తక్కువ ధరలో బెస్ట్‌ స్కూటర్‌ కొనాలనుకుంటున్నారా.. అయితే ఈ టాప్‌ 5 స్కూటర్లపై ఓ లుక్కేయండి..

ప్రస్తుతం దేశీయ మార్కెట్లో పండుగ సీజన్‌ నడుస్తోంది. మరో రెండు నెలల్లో 2023 సంవత్సరం ముగియనుంది. కస్టమర్లు కొత్త టూ వీలర్లను కొనుగోలు చేయడానికి ఇదే సరైన సమయం. ఈ నేపథ్యంలో దీపావళి సందర్భంగా మీ బడ్జెట్‌ ధరలో టాప్‌ 5 స్పోర్టీ స్కూటర్లు వివరాలు ఇక్కడ అందిస్తున్నాం.

TVS Ntorq 125: టూ వీలర్‌ మార్కెట్లో 125cc స్కూటర్‌ విభాగంలో TVS Ntorq 125 మంచి సేల్స్‌తో దూసుకుపోతుంది. మెరుగైన పనితీరు, అద్భుతమైన ఫీచర్లతో టీవీఎస్‌ దీనిని ప్రవేశపెట్టింది. Ntorq 125.. 124.8cc, మూడు-వాల్వ్, ఎయిర్-కూల్డ్ మోటారు ఆధారంగా పనిచేస్తుంది. ఇది 7,000rpm వద్ద 9.25bhpని, 5,500rpm వద్ద 10Nm గరిష్ఠ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

TVS-Ntorq-125

TVS Ntorq 125 ఇంజిన్ విషయానికొస్తే ఇది CVT యూనిట్‌తో జత చేయబడి ఉంటుంది. కాగా దేశీయ మార్కెట్లో ఈ స్కూటర్ ప్రారంభ ధర రూ. 84,636 (ఎక్స్-షోరూమ్)గా ఉంది. ఈ మోడల్‌లో టాప్-స్పెక్ XT ట్రిమ్ వేరియంట్‌ ధర రూ. 1.05 లక్షలు (ఎక్స్-షోరూమ్) ధర పలుకుతోంది.

Suzuki Avenis 125: పండుగ సందర్భంగా స్కూటర్‌ కొనుగోలు చేయాలనుకునే కస్టమర్లకు మరో మంచి ఆప్షన్‌.. సుజుకి అవెనిస్ 125. ఈ స్కూటర్‌ డిజైన్ పరంగా TVS Ntorq 125ని పోలి ఉంటుంది. ఇందులో అదే 124.3cc, ఎయిర్-కూల్డ్ ఇంజిన్‌ను ఉపయోగించారు.

Suzuki-Avenis-125

సుజుకి అవెనిస్‌ 125 స్కూటర్‌ మోటారు పనితీరు విషయానికొస్తే.. 6,750rpm వద్ద 8.58bhp, 5,500rpm వద్ద 10Nm గరిష్ఠ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ స్కూటర్‌ను కొనుగోలు చేయాలనుకునే కస్టమర్లకు మూడు వేరియంట్లలో అందుబాటులో ఉంది. మార్కెట్లో దీని ధర రూ. 89,900 నుండి రూ. 92,300 (ఎక్స్-షోరూమ్)గా ఉంది.

Honda Grazia 125: హోండా గ్రాజియా 125 స్కూటర్‌.. హోండా యాక్టివా డిజైన్‌కు భిన్నంగా ఉంటుందనే చెప్పవచ్చు. గ్రాజియా 125 దాని స్టైలిష్‌ లుక్‌తో కస్టమర్లను ఆకర్షిస్తుంది. ఇక ఇంజిన్‌ విషయానికొస్తే.. ఇది 6,000rpm వద్ద 8.14bhp, 5,00rpm వద్ద 10.3Nm గరిష్ఠ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

Honda-Grazia-125

హోండా గ్రాజియా 125 స్కూటర్‌.. 124cc ఇంజిన్ ద్వారా శక్తిని పొందుతుంది. ఈ స్కూటర్‌ మోటార్ CVTతో జత చేయబడింది. కాగా గ్రాజియా 125 స్కూటర్‌ దేశీయ మార్కెట్లో అత్యంత సరసమైన ధరలో లభించే 125cc స్పోర్ట్స్ స్కూటర్. దీని ధర రూ. 82,520 (ఎక్స్-షోరూమ్)గా ఉంది.

Yamaha Ray ZR 125: దేశీయ మార్కెట్లో తేలికపాటి-హైబ్రిడ్ పవర్‌ట్రెయిన్‌ను కలిగి ఉన్న ఏకైక స్పోర్టీ 125cc స్కూటర్ యమహా రే ZR 125. ఇది 125cc ఎయిర్‌కూల్డ్‌ మోటార్‌తో పనిచేస్తుంది. 6,500rpm వద్ద 8.04bhp, 5,000rpm వద్ద 10.3Nm గరిష్ఠ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

Top-5-125CC-Scooters

ఈ స్కూటర్‌లో సైలెంట్ స్టార్ట్ సిస్టమ్, ఆటో స్టార్ట్/స్టాప్ ఫంక్షన్ లాంటి ఫీచర్లను కలిగి ఉండటం ద్వారా మైలేజ్‌ ఎక్కువ ఇస్తుంది. యమహా రే ZR 125 బేస్‌ ట్రిమ్‌ వేరియంట్‌ ధర రూ. 84,730 (ఎక్స్-షోరూమ్) కాగా.. టాప్‌ స్పెక్‌ స్ట్రీట్‌ ర్యాలీ వెర్షన్ ధర 95,830 (ఎక్స్-షోరూమ్) గా ఉంది.

Aprilia SR 125: అప్రిలియా SR 125 స్పోర్ట్స్‌ స్కూటర్‌.. చాలా తక్కువ మార్జిన్‌తో ఉన్నప్పటికీ, ఇది చాలా శక్తివంతమైనదనే చెప్పవచ్చు. ఈ స్కూటర్‌ ఒకే వేరియంట్‌లో అందుబాటులో ఉంది. ఎక్స్‌ షోరూమ్‌ ప్రకారం దీని ధర రూ. 1.23 లక్షలు.

Aprilia-SR-125

అప్రిలియా SR 125 స్కూటర్‌ ఇంజిన్‌ విషయానికొస్తే 124.45cc ఎయిర్‌ కూల్డ్‌ మోటార్‌ ద్వారా పనిచేస్తుంది. 7,300rpm వద్ద 9.97bhp, 5,500rpm వద్ద 10.33Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది అద్భుతమైన హ్యాండ్లింగ్ ప్యాకేజీతో పాటు దీని ఇంజిన్ మెరుగైన పనితీరును అందిస్తుంది.

More from DriveSpark

Article Published On: Sunday, October 29, 2023, 7:45 [IST]
English summary
Top 5 125cc sporty scooters in budget price to buy this diwali festive season
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+