రూ. 2 లక్షల లోపు బైక్ కొనాలనుకుంటున్నారా.. ఇదిగో టాప్-5 బైక్స్
2023 వ సంవత్సరంలో అడుగుపెట్టేసాము, ఇక సంక్రాంతి పండుగ కూడా రాబోతోంది.. ఈ సందర్భంగా చాలామంది తప్పకుండా బైక్ లేదా కార్ కొనాలనుకుంటారు. అలాంటి వారు రూ. 2 లక్షల లోపు లభించే టాప్ 5 క్రూయిజర్ మోటార్‌సైకిల్స్ గురించి ఈ కథనంలో తెలుసుకోవచ్చు.
బజాజ్ అవెంజర్ క్రూయిజర్ 220:
మన జాబితాలో రూ. 2 లక్షల కంటే తక్కువ ధర వద్ద లభించే బైకులలో చెప్పుకోదగ్గది 'బజాజ్ అవెంజర్ క్రూయిజర్ 220'. ఈ బైక్ ధర రూ. 1.32 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఇది 220 సిసి సింగిల్ సిలిండర్, ఆయిల్ కూల్డ్ ఇంజన్ కలిగి ఉంటుంది. ఇంజిన్ 18.7 బిహెచ్‌పి పవర్ మరియు 17.5 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. డిజైన్ మరియు ఫీచర్స్ పరంగా కూడా ఇది చాలా ఉత్తమంగా ఉంటుంది.

రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350:
దేశీయ మార్కెట్లో ఎక్కువమంది ఇష్టపడే బ్రాండ్ అయిన 'రాయల్ ఎన్‌ఫీల్డ్' యొక్క హంటర్ 350 కూడా మన జాబితాలో చెప్పుకోదగ్గ బైక్. రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350 ప్రారంభ ధరలు రూ. 1.49 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఇది 349 సిసి సింగిల్-సిలిండర్, టూ-వాల్వ్, SOHC, ఎయిర్/ఆయిల్-కూల్డ్ ఇంజన్ పొందుతుంది. ఈ ఇంజిన్ 20.2 బిహెచ్‌పి పవర్ మరియు 27 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది 5-స్పీడ్ గేర్‌బాక్స్ తో జతచేయబడి ఉంటుంది.
రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350 మంచి డిజైన్ కలిగి అధునాతన ఫీచర్స్ పొందుతుంది. ఈ బైక్ ముందు భాగంలో స్పోర్ట్స్ సర్క్యులర్ ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్స్ మరియు టర్న్ సిగ్నల్స్‌తో పాటు రౌండ్ సెమీ-డిజిటల్ స్పీడోమీటర్ కన్సోల్ వంటివి ఉన్నాయి. అయితే ఇందులోని ట్రిప్పర్ డిస్‌ప్లే మాత్రం ఆప్సనల్ గా ఎంచుకోవచ్చు. టియర్‌డ్రాప్ ఆకారంలో ఉండే ఫ్యూయల్ ట్యాంక్‌కు ఇరువైపులా క్రీజ్‌లు ఉన్నాయి కావున చాలా ఆకర్షణీయంగా ఉంటుంది.
యెజ్డీ రోడ్‌స్టర్:
యెజ్డీ కంపెనీ యొక్క రోడ్‌స్టర్ బైక్ కూడా రూ. 2 లక్షల లోపు లభించే ఉత్తమమైన బైక్. ఇది 334 సిసి సింగిల్-సిలిండర్, 4-స్ట్రోక్ లిక్విడ్-కూల్డ్ ఇంజన్‌తో పనిచేస్తుంది. ఇది 29.3 బిహెచ్‌పి పవర్ మరియు 29 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఇది ట్విన్ ఎగ్జాస్ట్ సిస్టమ్ కూడా పొందుతుంది, అదే సమయంలో ఇది 6-స్పీడ్ గేర్‌బాక్స్ కి జతచేయబడి ఉంటుంది. ఈ బైక్ రైడింగ్ చేయడానికి చాలా అనుకూలంగా ఉంటుంది.
బజాజ్ అవెంజర్ 160 స్ట్రీట్:
బజాజ్ ఆటో యొక్క మరో బైక్ ఈ అవెంజర్ 160 స్ట్రీట్. ఈ బైక్ ధర రూ. 1.12 లక్షలు (ఎక్స్-షోరూమ్). బజాజ్ అవెంజర్ 160 స్ట్రీట్ 160 సిసి సింగిల్-సిలిండర్ ఇంజన్ కలిగి ఉంటుంది. ఇంజిన్ 14 బిహెచ్‌పి పవర్ మరియు 13.7 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ బైక్ సౌకర్యవంతమైన రైడింగ్ పొజిషన్‌ను కలిగి ఉండటం వల్ల మంచి రైడింగ్ అనుభూతిని అందిస్తుంది.
కొమాకి రేంజర్:
కొమాకి రేంజర్ అనేది కేవలం రూ. 2 లక్షల లోపు లభించే ఎలక్ట్రిక్ బైక్ మాత్రమే కాదు, అత్యధిక రేంజ్ అందించే బైక్ కూడా. ఈ బైక్ కూడా రూ. 1.74 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఈ బైక్ ఒక సింగిల్ ఛార్జ్ తో గరిష్టంగా 180 కిమీ నుంచి 200 కిమీ రేంజ్ అందిస్తుంది. దీని కోసం కంపెనీ ఇందులో 4kWh బ్యాటరీ ప్యాక్ అమర్చింది. భారతదేశంలోని ఎలక్ట్రిక్ టూ-వీలర్‌లలో అతిపెద్ద బ్యాటరీ ప్యాక్ ఇదే అవుతుంది.
న్యూ ఇయర్ సందర్భంగా మరియు రాబోయే సంక్రాంతి సందర్భంగా రూ. 2 లక్షల ధర లోపు బైక్ కొనాలనుకునే వారికి పైన తెలిపిన బైకులు మంచి ఎంపిక అని మేము భావిస్తున్నాము. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవడానికి మరియు మార్కెట్లో విడుదలయ్యే కొత్త బైకులు మరియు కొత్త కార్లను గురించి తెలుసుకోవడానికి తెలుగు డ్రైవ్‌స్పార్క్ ఛానల్ చూస్తూ ఉండండి. ఎప్పటికప్పుడు మీకు కావలసిన సమాచారం పొందండి.


Click it and Unblock the Notifications








