కాలేజీ విద్యార్థుల కోసం టాప్‌-5 125cc స్కూటర్లు.. ఈ సెగ్మెంట్‌లో బెస్ట్‌..!

భారత్‌లో ప్రస్తుతం స్కూటర్‌లను కొనుగోలు చేసేందుకు ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తున్నారు. అద్భుతమైన డిజైన్‌, సహా ఇతర కారణాలతో వీటిని కొనుగోలు చేస్తున్నారు. ఎలక్ట్రిక్‌ వాహనాలు వచ్చాక స్కూటర్‌లకు డిమాండ్‌ మరింత ఎక్కువైంది. అధిక శాతం మంది యువత, కాలేజీ విద్యార్థులు స్కూటర్‌లను కొనుగోలు చేస్తున్నారు.

ఒకప్పుడు సీనియర్‌ సిటిజన్లు మాత్రమే స్కూటర్లు డ్రైవింగ్‌ చేసేవారు. అనంతర కాలంలో ఎలక్ట్రిక్‌ వాహనాల అద్భుతమైన డిజైన్‌, అందుబాటు ధర సహా ఇతర కారణాలతో యువత కూడా వీటిని డ్రైవ్ చేసేందుకు ఇష్టపడుతున్నారు. గతంలో ఈ సెగ్మెంట్‌లో హోండా సంస్థ అధిక సంఖ్యలో విక్రయాలను నమోదు చేసేది. అయితే కాలేజీ విద్యార్థులకు నచ్చే, మెచ్చే టాప్‌ 5 125cc స్కూటర్ల గురించి ప్రత్యేక కథనం.

Top 5 scooters for college students

TVS NTORQ 125 స్కూటర్‌.. యువత ఎక్కువ కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపించే వాహనాల్లో ఒకటి. స్పోర్టీ లుక్‌, మెరుగైన ఫీచర్లు ఇందుకు కారణం. టీవీఎస్‌ Ntorq.. 124.8cc సింగిల్‌ సిలిండర్‌, RT-Fiతో కూడిన ఎయిర్ కూల్డ్‌ ఇంజిన్‌ను కలిగి ఉంటుంది. ఈ ఇంజిన్‌ 9.2bhp శక్తి, 10.5Nm గరిష్ఠ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ స్కూటర్‌ ధర రూ.84,536 నుంచి రూ.1.04 లక్షల (ఎక్స్‌షోరూం) వరకు ఉంటుంది.

Top 5 scooters for college students

Honda Dio 125 స్కూటర్‌.. భారత్‌లో అత్యధిక విక్రయాలు నమోదు చేసింది. ఇటీవలే అప్‌గ్రేడ్‌తో మరోసారి విడుదల అయింది. హోండా డియో 125 స్కూటర్‌ 123.97సీసీ సింగిల్‌ సిలిండర్‌ ఎయిర్‌ కూల్డ్‌ ఫ్యూయల్‌ ఇంజెక్టడ్‌ ఇంజిన్‌ను కలిగి ఉంది. ఈ ఇంజిన్‌ 8.19bhp శక్తి, 10.4Nm గరిష్ఠ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ప్రస్తుతం ఈ స్కూటర్‌ ధర రూ.83,400 నుంచి రూ.91,300 (ఎక్స్‌షోరూం) వరకు ఉంటుంది.

Top 5 scooters for college students

సుజుకి యాక్సెస్‌ 125.. కాలేజీ విద్యార్థులకు ఈ స్కూటర్‌ మంచి ఎంపిక కానుంది. స్టైలిష్‌ డిజైన్‌, మంచి మైలేజీని కలిగి ఉంటుంది. ఈ స్కూటర్‌ 124సీసీ సింగిల్‌ సిలిండర్‌ ఎయిర్‌కూల్డ్‌ ఫ్యూయల్‌ ఇంజెక్టడ్‌ ఇంజిన్‌తో వస్తుంది. ఈ ఇంజిన్ 8.5bhp శక్తి, 10Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ప్రస్తుత ధర రూ.79,400 నుంచి రూ.89,500కు కొనుగోలు చేయవచ్చు.

Top 5 scooters for college students

వెస్పా 125 స్కూటర్‌ .. ఈ స్కూటర్‌ VXL మరియు SXL రెండు వేరియంట్లతో వస్తుంది. వెస్పా 125 స్కూటర్‌ 124.45సీసీ సింగిల్‌ సిలిండర్‌ ఎయిర్ కూల్డ్‌ ఫ్యూయల్‌ ఇంజెక్టడ్‌ ఇంజిన్‌ను కలిగి ఉంటుంది. 9.8bhp శక్తి, 9.6Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ స్కూటర్‌ ధర రూ.1.32 లక్షల నుంచి 1.37 లక్షల మధ్య కొనుగోలుకు అందుబాటులోకి వస్తుంది.

Top 5 scooters for college students

యమహా ఫాసినో 125 స్కూటర్‌.. డిజైన్‌, లుక్ పరంగా ఈ స్కూటర్‌ను యువతులు ఎక్కువగా ఇష్టపడతారు. ప్రస్తుతం భారత్‌లో అందుబాటులో ఉన్న తేలికైన స్కూటర్‌లలో ఇది ఒకటి. సింగిల్‌ సిలిండర్‌ ఎయిర్‌ కూల్డ్ ఇంజిన్‌ను కలిగి ఉంటుంది. 8.04bhp శక్తి, 10.3Nm టార్క్‌ను ఉత్పత్తి చేసే స్మా్ర్ట్‌ మోటార్‌ జెనరేటర్‌ సిస్టమ్‌ను కలిగి ఉంటుంది. ప్రస్తుతం ఈ స్కూటర్‌ రూ.79,100 నుంచి రూ.92,830 ధరకు అందుబాటులో ఉంది.

More from DriveSpark

Article Published On: Saturday, July 22, 2023, 13:06 [IST]
English summary
Top 5 125cc engine scooters for college students in india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+