Harley Davidson X440 బైక్ గురించి తెలుసుకోవాల్సిన 5 ముఖ్యమైన విషయాలు..!
హార్లీ డేవిడ్‌సన్ X440 బైక్ ఎట్టకేలకు భారత్‌లో విడుదల అయింది. ఈ బైక్ ఎప్పుడో విడుదల కావాల్సి ఉన్నా.. వివిధ కారణాలతో లాంచ్ ఆలస్యం అయింది. ఈ బైక్ అధునాతన ఫీచర్లు, డిజైన్‌ను కలిగి ఉంది. అయితే హార్లీ డేవిడ్‌సన్ X440 బైక్ గురించి తెలుసుకోవాల్సిన ఐదు ముఖ్యమైన అంశాలు మీకోసం.
హార్లీ డేవిడ్‌సన్ X440 మోటార్‌సైకిల్ మూడు వేరియంట్లలో అందుబాటులోకి ఉండనుంది. డెనిమ్, వివిడ్ మరియు ఎస్. ఇందులో డెనిమ్ బేస్ వేరియంట్ కాగా.. ఎస్ అనేది టాప్ ఎండ్ వేరియంట్. ఈ బైక్ ప్రారంభ ధర రూ.2.29 లక్షలు (ఎక్స్‌షోరూం). మిడ్ లెవల్ వేరియంట్ వివిడ్ ధర రూ.2.49 లక్షలు (ఎక్స్‌షోరూం). మరియు హై ఎండ్ మోడల్ ధర రూ.2.69 (ఎక్స్‌షోరూం)గా ఉంటుంది.

హార్లీ డేవిడ్‌సన్ X440 బైక్ పొడవైన ఇంధన ట్యాంక్ మరియు పాలిష్ చేయబడిన వెనుక భాగం మంచి ఆకర్షణీయంగా ఉంటుంది. హెడ్‌లైట్లు, టర్న్ ఇండికేటర్లు, ఎల్‌ఈడీ టెయిల్ ల్యాంప్స్ వంటివి వృత్తాకారంలో ఉంటాయి. ఇవి మోటార్ సైకిల్‌ను మరింత స్టైలిష్‌గా ఉంచుతున్నాయి.
హార్లీ డేవిడ్‌సన్ X440 మోటార్‌సైకిల్ నాలుగు రంగుల్లో అందుబాటులో ఉంటుంది. మస్టర్డ్ డెనిమ్, మెటాలిక్ డార్క్ సిల్వర్, మెటాలిక్ థిక్ సిల్వర్, మ్యాటీ బ్లాక్ రంగుల్లో లభ్యం కానుంది. అయితే మస్టర్డ్ డెనిమ్, మ్యాటీ బ్లాక్ రంగులు కేవలం డెనిమ్, ఎస్ వేరియంట్లు మాత్రమే కలిగి ఉంటాయి.

ఈ మోటార్ సైకిల్ సింగిల్ సిలెండర్ ఆయిల్ కూల్డ్ ఇంజిన్‌ను కలిగి ఉంటుంది. 6000rpm వద్ద 27bhp శక్తి మరియు 4000rpm వద్ద 38Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. మరియు ఈ హార్లీ డేవిడ్‌సన్ X440 బైక్ 6 స్పీడ్ గేర్‌బాక్స్‌ను కలిగి ఉంటుంది.

అయితే ఈ బైక్ హార్డ్‌వేర్ వివరాలు పూర్తి స్థాయిలో ఇంకా వెల్లడి కాలేదు. అయితే X440 మోటార్‌సైకిల్ ముందువైపు డ్యూయల్ క్యాట్రిజ్ డ్యాంపింగ్ సిస్టమ్‌తో 43mm USD ఫోర్క్‌లను కలిగి ఉంటుంది. వెనుకవైపు ట్విన్ గ్యాస్ షాక్ అబ్జార్బర్లను కలిగి ఉంటుంది.
హార్లీ డేవిడ్‌సన్ X440 బైక్ ముందు, వెనుక వైపు డిస్క్ బ్రేక్‌లను కలిగి ఉంటుంది. ముందువైపు 320మిమీ మరియు వెనుక వైపు వివరాలు వెల్లడి కావాల్సి ఉంది. దీంతోపాటు ఈ బైక్ డ్యూయల్ ఛానల్ ABS (యాంటీ బ్రేకింగ్ సిస్టమ్)ను కలిగి ఉంటుంది.

ఈ బైక్ ఆల్ ఎల్‌ఈడీ లైట్లు, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, ఆంబియంట్ లైట్ సెన్సార్, బ్లూటూత్ కనెక్టివిటీ సహా మరెన్నో ఫీచర్లను కలిగి ఉంటుంది. టర్న్ బై టర్న్ నేవిగేషన్, కాల్ ఆన్సర్, మ్యూజిక్ కంట్రోల్, డిస్టెన్స్ టు ఎంప్టీ మరియు గేర్ పొజిషన్‌ను కలిగి ఉంటుంది.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








