SBA-8 Helmet తక్కువ బరువు, హై సేఫ్టీ ఫీచర్‌తో సరికొత్త హెల్మెట్‌ను పరిచయం చేసిన STEELBIRD

ద్విచక్ర వాహనం నడిపేవారికి హెల్మెట్‌ తప్పనిసరి. ప్రమాదం జరిగినప్పుడు ప్రాణాపాయం నుంచి తప్పించుకోవడంలో హెల్మెట్‌ కీలక పాత్ర పోషిస్తుంది. అయితే యూత్‌కి అభిరుచికి అనుగుణంగా రకరకాల హెల్మెట్లు మార్కెట్లోకి వస్తున్నాయి. ఈ క్రమంలో ఆసియాలోనే అతిపెద్ద హెల్మెట్‌ తయారీ సంస్థ STEELBIRD Hitech India Limited కొత్త Helmet SBA-8ని పరిచయం చేసింది.

కొత్త SBA-8 Helmet ను యూత్‌కు నచ్చేలా రూపొందించినట్లు STEELBIRD సంస్థ తెలిపింది. ఇది తేలికైన, స్టైలిష్, సౌకర్యవంతంగా ఉండటమే కాకుండా రైడర్‌కు సేఫ్టీని ఇస్తుందని అని కంపెనీ స్పష్టం చేసింది. మరి ఈ కొత్త హెల్మెట్ గురించి విశేషాలు, ఫీచర్లు ఈ కథనంలో తెలుసుకోండి.

STEELBIRD-SBA-8-Helmet

కొన్ని మోడల్స్‌ హెల్మెట్లు రైడర్లకు కొంచెం అసౌకర్యాన్ని కలిగించవచ్చు. అయితే SBA-8 హెల్మెట్ తేలికగా ఉండటంతో బైకర్లు.. చెమటలు పట్టించే, అసౌకర్యంగా ఉండే హెవీ హెల్మెట్లకు వీడ్కోలు చెప్పవచ్చు. ఈ Helmet పైన థర్మోప్లాస్టిక్ షెల్ ఉంది. ఇది డిజైన్‌ సింపుల్‌గా లైట్‌ వెయిట్‌గా ఉండటంతో.. రైడర్‌కు ఉన్నతమైన రక్షణను అందిస్తుంది.

అంతే కాకుండా SBA-8 Helmet speciality ఏంటంటే ఇందులో ఉష్ణోగ్రతను కంట్రోల్‌ చేసే డైనమిక్ ఎయిర్‌ఫ్లో వెంటిలేషన్ సిస్టమ్‌ను కూడా కలిగి ఉంది. దీని ద్వారా (SBA-8 Helmet Benefits) మీకు రైడింగ్‌లో చెమట, అలసట లేకుండా చల్లదనాన్ని ఇస్తుందని కంపెనీ వివరించింది.

STEELBIRD-SBA-8-Helmet

SBA-8 హెల్మెట్‌ ద్వారా బైక్‌ రైడర్‌(Bike Rider) భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నట్లు స్టీల్‌బర్డ్‌ కంపెనీ ప్రతినిధి రాజీవ్‌ కపూర్‌ తెలిపారు. ప్రమాదం జరిగినప్పుడు తలకు తీవ్ర గాయాలయ్యే ప్రమాదాన్ని నివారించడానికి అధిక సాంద్రత కలిగిన EPS (ఎక్స్‌పాండెడ్ పాలీస్టైరిన్)ను పొందుపరిచినట్లు పేర్కొన్నారు. రాత్రి వేళల్లో జర్నీ చేసేటప్పుడు బైకర్‌కు ఈ Helmet విజిబిలిటీని గణనీయంగా మెరుగుపరుస్తుందని.. ప్రతి రైడ్‌ను సురక్షితంగా మారుస్తుందని రాజీవ్‌ కపూర్‌ అన్నారు.

SBA-8 Helmet Design విజయానికొస్తే ఇందులో పాలికార్బోనేట్ (PC) విజర్ కూడా ఉంది. ఇది ఫాగ్‌ మరియు క్రోమ్ ఫినిషింగ్‌లలో లభిస్తుంది. ఇది రైడర్‌కు స్పష్టమైన విజిబిలిటీని అందించేందుకు యాంటీ-స్క్రాచ్ కోటింగ్‌ను కలిగి ఉంది. అంతేకాకుండా మైక్రోమెట్రిక్ బకిల్స్ అమర్చారు. ఈ హెల్మెట్‌ను మీరు సులువుగా తలకు ధరించవచ్చు.

STEELBIRD-SBA-8-Helmet

SBA-8 హెల్మెట్ యొక్క పాలికార్బోనేట్ (PC) స్పాయిలర్ పెయింటెడ్ బ్లాక్ మరియు క్రోమ్ ఫినిషింగ్‌లలో కూడా లభిస్తుంది. దీని ద్వారా Helmet ఓవరాల్‌ లుక్‌ అనేది మరింత మెరుగుపడుతుంది. దేశంలో వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా హెల్మెట్‌ లోపల టెంపరేచర్‌ కంట్రోల్ అవుతుంది. దీని ద్వారా మీకు రైడింగ్‌లో ఒత్తిడి తగ్గుతుంది.

SBA-8 అనేది Flip-Up హెల్మెట్‌ ఫీచర్‌తో వస్తుంది. దీని ద్వారా ఓపెన్-ఫేస్ మరియు ఫుల్-ఫేస్ మోడ్‌ల మధ్య ఈజీగా మారవచ్చు. అంతేకాకుండా రైడర్‌లకు అవసరమైన ఫ్లెక్సిబిలిటీని కూడా అందిస్తుంది. హెల్మెట్ ఏరోడైనమిక్ డిజైన్ SBA-8 లుక్‌ను మెరుగుపరచడమే కాకుండా ఎయిర్‌ రెసిస్టెన్స్‌ను కూడా తగ్గిస్తుంది.

SBA-8 హెల్మెట్ స్పోర్టీ, అగ్రెసివ్, ఫోటోక్రోమిక్ మరియు క్రోమ్ ఫినిషింగ్‌లతో సహా అనేక రకాల గ్రాఫిక్స్ ఆప్షన్స్‌తో స్టీల్‌బర్డ్‌ ప్రవేశపెట్టింది. SBA-8 హెల్మెట్ మీడియం (580mm), పెద్ద (600mm), మరియు XL (620mm) సైజుల్లో అందుబాటులో ఉంది. ఈ హెల్మెట్‌ అధునాతన ఫీచర్లు మరియు ఆలోచనాత్మకమైన డిజైన్‌తో, బైక్‌ హెల్మెట్‌లకు కొత్త ప్రమాణాన్ని సెట్ చేసినట్లు కంపెనీ వెల్లడించింది.

More from DriveSpark

Article Published On: Wednesday, September 20, 2023, 21:43 [IST]
English summary
Steelbird hi tech india limited introduces sba 8 helmet with comfort superior protection features
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+