ధర రూ.లక్షలోపు ఈ సంవత్సరం లాంచ్ కానున్న టాప్ ఎలక్ట్రిక్ స్కూటర్లు
మీరు ఇప్పటివరకు వినియోగిస్తున్న బైక్‌ను గ్యారేజీకి పంపేసి, ఎలక్ట్రిక్ వాహనాలను వినియోగించాలని నిర్ణయించుకున్నారా.. అద్బుతమైన డిజైన్, లక్ష రూపాయలు మీ బడ్జెట్ అయితే.. ఈ కింది ఎలక్ట్రిక్ బైక్‌ల వివరాలు మీకోసం.
ఇటీవల కాలంలో భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాలను వినియోగించుకొనే వారి సంఖ్య భారీగా పెరిగింది. తక్కువ నిర్వహణ ఖర్చులు, ఎన్విరాన్‌మెంట్‌ల్ ఫ్రెండీ కారణంగా ఎలక్ట్రిక్ వాహనాలను వినియోగించేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఈ డిమాండ్‌ను తమకు అనుకూలంగా మార్చుకొనేందుకు అనేక ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థలు అధిక పెట్టుబడులు పెడుతున్నాయి.

ఓలా S1 ఎయిర్ : మీరు మంచి నాణ్యమైన ఎలక్ట్రిక్ స్కూటర్‌కోసం వెతుకుతున్నట్లైతే ప్రముఖ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ ఓలా నుంచి లాంచ్ Ola S1 air మీకు మంచి ఆప్షన్ అవుతుంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ మీకు అత్యత్తమ ప్రయాణాన్ని ఇవ్వగలదు. ఫలితంగా వాతావరణ కాలుష్యాన్ని తగ్గించగలదు. ఈ వాహనం రేంజ్, ఫీచర్లు మిమ్మల్ని ఆకట్టుకుంటాయి.
ఓలా S1 ఎయిర్ ఫీచర్లు
- రేంజ్ - 85 km/ 125km/ 165km
- అత్యధిక వేగం - స్పోర్ట్ మోడ్‌లో గంటకు 85km
- పీక్ మోటార్ పవర్ - 4.5 kw
- బ్యాటరీ సామర్థ్యం - 2kWh/ 3kWh/ 4kWh
- బరువు - 99KG/103KG/107KG
- బూట్ స్పేస్ - 34 L
- ఛార్జింగ్ సమయం - 4 గంటల 30 నిమిషాలు
- బ్రేకులు- డ్రమ్
- ఫాస్ట్ ఛార్జింగ్- సపోర్ట్ చేస్తుంది
- స్పీడోమీటర్- డిజిటల్
ఓలా S1 ఎయిర్ ప్లాట్ బోర్డ్ డిజైన్, డ్యూయల్ టోన్ బాడీ, మరియు వెనుక ట్విన్ సస్పెన్సన్‌ను కలిగి ఉంటుంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ మొత్తం మూడు వేరియంట్లలో ఐదు రంగుల్లో అందుబాటులో ఉండనుంది. Neo Mint, Porcelain White, Coral Glam, Jet Black, Liquid Silver రంగుల్లో ఉంది. ఈ స్కూటర్‌ను నవంబర్ 2022లో లాంచ్ చేశారు. 2023 జూన్ నుంచి డెలివరీలు ప్రారంభం కానున్నాయి.
85km రేంజ్, 2kWh బ్యాటరీ సామర్థ్యం కలిగిన ఓలా S1 ఎయిర్ స్కూటర్‌ను రూ.84999కే కొనుగోలు చేయవచ్చు. అలాగే 125km రేంజ్, 3kWh బ్యాటరీ సామర్థ్యం కలిగిన స్కూటర్‌ను రూ.1,00,013, మరియు 165km రేంజ్, 4kWh బ్యాటరీ సామర్థ్యం కలిగిన వాహనాన్ని కేవలం రూ. 109985 రూపాయలకు కొనుగోలు చేయవచ్చు.

