Simple One రెండేళ్లుగా ఊరిస్తున్న సింపుల్ వన్ స్కూటర్.. తాజాగా విడుదల తేది ప్రకటన.. సింగల్ ఛార్జ్‌లో 236 కి.మీ
ఎలక్ట్రిక్ వాహనాల వినియోగదారులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న క్లీన్ ఎనర్జీ ఎలక్ట్రిక్ స్కూటర్ త్వరలోనే అందుబాటులోకి రానుంది. సింపుల్ వన్‌నుంచి వస్తున్న ఈ భారతీయ స్టార్టప్ స్కూటర్ కోసం అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దీనికి కారణం ఈ స్కూటర్ విడుదల అవ్వాల్సిన తేది పలుమార్లు వాయిదా పడటమే కారణం. తాజాగా విడుదల తేదిని సంస్థ ప్రకటించింది.
23 మే 2023న బెంగళూరులో ఈ స్కూటర్ ను లాంఛ్ చేస్తున్నట్లు సంస్థ తెలిపింది. దీంతో రెండేళ్ల నిరీక్షణకు తెరపడనుంది. సింపుల్ వన్ ఎలక్ట్రిక్ వెహికల్ ఈ2డబ్ల్యూ (ఎలక్ట్రిక్ టూ వీలర్) అత్యంత వేగవంతమైన స్కూటర్ గా ఆవిష్కరణ నుంచి మార్కెట్ వార్తల్లో నిలుస్తోంది. సింపుల్ ఎనర్జీ తన అధికారిక లాంఛ్ ని ధృవీకరించడంతో పాటు, భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా బ్యాటరీ ప్యాక్ ను కలిగి ఉంటుందని సంస్థ తెలిపింది.

ఆటోమోటివ్ ఇండస్ట్రీ స్టాండర్డ్స్ (AIS) 156 సవరణ 3 కు అనుగుణంగా తయారైన మొదటి సంస్థగా సింపుల్ ఎనర్జీ నిలిచింది. ఇది వినియోగదారులకు అధిక బ్యాటరీ భద్రతను కల్పిస్తుంది. ఇంకా డిజైన్, బ్యాటరీ, పవర్ట్రెయిన్లలో ఈ సింపుల్ వన్ స్కూటర్ ని సంస్థ మెరుగుపరచింది. మొత్తానికి సాటిలేని భద్రతను ఈ స్కూటర్ అందించనుంది. ఇది గ్లోబల్ స్థాయికి సరిపోయే ఉత్పత్తిగా ఇండియన్ మార్కెట్ లో నిలువనుంది.
క్లీనర్ మొబిలిటీ సొల్యూషన్స్ కోసం ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకంతో దీనిని తీసుకువచ్చింది. దేశంలో ఎలక్ట్రిక్ వాహనాలకు విపరీతంగా పెరుగుతున్న పొందుతున్న సమయంలో సింపుల్ వన్ ని తీసుకురావడం విశేషం. ప్రీమియం ఎలక్ట్రిక్ స్కూటర్లలో సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్లకు పెరుగుతున్న డిమాండ్ ని తీర్చనుందని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు.
ఈ అధునాతన సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఒక్కసారి ఛార్జ్ చేస్తే 236 కిలోమీటర్ల పరిధిని అందించనుంది. అంతేకాకుండా కేవలం 0.40 సెకన్లలో 2.77 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. గంటకు ఇది 105 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించనుంది. రూ స్కూటర్లలో స్టాండర్డ్ వేరియంట్ రూ .1.10 లక్షలుగా ఉండనుంది. అలానే ఎక్స్ట్రా రేంజ్ వెర్షన్ రూ .1.45 లక్షలుగా ఉంటుందని సంస్థ ప్రకటించింది.
15 ఆగస్టు 2021 న వరల్డ్ ఈ స్కూటర్ ని తీసుకువస్తున్నట్లు సింపుల్ వన్ ప్రకటించింది. అప్పటి నుంచే బుకింగ్స్ కూడా అదే రోజు భారతదేశంలో రూ.1947 /- టోకెన్ చెల్లింపుతో ప్రారంభమయ్యాయి. దాదాపు రెండేళ్ల నిరీక్షణ తర్వాత సింపుల్ వన్ వచ్చే నెలలో బెంగళూరులో అధికారికంగా విడుదల కానుంది.
సింపుల్ వన్ తయారీకి ముందే కస్టమర్లకు గ్లోబల్ స్థాయికి సరిపోయే ఉత్పత్తిని అందించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు సింపుల్ ఎనర్జీ ఫౌండర్, సీఈవో శ్రీ సుహాస్ రాజ్ కుమార్ తెలిపారు. గత 2 సంవత్సరాలుగా ఈ ఉత్పత్తిని తీవ్రంగా పరీక్షించినట్లు చెప్పారు. కస్టమర్ భద్రత విషయంలో రాజీపడేది లేదని ఆయన వివరించారు.
డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్ కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








