160 km రేంజ్‌తో స్విచ్ మోటోకార్ప్ నుంచి త్వరలో సరికొత్త ఎలక్ట్రిక్ బైక్ CSR 762.. ఫీచర్లు ఇవే..
దేశీయ మార్కెట్లోకి త్వరలో మరో కొత్త ఎలక్ట్రిక్ బైక్ రానుంది. అహ్మదాబాద్‌కు చెందిన స్టార్టప్ స్విచ్ మోటోకార్ప్ నుంచి కొత్త CSR 762 ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్‌ను ఆవిష్కరించింది. మరో మూడు నెలల్లో అందుబాటులోకి రానుంది.
దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల హవా నడుస్తోంది. కస్టమర్ల అభిరుచికి అనుగుణంగా అధునాతన మోడళ్లు, డిజైన్‌లతో ఈవీలను తయారుచేస్తున్నారు. పెరుగుతున్న ఫ్యూయెల్ ధరలు కూడా ఇందుకు ఓ కారణం. స్టార్టప్‌లు సైతం ఈ రంగంలోకి అడుగుపెట్టి ఊహించని సేల్స్‌తో దూకుడు కొనసాగిస్తున్నాయి. తాజాగా మరో స్టార్టప్ నుంచి మరో కొత్త బైక్ త్వరలో లాంచ్ కానుంది.

అహ్మదాబాద్‌కు చెందిన ఎలక్ట్రిక్ టూ వీలర్ స్టార్టప్ Svitch Motocorp తాజాగా కొత్త CSR 762 ఎలక్ట్రిక్ బైక్‌ను ఆవిష్కరించింది. వచ్చే ఏడాది ప్రారంభంలో ఈ బైక్ విడుదల కానుంది. ఈ ఎలక్ట్రిక్ మోటార్ సైకిళ్ల తయారీకి స్విచ్ సంస్థ రూ. 100 కోట్ల పెట్టుబడి పెట్టింది. అత్యున్నత క్వాలిటీ, మెరుగైన పనితీరుతో హై స్టాండర్డ్ ప్రమాణాలకు అనుగుణంగా రూపొందించినట్లు సంస్థ తెలిపింది.
ఇక కొత్త Svitch CSR 762 ఎలక్ట్రిక్ బైక్ డిజైన్‌ను పరిశీలించినట్లయితే.. పూర్తి సమర్థవంతంగా రూపొందించారు. సిగ్నేచర్ LED DRL డిజైన్ ప్రత్యేక ఆకర్షణగా ఉంటుంది. మొత్తంగా ఇతర సంస్థలకు చెందిన ఎలక్ట్రిక్ బైక్‌లతో పోలిస్తే CSR 762 సరికొత్తగా ఉంటుందని సంస్థ వెల్లడించింది.

Svitch CSR 762 ఎలక్టిక్ బైక్‌లో మోటారు పనితీరును పరిశీలిస్తే.. ఇందులో 3 kW PMS ఎలక్ట్రిక్ మోటార్‌ను కలిగి ఉంది. 3,800 RPM వద్ద 13.4 bhp గరిష్ఠ శక్తిని ఉత్పత్తి చేస్తుంది. గరిష్ఠంగా 165 టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. గరిష్ఠంగా గంటకు 120 కి.మీ వేగంతో ప్రయాణిస్తుంది.
కొత్త Svitch CSR 762 ఎలక్ట్రిక్ బైక్‌లో 3.6 kWh లిథియం- అయాన్ స్వాపబుల్ బ్యాటరీ ప్యాక్‌ను అమర్చారు. పూర్తి బ్యాటరీ ఛార్జ్‌పై 160 కి.మీ రేంజ్‌ను ఇస్తుంది. గతేడాది ఈ సంస్థ ప్రకటించిన స్పెసిఫికేషన్లతో పోల్చిచే 40 కి.మీ రేంజ్ పెరిగింది.

ఇక కొత్త Svitch CSR 762 ఎలక్ట్రిక్ బైక్‌లో 40 లీటర్ బూట్ స్పేస్, మొబైల్ ఛార్జర్, పూర్తిగా కవర్ అయిన మొబైల్ హోల్డర్‌తో సహా అనేక ఫీచర్లను కలిగి ఉంది. హై రేంజ్‌తో సహా.. సూపర్ డిజైన్ లుక్‌తో అధునాతన ఫీచర్లతో ఈ బైక్ చాలా స్టైలిష్‌గా ఉందనే చెప్పవచ్చు. హైదరాబాద్‌తో సహా, చెన్నె, బెంగళూరు నగరాల్లో షోరూమ్‌ల ద్వారా విక్రయాలు జరపనున్నట్లు కంపెనీ తెలిపింది.
Svitch CSR 762 ఎలక్ట్రిక్ బైక్ గురించి స్విచ్ మోటోకార్ప్ కో ఫౌండర్ రాజ్ పటేల్ మాట్లాడారు. ఈ ప్రయాణంలో ఎన్నో సవాళ్లను అధిగమించినట్లు చెప్పారు. ఈవీ పరిశ్రమలో గేమ్ ఛేంజర్‌గా మారడానికి తమ కొత్త ఎలక్ట్రిక్ బైక్‌ను పరిచయం చేస్తున్నందుకు సంతోషిస్తున్నామన్నారు. మేక్ ఇన్ ఇండియా నినాదంతో దేశ ఆర్థిక వృద్ధికి దోహదపడుతుందన్నారు.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








