సుజుకి స్కూటర్లపై పండుగ ధమాకా ఆఫర్లు.. క్యాష్‌బ్యాక్‌తో పాటు మరెన్నో ప్రయోజనాలు, ఆఫర్ ఆ రోజే లాస్ట్.!!
పండుగ సీజన్ సందర్భంగా సుజుకి.. మోటార్ సైకిళ్లు, స్కూటర్లపై భారీ ఆఫర్లు ప్రకటించింది. రూ. 5000 వరకు క్యాష్‌బ్యాక్‌తో పాటు ఇతర ప్రయోజనాలను అందిస్తోంది. పూర్తి వివరాల్లోకి వెళితే..
రానున్న దీపావళి సందర్భంగా సుజుకి మోటార్‌సైకిల్స్ మరియు స్కూటర్ ఇండియా.. కస్టమర్ల కోసం భారీ ఆఫర్లను ప్రకటించింది. ఈ ఆఫర్ ద్వారా క్యాష్‌బ్యాక్‌తో ఇతర ఆఫర్లను పొందవచ్చు. 100 శాతం లోన్ సౌకర్యంతో పాటు ఇతర ప్రయోజనాలను అందిస్తోంది. అయితే ఈ ఆఫర్లు ఈ నెల 31 వరకు అందుబాటులో ఉంటాయని గుర్తించాలి.

బ్రాండ్ రూ. 5000 వరకు క్యాష్‌బ్యాక్‌తో పాటు, స్కూటర్లు మరియు మోటార్ సైకిళ్లపై 100 శాతం లోన్ సౌకర్యం సుజుకి కల్పిస్తుంది. ఇది కాకుండా రూ. 6,999 విలువైన సుజుకి రైడింగ్ జాకెట్‌ను, మోటార్ సైకిళ్లపై రూ. 7000 వరకు బీమా ప్రయోజనాలను అందిస్తుంది.
సుజుకి ప్రస్తుతం మోటార్ సైకిళ్లు, బైక్‌లు, స్కూటర్లను విక్రయిస్తోంది. కాగా స్కూటర్ పోర్ట్‌ఫోలియోలో Avenis, Access 125, Burgman street ఇంకా Burgman street స్కూటర్లు ఉన్నాయి. ఇంకా మోటార్‌సైకిళ్ల జాబితాను పరిశీలిస్తే.. V-Strom SX, Gixxer SF 250, Gixxer 250, Gixxer SF, Gixxer ఉన్నాయి. ఇంకా కటన, హయబుసా, V Strom 650 XT బైక్‌లను విక్రయిస్తోంది.

కాగా సుజుకి ప్రస్తుతం V-Strom 800DE బైక్ పరిచయంతో ఆ లైనప్‌ను విస్తరించే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది. కాగా ఇప్పటికే దీనికి సంబంధించి పలు స్పై చిత్రాలు బయటకు వచ్చాయి. ఈ బైక్‌ను 776 cc సామర్థ్యంతో సవరించిన ఫ్రేమ్‌ను కలిగి ఉంది.
V-Strom 800DE స్పెసిఫికేషన్ల విషయానికొస్తే ఇందులో క్రాస్ బ్యాలెన్సర్, 270 డిగ్రా క్రాంక్ షాఫ్ట్ డిజైన్‌తో కూడిన లిక్విడ్ కూల్డ్ ఇంజిన్‌ను కలిగి ఉంది. 8500 rpm వద్ద 83 bhp గరిష్ఠ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. అయితే టార్క్ అవుట్‌పుట్ వివరాలు ఇంకా వెల్లడి కాలేదు. 6 స్పీడ్ గేర్‌బాక్స్ యూనిట్‌ను కలిగి ఉండగా, 22.7 kmpl మైలేజ్‌ను ఇస్తుందని కంపెనీ వెల్లడించింది.

ఇక V-Strom 800DE బైక్ డిజైన్ విషయానికొస్తే.. రైడ్ బై వైర్, ఫ్యూయెల్ ఇంజెక్షన్, బై డైరెక్షనల్ క్విక్ షిఫ్ట్ సిస్టమ్, సుజుకి ఈజీ స్టార్ట్ సిస్టమ్, లో rpm అసిస్ట్, 3 అడ్జస్టబుల్ పొజిషన్‌తో కూడిన విండ్ షీల్డ్‌లు ఉన్నాయి. ఇంకా ప్రొటెక్టర్, మొబైక్ ఫోన్ ఛార్జ్ చేయడానికి USB పోర్ట్ కూడా ఉన్నాయి.
V-Strom 800DE బైక్‌లో మూడు వేర్వేరు అవుట్‌పుట్ లక్షణాలతో సుజుకి డ్రైవ్ మోడ్ సెలెక్టర్ మరో ప్రత్యేకత అనే చెప్పవచ్చు. ట్రాక్షన్ కంట్రోల్‌లో నాలుగు వేర్వేరు మోడ్‌లు ఉన్నాయి. 5 అంగుళాల TFT స్క్రీన్, ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌ను కలిగి ఉంది.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








