మే 23న సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ విడుదల.. సింగిల్ ఛార్జింగ్‌లో 236కి.మీ రేంజ్.. ఫీచర్లు అదుర్స్..!
మీరు ఎలక్ట్రిక్ వాహనం కొనుగోలు చేయాలనుకుంటున్నారా.. అధిక రేంజ్, ఎక్కువ సేఫ్టీ కలిగిన ఎలక్ట్రిక్ స్కూటర్ల కోసం ఎదురుచూస్తున్నారా.. అయితే ఈ వాహన ఫీచర్లు, రేంజ్, సేఫ్టీ ఫీచర్లు మీకు కొంత ఆసక్తి కలిగించవచ్చు. పూర్తి వివరాలు మీకోసం..
ప్రముఖ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ సింపుల్ ఎనర్జీ, మరియు స్టార్టప్ క్లీన్ ఎనర్జీ తన ఎలక్ట్రిక్ స్కూటర్ "సింపుల్ వన్" ను లాంచ్ చేసింది. తమిళనాడులోని శూలగిరి ఫ్యాక్టరీ నుంచి తన తొలి ఎలక్ట్రిక్ వాహనాన్ని ప్రదర్శించింది. అయితే మే 23న పూర్తి వివరాలు వెల్లడిస్తామని తెలిపింది. అయితే ఈ వాహనం ప్రస్తుతం ఉన్న వాహనాల కంటే అధిక రేంజ్ కలిగి ఉంటుందని సంస్థ వెల్లడించింది.

ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ తయారీలో భద్రతకు అధిక ప్రాధాన్యత ఇచ్చినట్లు సింపుల్ ఎనర్జీ వెల్లడించింది. అత్యధిక రేంజ్, వేగంతోపాటు సురక్షితమైన, అత్యధిక భద్రతా ప్రమాణాలున్న బ్యాటరీ ప్యాక్‌ను అమర్చినట్లు ప్రకటించింది. దీంతోపాటు ఈ స్కూటర్‌కోసం ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న వినియోగదారుల కోసం డిలివరీలను వేగవంతం చేస్తామని తెలిపింది.
సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ల తయారీని వేగంవంతం చేయడంతోపాటు R&D పైనా అధిక దృష్టి పెట్టాలని నిర్ణయించినట్లు సమాచారం. అయితే ఎలక్ట్రిక్ వాహనాల రంగంలో ముందంజలో ఉండాలనే లక్ష్యంతో సింపుల్ ఎనర్జీ సంస్థ పనిచేస్తున్నట్లు తెలుస్తోంది.
అధికారికంగా మే 23న లాంచ్ కానున్న ఎలక్ట్రిక్ స్కూటర్ సింపుల్ వన్.. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 236km రేంజ్ వరకు ప్రయాణించవచ్చని సంస్థ ప్రకటించింది. గత రెండు సంవత్సరాలుగా ఆటోమోటివ్ ఇండస్ట్రీ స్టాండర్డ్స్ (AIS) 3 ప్రకారం బ్యాటరీ ప్రమాణాలకు అనుగుణంగా పనిచేస్తోన్నట్లు సంస్థ వెల్లడించింది.
సింపుల్ వన్ స్కూటర్ కేవలం 2.77 సెకన్లలో 0 km నుంచి 40 km వేగాన్ని అందుకోగలదని సంస్థ వెల్లడించింది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ అధిక వేగం 105 kmph. ఈ వాహనం 4.8kWh బ్యాటరీ సామర్థ్యం, 8.5 kW ఎలక్ట్రిక్ మోటర్.. 4.5 kWh శక్తి, 72 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.
ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ సింపుల్ వన్.. సెంట్రల్ బ్రేకింగ్ సిస్టమ్ (CBS) మరియు డిస్క్ బ్రేక్‌లను కలిగి ఉంటుంది. ఈ ఈవీ సీట్ కింది భాగంలో 30 లీటర్ల స్టోరేజీ (బూట్ స్పేస్) కలిగి ఉంది. దీంతో పాటు టచ్‌స్క్రీన్‌ను కలిగి ఉంటుందని, ఇక్కడ నుంచే అనేక ఫీచర్లను కంట్రోల్ చేసే వెసులుబాటు ఉండనుంది.
లాంచ్ చేసిన నెలలో స్డాండర్డ్ EV ధర రూ.1.10 లక్షలు, అధిక రేంజ్ ఈవీ ధర రూ. 1.45 లక్షలుగా ఉండనుంది.తర్వాత నెల నుంచి ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ధరలు పెంచే అవకాశం ఉన్నట్లు సమాచారం. సింపుల్ ఎనర్జీ సంస్థను 2019లో స్థాపించారు. చిన్న ఎలక్ట్రిక్ వాహనాల తయారీ రంగంలో అతిపెద్ద సంస్థలో ఒకటిగా కొనసాగుతోంది. ఈ సంస్థ ప్రధాన కార్యాలయం బెంగళూరులో ఉంది.
డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








