భారత్‌లో మరో కొత్త ఎలక్ట్రిక్‌ స్కూటర్‌.. ఆ రోజే లాంచ్‌, క్యూట్‌ లుక్‌తో పాటు అతి పెద్ద బూట్‌ స్పేస్‌.!!

అంతర్జాతీయ మార్కెట్లో ప్రసిద్ధి చెందిన ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ త్వరలో భారత్‌లో అడుగు పెట్టబోతున్నట్లు సమాచారం.. ఇంతకీ ఇది ఏ బ్రాండ్? దేశంలో ఎప్పుడు అడుగు పెట్టబోతోంది. ధర, ఫీచర్లు ఏంటి.?? పూర్తి సమాచారం ఈ కథనంలో చదివేయండి..

ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాలకు(Electric Vehicles) కస్టమర్ల నుంచి డిమాండ్‌ రోజురోజుకీ పెరుగుతోంది. భారత్‌లోనూ ఎలక్ట్రిక్‌ వాహనాలకు ఇదే స్థాయిలో ఆదరణ కనిపిస్తోంది. ఇంకా చెప్పాలంటే, దేశంలో ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ అధికంగా ఉందనే చెప్పొచ్చు. ఈ క్రమంలో ప్రముఖ ఆటో కంపెనీలతో పాటు స్టార్టప్‌లు కూడా ఈ రంగంలోకి అడుగుపెట్టి సత్తా చాటుతున్నాయి.

Gogoro-Electric-Scooter

ఈ నేపథ్యంలో కొన్ని అంతర్జాతీయ కంపెనీలు భారత మార్కెట్లోకి ప్రవేశించేందుకు ఆసక్తి కనబరుస్తున్నాయి. ఈ దశలోనే ఓ కొత్త విదేశీ కంపెనీ త్వరలో భారత్‌లో అడుగు పెట్టబోతున్నట్లు సమాచారం. తైవాన్‌కు చెందిన ప్రముఖ ఎలక్ట్రిక్ బైక్ తయారీదారు గొగొరో(Taiwan's Gogoro). ఈ కంపెనీ త్వరలో భారత్‌లో ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ను విడుదల చేయనుంది.

గొగొరో ఇప్పటికే భారత్‌లో తన కార్యకలాపాలను ప్రారంభించినట్లు సమాచారం. ఇది భారత కస్టమర్ల కోసం స్పెషల్‌గా ఓ వెబ్‌సైట్‌ను సైతం అందుబాటులో ఉంది. కాగా ఈ సైట్‌లో రెండు ఎలక్ట్రిక్(Electric Scooter) స్కూటర్‌ల సమాచారం ఉంది. ఈ దశలో గొగొరో భారత మార్కెట్‌ కోసం తన మొదటి ఉత్పత్తిని అధికారికంగా ప్రారంభించనున్నట్లు సమాచారం.

Gogoro-Electric-Scooter

గొగొరో ఎలక్ట్రిక్ స్కూటర్ భారత మార్కెట్లో డిసెంబర్ 12న విడుదల కానుంది. ప్రస్తుత సమాచారం ప్రకారం, ఇండియాలో కంపెనీ యొక్క మొదటి ఎలక్ట్రిక్ స్కూటర్ క్రాస్ఓవర్ ఎలక్ట్రిక్ స్కూటర్ అని తెలుస్తోంది. అయితే దీనిని ఏ పేరుతో విక్రయిస్తారనే దానిపై ఇంకా ఎలాంటి సమాచారం అందుబాటులో లేదు.

కాగా Gogoro కంపెనీ గత అక్టోబర్‌లో ప్రపంచవ్యాప్తంగా అడ్వెంచర్ ఇ-స్కూటర్‌ను లాంచ్‌ చేసింది. దీనినే భారత మార్కెట్లోనూ విడుదల చేసే అవకాశాలు ఉన్నాయని మార్కెట్‌ వర్గాలు భావిస్తున్నాయి. ఈ ఇ స్కూటర్‌ చాలా రగ్డ్ లుక్‌లో ఉండటంతో.. భారత రోడ్లపై నడపడానికి ఇది అన్ని రకాలుగా అనువుగా ఉండనున్నట్లు తెలుస్తోంది.

Gogoro-Electric-Scooter

ఇక ఈ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌లో ఫీచర్ల విషయానికొస్తే దీనిని ఆఫ్-రోడ్ కోసం అనువుగా రూపొందించారు. ఐరన్ క్వార్ట్స్ ముందు మరియు సైడ్‌ ప్రాంతాలలో అందించారు. ఇవి ద్విచక్ర వాహనానికి సెక్యూరిటీ గార్డుగా వ్యవహరిస్తాయి. వీటితో పాటు, టూ-పీస్ సీటు, విశాలమైన ఫ్లోర్-బోర్డ్, ఆఫ్-రోడ్ సామర్థ్యం గల టైర్లు వంటి అనేక ఫీచర్లను ఇందులో పొందుపరిచారు.

ఇక ఈ సరికొత్త ఎలక్ట్రిక్‌ స్కూటర్‌లో వెనుకవైపు లగేజీని తీసుకెళ్లేందుకు బూట్‌ స్పేస్‌ను కూడా ఇచ్చారు. ఇది భారత్ మార్కెట్లోకి అందుబాటులోకి వచ్చినట్లయితే.. హీరో ఎలక్ట్రిక్ యొక్క నైక్ మోడల్‌కు గట్టి పోటీనిస్తుంది. కాగా ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌లో కంపెనీ 7 కిలోవాట్ల ఎలక్ట్రిక్ మోటార్‌ను ఉపయోగించారు.

ఇక బ్యాటరీ విషయానికొస్తే ఈ అడ్వెంచర్‌ ఎలక్ట్రిక్ స్కూటర్‌లో డ్యూయల్ బ్యాటరీ ప్యాక్ సెటప్‌తో వస్తుంది. ఒక్కొక్కటి 1.6 kWh సామర్థ్యం కలిగి ఉంటుంది. రెండూ పూర్తిగా ఛార్జ్ చేయబడితే 100 కి.మీ కంటే ఎక్కువ రేంజ్‌ను ఇస్తుంది. డెలివరీ సర్వీస్ సెగ్మెంట్‌లో ఇది బాగా దోహదపడుతుందని కంపెనీ భావిస్తోంది.

ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌లో లగేజీని తీసుకెళ్లేందుకు అతిపెద్ద బూట్‌ స్పేస్ సదుపాయం ఉండటంతో ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ మంచి కార్గో క్యారియర్‌గా కూడా ఉపయోగించుకోవచ్చని కంపెనీ చెబుతోంది. అంటే ఇది బజాజ్ M80 మరియు TVS XL లకు గట్టి పోటీ అనే చెప్పవచ్చు.

కాగా గొగొరో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ ధర గురించి ఇంకా ఎటువంటి సమాచారం అందుబాటులో లేదు. ఈ నెల 12న లాంచ్‌ రోజు మిగిలిన విషయాలు వెల్లడి కావచ్చు. భారత మార్కెట్లో ఓలా మరియు ఈథర్ వంటి కంపెనీలు ఇప్పటికే ఎలక్ట్రిక్ టూ-వీలర్ సెగ్మెంట్‌లో దూసుకుపోతున్నాయి. ఇలాంటి సమయంలో అంతర్జాతీయ కంపెనీ భారత మార్కెట్లోకి అడుగుపెట్టబోతోంది.

More from DriveSpark

Article Published On: Friday, December 8, 2023, 9:30 [IST]
English summary
Taiwans gogoro electric scooter will launch on december 12th in india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+