ఖచ్చితంగా 50 కి.మీల మైలేజీ అందించే ది బెస్ట్ స్కూటర్లు..

ప్రతి ఇంట్లో ద్విచక్ర వాహనం అనేది కామన్. అది బైక్ లేదా స్కూటర్ కావచ్చు. యూత్ ఎక్కువగా స్టైలిష్ గా ఉండే బైక్స్ పట్ల ఆసక్తి కనబరిస్తే.. మధ్య వయస్కులు, మహిళలు తేలికగా, నడపడానికి అనువుగా ఉండే, బడ్జెట్ ధరలో లభించే స్కూటర్లపై ఆసక్తి కనబరుస్తారు.

అయితే స్కూటర్ కొనుగోలు చేసే ముందు ఎవరైనా సరే చాలా విషయాలను పరిశీలిస్తారు. పనితీరు, మైలేజ్, ఇంజిన్.. ఇలా అన్ని పరిశీలించిన తర్వాతనే కొనుగోలు చేస్తారు. అయితే వీటిలో అన్నిటికంటే ముఖ్యమైనది మైలేజ్. అధిక మైలేజ్ ఇచ్చే స్కూటర్లకే మార్కెట్లో డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. ఈ నేపథ్యంలో మంచి మైలేజ్ ఇచ్చే టాప్ 6 స్కూటర్ల జాబితా ఇక్కడ మీ కోసం..

Six-Affordable-Scooters

స్కూటర్ కొనుగోలు చేసేటప్పుడు చాలా మందికి మైలేజ్ ముఖ్యమైన అంశం. ఈ నేపథ్యంలో పలు స్కూటర్ల కంపెనీలు ఆకట్టుకునే ఇంధన సామర్థ్యంతో పలు మోడళ్లను ప్రవేశపెడుతున్నారు. ఇవి రోజువారీ ప్రయాణానికి అనుకూలంగా ఉంటాయి. 50km అంతకంటే ఎక్కువ మైలేజ్ ఇస్తూ తక్కువ ధరలో లభించే ఆరు స్కూటర్లు ఇక్కడ ఉన్నాయి.

Yamaha-Ray-ZR

Yamaha RayZR 125 యమహా రేZR మంచి మైలేజ్ అందించే సమర్థవంతమైన స్కూటర్.. ఇది లీటరుకు 71 కి.మీ వరకు ఆకట్టుకునే మైలేజ్ అందిస్తుంది. ఇక 8.2 hp వద్ద 10.3 nm గరిష్ఠ టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. 125 సీసీ, ఎయిర్ కూల్డ్ ఇంజిన్ తో పనిచేస్తుంది. దీని ధర ఎక్స్ షో రూమ్ ప్రకారం రూ. 84,730 గా ఉంది.

Yamaha Fascino 125Fi యమహా నుంచి మరొక స్కూటర్ ఫాసినో 125 Fi కూడా RayZR మాదిరి అదే హైబ్రిడ్ సాంకేతికతను కలిగి ఉంది. ఇది 8.2 hp వద్ద 10.3 nm గరిష్ఠ టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. 125 సీసీ, ఎయిర్ కూల్డ్ ఇంజిన్ కలిగి ఉంది. ఇది లీటరుకు 68.75 కి.మీ మైలేజ్ ఇస్తుంది. ధర రూ. 79,600.

Hero-Maestro-Edge-125

Hero Maestro Edge 125 హీరో మాస్ట్రో ఎడ్జ్ 125 హీరో బ్రాండ్ నుంచి ప్రముఖ స్కూటర్. ఇది 65 కి.మీ వరకు మైలేజ్‌ను క్లెయిమ్ చేస్తుంది. ఈ స్కూటర్లో దాని చిక్ ఎక్స్‌టీరియర్ కింద 124.6 సీసీ, ఎయిర్ కూల్డ్ ఇంజిన్ కలిగి ఉంది. 9 hp వద్ద 10.4 NM గరిష్ఠ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీని ప్రారంభ ధర రూ. 86,160 గా ఉంది.

TVS జూపిటర్ టీవీఎస్ జూపిటర్ దేశంలో అత్యంత ఎక్కువగా విక్రయించబడుతున్న ఫ్యూయెల్ ఎఫీషియెంట్ స్కూటర్లలో ఒకటి. ఇది 109.7 సీసీ, ఎయిర్ కూల్డ్ ఇంజిన్ కలిగి ఉంది. ఈ స్కూటర్ లీటరకు 64 కి.మీ మైలేజ్ అందిస్తుంది. దీని ధర రూ. 73,340 గా ఉంది.

Honda-Activa-125

Honda Activa 125 హోండా యాక్టివా 125 దేశీయ మార్కెట్లో కస్టమర్ల ఫేవరెట్ స్కూటర్. ఇది 125 సీసీ, ఎయిర్ కూల్డ్ ఇంజిన్ కలిగి ఉంది. 8.18 hp వద్ద 9.89 NM గరిష్ఠ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. హోండా యాక్టివా 60 కి.మీ మైలేజ్ ఇస్తుంది. దీని ధర ఎక్స్ షో రూమ్ ప్రకారం రూ. 79,806 గా ఉంది.

TVS Ntorq 125 ఈ స్కూటర్ స్పోర్టీ ఇంకా ఫీచర్ రిచ్ ఆప్షన్. ఇది 125 సీసీ, ఎయిర్ కూల్డ్ ఇంజిన్ కలిగి ఉంది. సింగిల్ సిలిండర్ ఇంజిన్ 9.2 hp వద్ద 10.5 NM గరిష్ఠ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. టీవీఎస్ ఎన్ టార్క్ స్కూటర్ 50 కి.మీ మైలేజ్ ఇస్తుంది. దీని ధర రూ. 84,636.

TVS-Ntorq

More from DriveSpark

Article Published On: Wednesday, September 6, 2023, 13:38 [IST]
English summary
Six affordable scooters list with 50 km plus mileage
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+