను అందిస్తామని చెప్పారు.
డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, Threads, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications








