ఈ స్కూటీలలో బోలెడంత స్పేస్.. చిన్నపాటి ట్రిప్ ట్రై చేయొచ్చు

స్కూటీలు కొనేముందు ముందుగా దాని డిజైన్, మైలేజ్ లేదా రేంజ్ చూస్తారు. కంపెనీలు అందించే ఇతర ఫీచర్లతో పాటు ఆ తర్వాత గుర్తుకు వచ్చేది బూట్ స్పేస్(సీటు కింది భాగం). మోటార్‌ సైకిళ్ల కంటే స్కూటర్‌ లను చాలామంది ఎక్కువగా ఇష్టపడటానికి బూట్ స్పేస్ ఒక ముఖ్య కారణమని చెప్పవచ్చు. కంఫర్ట్ కోసం ఎక్కువ మంది స్కూటీలకే జై కొడతారు. అయితే మార్కెట్ లో ప్రస్తుతం అత్యధిక బూట్ స్పేస్ ను అందిస్తున్న టాప్ 5 స్కూటర్లు ఇప్పుడు మీకోసం.

రివర్ ఇండీ

రివర్ ఇండీ..

ఎక్కడికైనా వెళ్లేప్పుడు ఇతర వస్తువులను సులభంగా క్యారీ చేసేందుకు స్కూటర్లు అనుకూలంగా ఉంటాయి. ఈ జాబితాలో తొలి స్థానంలో రివర్ సంస్థకు చెందిన ఇండీ EV స్కూటర్ తొలి స్థానంలో నిలిచింది. అతిపెద్ద 43-లీటర్ల బూట్ స్పేస్ ను అందిస్తున్న స్కూటీగా రివర్ ఇండీ దేశంలోనే తొలి స్థానంలో ఉంది.

రివర్ ఇండీ స్పేస్

భారీ అండర్‌ సీట్ స్టోరేజ్ స్పేస్ అందిస్తున్న ఈ స్కూటర్ ను కొద్దిరోజుల క్రితమే సంస్థ విడుదల చేసింది. దీని ధర రూ.1.25 లక్షలుగా (ఎక్స్-షోరూమ్, బెంగళూరు) ఉంది. ఆకర్షణీయమైన స్టైలింగ్ లుక్ తో ఈ స్కూటర్ ను రివర్ తయారు చేసింది.

ఓలా ఎస్ 1 ప్రో

Ola S1, S1 ప్రో స్కూటర్లు..

ఇండీ స్కూటర్ లా పెద్ద స్పేస్ లేనప్పటికీ, Ola S1, S1 ప్రో స్కూటర్లు లు భారీ స్పేస్ ను అందిస్తుంది. 36 లీటర్ల బూట్ స్పేస్ ను ఈ స్కూటర్ లల్లో పొందవచ్చు. దీర్ఘచతురస్రాకార ఆకారంలో ఈ స్కూటర్ల బూట్‌ స్పేస్ ను ఉంది. ఎలాంటి వస్తువునైనా సులువుగా ప్యాకింగ్ చేసి అమర్చుకునేందుకు వీలుంటుంది. ఈ స్కూటర్ ధర S1 ధర రూ.1.10 లక్షలు కాగా, S1 ప్రో ధర 1.30 లక్షలు (ఎక్స్-షోరూమ్, బెంగళూరు)గా ఉంది.

ఓలా s1 ఎయిర్

ఓలా s1ఎయిర్..

ఎలక్ట్రిక్ బైక్స్ లో ఓలా క్రమంగా విస్తరిస్తోంది. అతి తక్కువ ధరలో కస్టమర్లకు EVలను సంస్థ అందిస్తోంది. ఈ స్కూటర్ అదించే వాహనాల్లో బేస్ మోడల్ S1 ఎయిర్‌ ను ప్రారంభించింది, దీని ధర రూ. 84999 (ఎక్స్-షోరూమ్, బెంగళూరు)తో ప్రారంభమవుతుంది. S1, S1 ప్రో కంటే కొంచెం తక్కువగా 34 లీటర్లను ఇది అందిస్తోంది. బేస్ ధరలోని వాహనాల్లో ఎక్కవ నిల్వ స్థలం అందిస్తున్న స్కూటర్ గా ఓలా S1 ఎయిర్ నిలిచింది.

జూపిటర్

టీవీఎస్ జూపిటర్..

పెట్రోల్-ఆధారిత స్కూటర్లలో ఎక్కవ స్పేస్ ను అందిస్తున్న ఏకైక స్కూటర్ గా టీవీఎస్ జూపిటర్ నిలిచింది. ఫ్యూయల్ ట్యాంక్‌ ను సీటు కింద కాకుండా ఫ్లోర్‌ బోర్డ్‌ కు మార్చడం ద్వారా TVS జూపిటర్ 125లో ఖాళీ స్థలం ఎక్కవగా ఉంది. ఈ స్కూటర్ లో అధింకగా 33 లీటర్ల బూట్ స్పేస్ ఉంటుంది. రెండు చిన్న ఫుల్-ఫేస్ హెల్మెట్‌ లను పొందుపరచేంత పొడవు, వెడల్పు, లోతుగా ఉండే కావెర్నస్ ఉంటుంది.

జూపిటర్

జూపిటర్ 125సీసీ ధరలు రూ.85525 నుంచి ప్రారంభమవుతాయి. డిస్క్ బ్రేక్ వెర్షన్‌ ధర రూ. 92375 (ఎక్స్-షోరూమ్, బెంగళూరు)గా ఉంది. స్పేస్ అధిక ప్రాధాన్యతను ఇస్తూ జాదా జాదా (ఎక్కువ ఎక్కువ) మోటోతో ఈ స్కూటర్ ను సంస్థ పరిచయం చేసింది. అందుల్లే ఈ బైక్ అత్యధిక సేల్స్ ని సాధించినట్లు నిపుణులు తెలిపారు.
హీరో విడా

హీరో విడా V1..

తర్వాతి స్థానంలో హీరో విడా V1 ఎలక్ట్రిక్ స్కూటర్ నిలించింది. అయితే ఇది అత్యంత ఖరీదైన స్కూటర్. దీని ధర ప్లస్ వెర్షన్ రూ.1.45 లక్షలు, ప్రో వేరియంట్ (ఎక్స్-షోరూమ్, బెంగళూరు) రూ. 1.59 లక్షలుగా ఉంది. హీరో మోటోకార్ప్ ఇంత స్పేస్ దేనిలోనూ లేదు ఈ కంపెనీ మోడళ్లలో అధిక స్పేస్ 26 లీటర్లు అందిస్తున్న ఏకైక ఎలక్ట్రిక్ స్కూటర్. TVS iQube ST, సింపుల్ వన్ స్కూటర్లు కూడా 33-లీటర్ బూట్‌ లను కలిగి ఉన్నప్పటికీ ప్రస్తుతం అత్యధికంగా అందుబాటులో ఉన్న స్కూటర్‌ లను పరిగణలోకి తీసుకుని ఈ కథనాన్ని రూపొందించాము.


More from DriveSpark

Article Published On: Saturday, March 4, 2023, 12:20 [IST]
English summary
Top 5 scooters with largest boot space in india and its price
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+