జూన్‌లో అత్యధికంగా అమ్ముడైన టాప్ 5 బైక్స్ ఇవే.. మార్కెట్‌లో ఈ బైక్‌దే ఆధిపత్యం..
కరోనా మహమ్మారి తర్వాత భారతీయ ఆటో మొబైల్ రంగం స్థిరమైన వృద్ధిని సాధిస్తోంది. ముఖ్యంగా ద్విచక్ర వాహన రంగంలో పెరిగిన మోటార్‌సైకిళ్ల అమ్మకాల ద్వారా వాహన తయారీ కంపెనీలు మంచి వృద్ధిని సాధించాయి. ఈ నేపథ్యంలో జూన్ నెలలో టాప్ 5 ద్వి =చక్ర వాహనాల అమ్మకాల జాబితాను ఈ కథనంలో పరిశీలిద్దాం.
హీరో మోటోకార్ప్ ప్రస్తుతం భారత మార్కెట్‌లో అతిపెద్ద మోటార్ సైకిల్ తయారీదారుగా ఉంది. టాప్ 5 బెస్ట్ సెల్లింగ్ మోటార్ సైకిళ్ల జాబితాలో మూడు మోటార్ సైకిళ్లు హీరో మోటోకార్ప్‌కు చెందినవే. మోడల్ వారీగా అమ్మకాల బ్రేకప్‌లో హీరో మోటో కార్ప్ ఆధిపత్యం ప్రదర్శిస్తోంది. ఇక్కడ టాప్ 5 కంపెనీలు, మోడళ్ల వివరాలు మీ కోసం.

హీరో స్ప్లెండర్: ఈ ఏడాది జూన్‌లో హీరో మోటోకార్ప్ 2,38,340 యూనిట్ల స్ప్లెండర్(Hero Splendor) బైక్‌లను విక్రయించింది. ఈ అమ్మకాలు అదే నెలలో కంపెనీ మొత్తం విక్రయించిన అమ్మకాలలో సగానికి పైగా ఉంది. జూన్‌లో విక్రయాల సంఖ్య ఎక్కువగా ఉన్నా.. గతేడాది జూన్ నెలతో పరిశీలిస్తే దాదాపు 12 శాతం క్షీణించింది.

హోండా షైన్: హోండా కంపెనీకి చెందిన షైన్(Honda Shine) ఈ ఏడాది జూన్‌లో మంచి అమ్మకాలను సాధించింది. భారతీయ మార్కెట్‌లో 1,31,920 యూనిట్లను విక్రయించి టాప్ 2 లో నిలిచింది. గతేడాది ఇదే నెలతో పోలిస్తే 4.74 శాతం వృద్ధిని నమోదు చేసినట్లు గణాంకాలు వెల్లడించాయి.

బజాజ్ పల్సర్: వినియోగదారుల్లో మంచి ఆదరణ పొందిన బజాజ్ పల్సర్(Bajaj Pulsar) ఫేవరెట్ మోడల్‌గా కొనసాగుతోంది. ఈ ఏడాది జూన్‌లో 1,07,208 యూనిట్లను కంపెనీ విక్రయించింది. గతేడాది జూన్ నెలతో పరిశీలిస్తే 28 శాతం కంటే ఎక్కువ అమ్మకాల వృద్ధిని నమోదు చేసింది.

హీరో HF డీలక్స్: హీరో HF డీలక్స్(Hero HF Delux) ఈ ఏడాది జూన్‌లో భారతదేశంలో అత్యధికంగా అమ్మకాలను సాధించిన నాల్గవ మోటార్‌సైకిల్. దేశవ్యాప్తంగా 89,275 యూనిట్లను కంపెనీ విక్రయించింది. అయితే గతేడాది జూన్ గణాంకాలతో పోలిస్తే అమ్మకాలు 21 శాతం పడిపోయాయి.
హీరో ప్యాషన్: హీరో మోటోకార్ప్ ఇటీవల ప్యాషన్ బైక్(Hero Passion) మోడల్‌ను పునరుద్ధరించింది. దీంతో ఈ కంపెనీ జూన్ నెలలో 47,554 ప్యాషన్ యూనిట్లను విక్రయించింది. గతేడాది జూన్‌లో ఈ బైక్ విక్రయాలు చాలా తక్కువగా ఉన్నాయి. దాదాపు 156 శాతం వృద్ధిని సాధించింది.

ఈ టాప్ 5 మోటార్‌సైకిళ్ల జాబితాను పరిశీలిస్తే, భారతీయ ద్విచక్ర వాహన పరిశ్రమలో హీరో మోటోకార్ప్ ఆధిపత్యానికి ప్రధాన కారణం హీరో స్ప్లెండర్ అని స్పష్టమవుతోంది. మధ్యతరగతి ప్రజలకు అందుబాటు ధరలో ఉండటమే ఈ బైక్ అధిక విక్రయాలను సొంతం చేసుకుందనడానికి నిదర్శనం.
డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్ కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