ఆంపియర్ జీల్ Ex : భారత్‌లో ప్రముఖ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ ఆంపియర్ వెహికల్స్‌కు చెందిన ఆంపియర్ జీల్ Exను లక్ష రూపాయల్లోపు ధరకే కొనుగోలు చేయవచ్చు. ఈ స్కూటర్ మీకు మంచి డ్రైవింగ్ అనుభవాన్ని ఇస్తుంది.
- అత్యధిక వేగం 50-55kmph
- అత్యధిక బరువు మోయగల సామర్థ్యం- 150 Kg
- ఛార్జింగ్ సమయం - 5 గంటలు
- రేంజ్- 120 km
- బ్యాటరీ - 60V, 2.3KWh
- బ్యాటరీ రకం- అత్యాధునిక లిథియం బ్యాటరీ
- ఛార్జర్- 60V,7.5 A Li
- మోటార్ పవర్- 1.8 KW (పీక్ మోటర్ పవర్)
- బ్రేక్- డ్రమ్
- సస్పెన్షన్ - టెలిస్కోపిక్
Ampere Zeal Ex ప్రస్తుతం నీలం, నలుపు రెండు రంగుల్లోనే అందుబాటులో ఉంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ బ్యాటరీకి 3 సంవత్సరాల గ్యారెంటీ ఉంటుంది. మరియు ఒక సంవత్సరం స్కూటర్ వారంటీ ఉంటుంది. అతి తక్కువ ధరలో మంచి ఎలక్ట్రిక్ వాహనంగా ఆంపీయర్ జీల్ ఎక్స్ నిలుస్తుంది. మరియు కేవలం 75000 రూపాయలకే కొనుగోలు చేయవచ్చు. జూన్ 2023 నుంచి ఈ స్కూటర్ అందుబాటులో ఉంటుంది.

LML స్టార్ : లక్ష రూపాయల్లోపు ధరలో మంచి స్కూటర్ కోసం చూస్తుంటే LML స్టార్ మరో మంచి ఎంపిక అవుతుంది. ఈ వాహనం క్లాసిక్ డిజైన్, ధృడమైన నిర్మాణం కలిగి ఉంటుంది. ఈ స్కూటర్ ఈ ఏడాది సెప్టెంబర్‌లో లాంచ్ కానుంది. 150 cc 4- స్ట్రోక్ ఎయిర్ కూల్డ్ ఇంజిన్‌ను కలిగి ఉంటుంది. 7.5 hp మరియు 9.5Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ స్కూటర్ సెల్ఫ్ స్టార్టర్ మరియు కిక్ స్టార్టర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది. లక్ష రూపాయల్లో ఈ స్కూటర్ అందుబాటులో ఉంది.
- ఆటోమేటిక్ హెడ్ ల్యాంప్- ఉన్నాయి
- ముందు బ్రేక్స్- డిస్క్
- వెనుక బ్రేక్స్- డ్రమ్
- వీల్స్ రకం- అల్లాయ్
- టైర్స్- ట్యూబ్ లెస్
- రేంజ్- 100- 125 km

వెస్పా ఎలెట్రికా : Piaggio.. వెస్పా బ్రాండ్ మాతృ సంస్థ. వెస్పా ఎలెట్రికా పేరిట ఎలక్ట్రిక్ స్కూటర్‌ను తయారుచేస్తోంది. ఎలక్ట్రిక్ ఇంజిన్, లిథియం ఐయాన్ బ్యాటరీతో పనిచేస్తుంది. సూపర్ సైలెంట్, ఆధునిక టెక్నాలజీతో ఈ వాహనం సొంతం.
ఈ వెస్పా ఎలట్రికా ఎలక్ట్రిక్ స్కూటర్ 5 వేరియంట్ల ఎలట్రికా 45km/h, ఎలట్రికా 70km/h, ఎలట్రికా రెడ్ 70km/h, ఎలట్రికా రెడ్ 45km/h, ఎలట్రికా రెడ్ 25km/h లో అందుబాటులో ఉంది. వెస్పా ఎలట్రికా 2023 ఆటో ఎక్స్‌పోలో ప్రదర్శనగా ఉంచారు. ఈ ఏప్రిల్ చివరి నుంచి డెలివరీలను ప్రారంభించింది. రూ. 90,000కు ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను సొంతం చేసుకోవచ్చు.
వెస్పా ఎలెట్రికా కొన్ని ముఖ్యమైన ఫీచర్లు
- రేంజ్- 100 km/ ఛార్జి
- మోటర్ పవర్ (w)- 3600
- మోటర్ రకం- DC
- మోటర్ ఛార్జింగ్ సమయం- 3.5 గంటలు
- టార్క్- 200 Nm
- ముందు బ్రేక్- డిస్క్
- వెనుక బ్రేక్- డ్రమ్
హీరో ఎలక్ట్రిక్ AE-8 : ప్రముఖ వాహన తయారీ సంస్థ హీరో ఎలక్ట్రిక్.. హీరో ఎలక్ట్రిక్ AE-8ను తయారుచేస్తోంది. పట్టణ ప్రాంతాల్లో ప్రయాణానికి ఈ వాహనాలు అనుకూలం.
- రేంజ్- 80km/ ఛార్జ్
- ముందు బ్రేక్- డ్రమ్
- వెనుక బ్రేక్- డ్రమ్
- అత్యధిక వేగం- 45kmph
టెలిస్కోపిక్ సస్పెన్షన్ సిస్టమ్, యాంటీ థెప్ట్ అలారం ఈ హీరో ఎలక్ట్రిక్ AE-8 సొంతం. ఈ వాహనాన్ని 2020 ఆటో ఎక్స్‌పోలో ప్రదర్శనకు ఉంచారు. ఈ సంవత్సరం చివరి నాటికి వినియోగదారులకు అందుబాటులో ఉండనుంది. ఈ వాహనం ధర రూ.70,000.

ఎవర్వ్ EF1 : ఎవర్వ్ EF1 ఎలక్ట్రిక్ వాహనం ఆధునిక టెక్నాలజీ సహా స్టైలిష్ లుక్‌తో పర్యావరణహిత పనితీరును కనబరుస్తుంది. ప్రముఖ ఎలక్ట్రిక్ మొబిలిటీ సంస్థ అయిన ఎవర్వ్ టెక్నాలజీస్.. ఎవర్స్ EF1 స్కూటర్‌ను తయారుచేస్తోంది.
- మోటార్- 5.5KW
- పీక్ మోటార్- 8.5 KW
- అత్యధిక వేగం- 90km/h
- బ్యాటరీ రకం- 4.2kwh
- ఛార్జింగ్ సమయం- 5 గంటలు
- ఫాస్ట్ ఛార్జింగ్- 1.5 గంటల్లో 50% ఛార్జింగ్
- లైట్ వెయిట్ హైబ్రిడ్ ట్యూబులర్ ఛాసిస్
- లాంగర్ వీల్‌బేస్
- LED- LED హెడ్‌లైట్ DRL
- రివర్స్ మోడ్- అందుబాటులో ఉంది
- బ్రేక్- డిస్క్
- సస్పెన్షన్- అడ్జెస్టబుల్
ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ మొత్తం 7 వేరియంట్లు గ్రే మెటాలిక్, ఆరెంజ్ మెటాలిక్, Aquamarine, Misano Blue, White, పెరల్ ఆరెంజ్, Matt grey లో అందుబాటులో ఉంది. ఇప్పటివరకు ఉన్న సమాచారం ప్రకారం ఈ మే నెలలోనే విడుదలయ్యే అవకాశం ఉంది. మరియు ధర సుమారు. రూ.90,000.

Lambretta V125.. 1950లో అంతర్జాతీయంగా మంచి పేరు పొందిన లాంబ్రెట్టా స్కూటర్‌ను ప్రేరణ పొందింది. ప్రస్తుత పట్టణ ప్రయాణాలకు ఈ ఎలక్ట్రిక్ వాహనం అనుకూలం. ఈ వాహనం ఈ ఏడాది జూన్‌లో లాంచ్ కానుంది. మరియు కేవలం రూ.90,000కే సొంతం చేసుకోవచ్చు. టెలిస్కోపిక్ సస్పెన్షన్ సిస్టమ్, కంబైన్డ్ బ్రేకింగ్ వ్యవస్థను కలిగి ఉంటుంది. ఈ వాహనం బ్రేక్ ఫోర్స్ ముందు, వెనుక చక్రాలపై సమానంగా ఉంటాయి.
- ఇంజిన్- 124.7 cc
- బ్రేక్- డిస్క్
- పవర్- 10.19 PS
- టార్క్- 9.2 Nm
- టైర్ రకం- ట్యూబ్ లెస్
- ABS- లేదు
ప్రస్తుత టెక్నాలజీకి అనుగుణంగా ఉంటుంది. లాంబ్రెట్టా వాహనం క్రోమ్ అలంకారంతో మెరుగైన డిజైన్‌తో రానుంది. ఎల్‌ఈడీ లైటింగ్, కంప్యూటరైజడ్ ఇనస్ట్రుమెంట్ ప్యానల్, USB పోర్ట్‌తో వస్తుంది.


Click it and Unblock the Notifications








