2023 సంవత్సరంలో విడుదలైన బెస్ట్‌ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు.. వీటి ప్రత్యేకతలు తెలుసా?

భారత్‌ ఆటోమొబైల్‌ మార్కెట్‌లో రోజురోజుకు ఎలక్ట్రిక్‌ వాహనాలకు ప్రాధాన్యత పెరుగుతోంది. 2023 సంవత్సరంలో ఎలక్ర్టిక్‌ ద్విచక్ర వాహనాల ( Electric vehicles) విభాగంలో అనేక ఎలక్ట్రిక్ మోటార్‌ సైకిళ్లు, స్కూటర్లు విడుదల అయ్యాయి. కైనెటిక్‌, టీవీఎస్‌, ఓలా, ఓర్కా, సింపుల్‌ ఎనర్జీ, ఒబెన్‌ సహా అనేక సంస్థలు తమ వాహనాలను మార్కెట్‌లోకి విడుదల అయ్యాయి.

టీవీఎస్‌ X: టీవీఎస్‌ సంస్థ ఈ సంవత్సరం ఆగస్టులో X పేరిట కొత్త ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ TVS X EV) ను విడుదల చేసింది. ఈ ఎలక్ట్రిక్‌ స్కూటర్ ధర రూ.2.50 లక్షలు (ఎక్స్‌షోరూం) గా ఉంది. ఈ ఈవీ భారత్‌లోనే తయారైన ప్రీమియం రేంజ్‌ స్కూటర్‌ గా ఉంది. అయితే ఈ స్కూటర్‌ డెలివరీలు నవంబర్‌లోనే ప్రారంభం కావాల్సి ఉన్నా.. ప్రారంభం కాలేదు. కారణాలపై సంస్థ ప్రకటన చేయలేదు.

tvs x

ఈ స్కూటర్‌ 4.44kWh బ్యాటరీ ప్యాక్‌ మరియు 11kW ఎలక్ట్రిక్‌ మోటార్‌ ద్వారా శక్తిని పొందుతుంది. కేవలం 2.6 సెకన్లలో 0-40 కి.మీ వేగాన్ని అందుకుంటుందని సంస్థ తెలిపింది. ఈ ఈవీ గరిష్ఠ వేగం 105kmph. అయితే ఈ టీవీఎస్‌ X ఎలక్ట్రిక్‌ స్కూటర్ రేంజ్‌పై సంస్థ ఎటువంటి ప్రకటన చేయలేదు.

కైనిటిక్‌ జులు : కైనెటిక్ సంస్థ నుంచి ఈ నెల ప్రారంభంలో జులు ఎలక్ట్రిక్ స్కూటర్ (Kinetic Zulu EV) మార్కెట్‌లోకి విడుదల అయింది. స్టాండర్డ్‌ బ్యాటరీ ప్యాక్‌తో ఈ ఈవీ ప్రారంభ ధర రూ.94990గా (ఎక్స్‌షోరూం) ఉంటుందని సంస్థ వెల్లడించింది. అయితే ఆయిల్‌ కూల్డ్‌ బ్యాటరీ సెటప్‌తో విడుదల చేస్తామని సంస్థ తెలిపింది.

kinetic zulu

ఓలా S1 X : ఓలా ఈ ఆగస్టులో S1 X ను పరిచయం చేసింది. దీని ధర రూ.89999 (ఎక్స్‌షోరూం, ఫేమ్‌-2 సబ్సిడి సహా ) గా ఉంది. ఈ స్కూటర్‌ రెండు బ్యాటరీ ఎంపికలతో వస్తుంది. 2kWh, 3kWh బ్యాటరీ ప్యాక్‌లను కలిగి ఉంటుంది. ఇవి వరుసగా 85km మరియు 90km రేంజ్‌ను అందిస్తాయి. ఈ ఈవీ 4.1 సెకన్లలో 40 కి.మీ వేగాన్ని అందుకుంటుంది.

ఓర్స్కా మాంటిస్‌ : ఓర్స్కా మాంటిస్‌ ఈ సంవత్సరం నవంబర్‌లో కొత్త మాంటిస్‌ ఎలక్ట్రిక్‌ వాహనాన్ని విడుదల చేసింది. దీని ధర రూ.3.60 లక్షలు (ఎక్స్‌షోరూం) ధరను కలిగి ఉంది. ఈ బైక్‌ 8.9kWh బ్యాటరీ ప్యాక్‌ను కలిగి ఉంది. 3.3kW ఫాస్ట్‌ ఛార్జర్‌తో 2,5 గంటల్లో 80 శాతం ఛార్జింగ్‌ చేయగలదని సంస్థ తెలిపింది. సింగిల్‌ ఛార్జింగ్‌తో 221 కి.మీ రేంజ్‌ను కలిగి ఉంది.

simple dot one

సింపుల్‌ డాట్‌ వన్‌ : సింపుల్‌ ఎనర్జీస్‌ సంస్థ ఈ సంవత్సరం డిసెంబర్‌లో కొత్త ఎంట్రీ లెవల్‌ స్కూటర్‌ను విడుదల చేస్తుంది. దీని ధర రూ.1.0 లక్షలుగా (ఎక్స్‌షోరూం) గా ఉంది. ఈ ఈవీ 2.77 సెకన్లలో 40 కి.మీ వేగాన్ని అందుకుంటుంది. ఈ ఈవీ 8.5kW ఎలక్ట్రిక్‌ మోటార్‌ను కలిగి ఉంటుంది. మరియు 105 kmph గరిష్ఠ వేగంతో ప్రయాణం చేస్తుంది.

ఒబెన్‌ రోర్: బెంగళూరుకు చెందిన ఎలక్ట్రిక్ ద్విచక్రవాహనాల తయారీ సంస్థ ఒబెన్‌ నవంబర్‌ నుంచి ఈ వాహనాల ఒబెన్‌ రోర్‌ ఎలక్ట్రిక్‌ బైక్ డెలివరీని ప్రారంభించింది. ఈ ఎలక్ట్రిక్ వాహనం 8.8kW PMS మోటార్‌, 4.4 kWh బ్యాటరీ ప్యాక్‌తో పనిచేస్తుంది. ఈ ఈవీ ధర రూ.1.50 లక్షలుగా (ఎక్స్‌షోరూం)గా ఉంది. సింగిల్ ఛార్జింగ్‌తో 187 కి.మీ రేంజ్ ఇస్తుంది. ఈ బైక్‌ గరిష్ఠ వేగం రూ.100 kmphగా ఉంటుంది.

More from DriveSpark

Article Published On: Thursday, December 21, 2023, 20:10 [IST]
English summary
Top electric two wheelers launched in 2023 in india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+