Suzuki Matsuri Bike Fest: ఐకానిక్ రైడ్‌లతో అట్టహాసంగా ముగిసిన సుజుకి మత్సూరి బైక్ ఫెస్ట్ రెండవ ఎడిషన్
ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ సుజుకి మోటార్‌సైకిల్ ఇండియా.. సుజుకి మత్సూరి బైక్ ఫెస్ట్ రెండవ ఎడిషన్ ఘనంగా జరిగింది. బెంగళూరులో 3,300 మంది బైక్ ప్రియుల ఉత్సాహం నడుమ ఐకానిక్ మోటార్‌సైక్లింగ్ ఫెస్ట్(Iconic Motorcycle Fest) అట్టహాసంగా ముగిసింది. పూర్తి సమాచారం ఈ కథనంలో..
బెంగళూరులో డిసెంబర్ 20న సుజుకి మోటార్ కార్పొరేషన్ యొక్క ద్విచక్ర వాహన అనుబంధ సంస్థ, సుజుకి మోటార్‌సైకిల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ (SMIPL).. సుజుకి మత్సూరి(Suzuki Matsuri 2nd Edition) రెండవ ఎడిషన్‌ను విజయవంతంగా ముగించింది. JK గ్రాండ్ అరేనాలో 3,300 మంది ఔత్సాహికులతో ఈ ఈవెంట్ ఘనంగా జరిగింది.

సుజుకి మత్సూరి రెండవ ఎడిషన్.. మోటార్‌సైక్లింగ్ సంస్కృతి మరియు సమాజ స్ఫూర్తిని చాటి చెబుతూ మరపురాని వేడుకగా నిలిచింది. ఈ కార్యక్రమంలో 3,300 మందికి పైగా బైక్ రైడింగ్ ఔత్సాహికులు పాల్గొని మోటార్‌సైక్లింగ్‌పై తమ అభిరుచిని ప్రదర్శించారు. ఐకానిక్ రైడ్‌లతో వీక్షకులను ఆకట్టుకున్నారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారికి సుజుకి మోటార్‌సైకిల్ ఇండియా, EVP సేల్స్, మార్కెటింగ్ & ఆఫ్టర్ సేల్స్ దేవాశిష్ హండా కృతజ్ఞతలు తెలిపారు. బెంగుళూరులో సుజుకి మత్సూరికి వచ్చిన అద్భుతమైన స్పందన చూసి సంతోషిస్తున్నట్లు చెప్పారు. 3,300 మంది ఔత్సాహికులు చురుకుగా పాల్గొనడం నిజంగా సంతోషదాయకమన్నారు.

సుజుకి మత్సూరి కేవలం ఒక ఈవెంట్ కాదని దేవాశిష్ హండా అన్నారు. ఇది డైనమిక్ మోటార్‌సైకిల్ సంఘం యొక్క వేడుకగా అభివర్ణించారు. ఈ ఎడిషన్ అత్యద్భుతంగా జరిగేందుకు తమ ఫుల్ సపోర్ట్‌ను అందించినందుకు గాను పార్టిసిపెంట్స్‌కు ధన్యవాదాలు తెలిపారు. వారి ఉత్సాహాన్ని అభినందిస్తున్నట్లు పేర్కొన్నారు.

సుజుకి మత్సూరి బైక్ ఫెస్ట్‌లో ఐకానిక్ రైడ్‌లుగా హయాబుసా కవాతు మరియు గిక్సర్ కవాతు నిలిచాయి. సెంటర్ ఆఫ్ అట్రాక్ష్‌గా నిలిచి ప్రేక్షకుల నుంచి ప్రశంసలను పొందాయి. ఈ పరేడ్ మోటార్‌సైకిళ్ల పరాక్రమాన్ని ప్రదర్శించింది. అంతే కాకుండా లెజెండరీ హయబుసా మరియు డైనమిక్ జిక్సర్‌ల ద్వారా రైడర్లపై అభినందనల వెల్లువ కురిసింది.
సుజుకి మత్సూరి బైక్ ఫెస్ట్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. జింఖానా ట్రాక్‌లపై రైడర్లను తమ నైపుణ్యాలను అత్యద్భుతంగా ప్రదర్శించారు. జిప్ ట్రాక్‌లో అల్టిమేట్ స్పీడ్‌ను ప్రదర్శిస్తూ వివిధ రకాల థ్రిల్లింగ్ ఫీలింగ్స్‌ను అనుభవించారు. సుజుకి మోటార్‌సైకిళ్ల డైనమిక్ ప్రతిభను ఈ ఈవెంట్‌లో ప్రతిబింబించారు.

బెంగళూరులో అత్యంత గ్రాండ్‌గా జరిగిన సుజుకి మత్సూరి బైక్ ఫెస్ట్‌లో బైక్ రైడింగ్‌తో పాటు ప్రేక్షకులకు ఎంటర్‌టైన్‌మెంట్ అందించేందుకు వివిధ రకాల స్టాల్స్‌ను కూడా ఏర్పాటు చేశారు. విభిన్న రకాల నోరూరించే వంటకాలతో భోజన ప్రియుల కోసం ఫుడ్ స్టాల్స్‌ను ఏర్పాటు చేశారు. కళ్లు మిరుమిట్లు గొలిపే లైటింగ్, ఆకట్టుకునేలా మ్యూజికల్ ఈవెంట్‌తో ప్రేక్షకులకు వీనులవిందుగా నిలిచింది.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








