సింపుల్‌ ఎనర్జీ నుంచి క్రేజీ అప్‌డేట్‌.. త్వరలో తక్కువ ధరలో రెండు కొత్త ఎలక్ట్రిక్‌ స్కూటర్లు

బెంగళూరు EV స్టార్టప్ కంపెనీ సింపుల్ ఎనర్జీ సరసమైన ఎలక్ట్రిక్ స్కూటర్ల కోసం తన ప్రణాళికలను రూపొందించింది. ఈ ద్విచక్ర వాహన EV స్టార్టప్ జూన్ 6న సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ పేరిట డెలివరీలను ప్రారంభించింది. ఇప్పుడు తాజాగా వినియోగదారులకు మరో తీపి కబురును అందించింది.

సింపుల్ ఎనర్జీ గత కొన్నేళ్లుగా ఇండియన్ స్కూటర్ మార్కెట్‌లో సందడి చేస్తోంది. గత నెలలో ఈ కంపెనీ సింపుల్ వన్ అనే ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ను కూడా విడుదల చేసింది. 2019లో ప్రకటించిన సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఈ సంవత్సరం మార్కెట్‌లోకి విడుదలైంది.

Simple One E Scooter

ఇప్పుడు సింపుల్ ఎనర్జీ మరో క్రేజీ అప్‌డేట్‌తో మళ్లీ వార్తల్లోకి వచ్చింది. అదేంటంటే ఈసారి తక్కువ ధరలో రెండు స్కూటర్లను విడుదల చేయనున్నట్లు పేర్కొంది. ఇప్పటికే ఈ నెల 6 నుంచి కంపెనీ సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ల డెలివరీని ప్రారంభించగా.. ఇప్పుడు మరో రెండు కొత్త స్కూటర్లను అభివృద్ధి చేస్తున్నట్లు ప్రకటించింది.

కస్టమర్ల కోసం దాదాపు నాలుగు సంవత్సరాల నిరీక్షణ తర్వాత కంపెనీ ఇటీవల జూన్ 6, 2023 నుంచి ఈ సింపుల్‌ వన్‌ స్కూటర్‌ను డెలివరీ చేసింది. కాగా కొత్తగా అభివృద్ధి చేయబడిన సింపుల్ వన్ రెండు ఎలక్ట్రిక్‌ స్కూటర్లు వచ్చే త్రైమాసికంలో విడుదల అయ్యే అవకాశాలు ఉన్నట్లు సమాచారం.

Simple One E Scooter

సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్‌లను 2019లో ప్రారంభించినప్పుడు ఔత్సాహికుల్లో దీనిపై హైప్ పెరిగింది. దీన్ని అనుసరించి, సింపుల్‌ వన్‌ స్కూటర్‌కు కస్టమర్ల నుంచి మంచి ఆదరణ లభించింది. మరియు భారీ సంఖ్యలోనూ ఈ స్కూటర్‌కు బుకింగ్‌లు నమోదయ్యాయి. దీన్ని బట్టి ఈ స్కూటర్ క్రేజ్ అర్థం చేసుకోవచ్చు.

సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ ధర భారత్‌లో రూ. 1.45 లక్షల నుంచి రూ. 1.58 లక్షల వరకూ ఎక్స్-షోరూమ్‌లో విడుదల అయింది. ఈ స్కూటర్ యొక్క Brazen X ఎడిషన్ ధర రూ. 1.58 లక్షలుగా ఉంది. ఆకర్షణీయమైన డిజైన్‌ను కలిగి ఉన్న సింపుల్ వన్ ముందు భాగంలో డ్యూయల్ LED హెడ్‌ల్యాంప్‌లతో వస్తుంది.

Simple One E Scooter

ఈ బైక్ యొక్క పవర్ ఫిగర్స్ గురించి చూసుకుంటే 8.5 kW ఎలక్ట్రిక్ మోటార్ 11.39 బీహెచ్‌పీ వద్ద 72 nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ స్కూటర్‌ 5kWh బ్యాటరీని కలిగి ఉంది. ఒక్కసారి పూర్తి ఛార్జ్‌ చేస్తే దాదాపు 212 కి.మీ. రేంజ్‌ను ఇస్తుంది. కేవలం 2.77 సెకన్లలో సున్నా నుంచి 40 కి.మీ ల వేగాన్ని అందుకుంటుంది.

సింపుల్‌ వన్ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ 105 kmph గరిష్ఠ వేగంతో ప్రయాణిస్తుంది. ఈ స్కూటర్ సున్నా నుంచి 80 శాతం ఛార్జ్‌ చేయడానికి 6 గంటల సమయం పడుతుంది. దీంట్లో బ్యాటరీ స్వాపింగ్ ఫీచర్ కూడా అందుబాటులో ఉంది. ఇది ఈ స్కూటర్ రైడర్‌లకు యూజర్‌ ఫ్రెండ్లీగా ఉండనుంది. అజూర్ బ్లూ, నమ్మా రెడ్, గ్రేస్ వైట్, బ్రాజెన్ బ్లాక్, బ్రాజెన్ ఎక్స్ మరియు లైట్ ఎక్స్ కలర్స్‌లో లభిస్తుంది.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్ కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Friday, June 16, 2023, 9:06 [IST]
English summary
Simple energy to launch two affordable electric scooters soon details in telugu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+