సుమారు 18 నెలల తర్వాత విడుదలైన ఎలక్ట్రిక్ స్కూటర్.. 212 కి.మీ.రేంజ్ దీని ప్రత్యేకత..!
ఎప్పటి నుంచే ఎదురుచూస్తున్న సింపుల్ ఎనర్జీ సంస్థ తొలి ఎలక్ట్రిక్ స్కూటర్ Simple One ఇవాళ విడుదల అయింది. ఆత్మనిర్భర్ భారత్‌లో భాగంగా దీనిని తయారుచేశారు. ప్రస్తుతం ఉన్న స్కూటర్ల కంటే ఎన్నో అధునాతన ఫీచర్లు ఈ ఈవీ సొంతమని సంస్థ తెలిపింది.
సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ బుకింగ్‌కు భారీ స్పందన వచ్చినట్లు సంస్థ తెలిపింది. గత 18 నెలల్లో సుమారు లక్షకు పైగా బుకింగ్‌లను స్వీకరించినట్లు వెల్లడించింది. త్వరలో ప్రాధాన్యత పరంగా డెలివరీలను ప్రారంభిస్తామని తెలిపింది. రానున్న 12 నెలల కాలంలో సుమారు 40 నుంచి 50 నగరాల్లో రిటైల్ వ్యాపార కార్యకలాపాలను ప్రారంభించేందుకు ఈ సంస్థ ప్లాన్ చేస్తోంది. ఈ నగరాల్లో 160 నుంచి 180 రిటైల్ స్టోర్లను విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకుంది.

సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఫిక్సడ్ మరియు పోర్టబుల్ బ్యాటరీలతో అందుబాటులో ఉండనుంది. 5kWh లిథియం అయాన్ డ్యూయల్ బ్యాటరీతో సింగిల్ ఛార్జింగ్‌లో 212 రేంజ్ ఇస్తుందని సంస్థ తెలిపింది. ఈ స్కూటర్ కేవలం 2.77 సెకన్లలో 0-40 km/h వేగాన్ని అందుకుంటుందని సంస్థ వెల్లడించింది. 8.5kW ఎలక్ట్రిక్ మోటార్ 11.39 bhp శక్తిని మరియు గరిష్టంగా 72 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.
సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ 750W ఛార్జర్‌తో సహా ప్రారంభ ధర కింద రూ.1,45,000 కొనుగోలు చేయవచ్చని సంస్థ తెలిపింది. జూన్ 6 నుంచి తొలుత బెంగళూరు నుంచి డెలివరీలు ప్రారంభిస్తామని సంస్థ వెల్లడించింది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ మొత్తం ఆరు రంగుల్లో అందుబాటులో ఉంది. బ్రాజెన్ బ్లాక్, నమ్మా రెడ్, అజూర్ బ్లూ, గ్రేస్ వైట్, మరియు రెండు ప్రత్యేక రంగులైన బ్రాజెన్ X, లైట్ X రంగుల్లో అందుబాటులో ఉంది.

సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ విడుదలపై సింపుల్ ఎనర్జీ సంస్థ సీఈవో సుహాస్ రాజ్‌కుమార్ హర్షం వ్యక్తం చేశారు. ఈరోజు తమ సంస్థ చరిత్రలో గుర్తుండిపోతుందని తెలిపారు. ఒక మైల్‌స్టోన్‌గా నిలిచిపోతుందన్నారు. తమ పెట్టుబడిదారులు, వాటాదారుల సహకారం లేకుండా ఈ కల సాధ్యం అయ్యేది కాదని స్పష్టం చేశారు. మార్కెట్‌కు అనుగుణంగా. ఫలితాల ఆధారం చేసుకొని మరింత పనిచేస్తామని స్పష్టం చేశారు. ఇప్పటికే బుకింగ్ చేసుకున్న వినియోగదారులకు త్వరగా స్కూటర్లు అందించేందుకు అధిక ప్రాధాన్యత ఇస్తామని చెప్పారు.
సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్‌లో అనేక అధునాతన ఫీచర్లు, అధిక రేంజ్ ఉంటాయని సింపుల్ ఎనర్జీ సంస్థ సహ వ్యవస్థాపకుడు శ్రేష్ఠ మిశ్రా తెలిపారు. మార్కెట్‌కు ఏం కావాలో అన్ని కూడా సింపుల్ వన్‌లో ఉన్నాయని చెప్పారు. కస్టమర్లు కూడా సంతృప్తి చెందుతారని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ సంవత్సరం తొలి భాగంలో సింపుల్ ఎనర్జీ సంస్థ తన తయారీ ప్లాంట్‌ను తమిళనాడులోని షోలగిరిలో ఏర్పాటు చేసింది. సంవత్సరానికి సుమారు 5 లక్షల స్కూటర్ల ఉత్పత్తి సామర్థ్యం ఈ ప్లాంట్ సొంతం అని సంస్థ తెలిపింది.
డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








