భారత్‌లో లభించే టాప్ 5 ఎలక్ట్రిక్ స్కూటర్లు - రేంజ్, ధరలు & వివరాలు

భారతీయ మార్కెట్లోకి రోజు రోజుకి కొత్త కొత్త వాహనాలు వర్షాకాలంలో పుట్టుకొస్తున్న పుట్టగొడుగుల మాదిరిగా పుట్టుకొస్తున్నాయి. అయితే కస్టమర్లు మాత్రం తమకు నచ్చిన డిజైన్ మరియు ఫీచర్స్ కలిగి తక్కువ ధరకు లభించే స్కూటర్లను మాత్రమే కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు.

బౌన్స్ ఇన్ఫినిటీ:

బెంగళూరుకు చెందిన ఎలక్ట్రిక్ స్కూటర్ తయారీ సంస్థ 'బౌన్స్' (Bounce) గత సంవత్సరం మార్కెట్లో 'ఇన్ఫినిటీ E1' (Infinity E1) అనే ఎలక్ట్రిక్ స్కూటర్ విడుదల చేసింది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్లో విడుదలైన అతి తక్కువ కాలంలోనే మంచి సంఖ్యలో బుకింగ్స్ పొందగలిగింది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ 'బ్యాటరీతో మరియు బ్యాటరీ లేకుండా' అనే ఆప్సన్స్ తో అందుబాటులోకి తీసుకువచ్చింది. వీటి ధరలు వరుసగా రూ. 68,999 మరియు రూ. 45,099 (ధరలు ఎక్స్-షోరూమ్, ఢిల్లీ).

భారత్‌లో లభించే టాప్ 5 ఎలక్ట్రిక్ స్కూటర్లు

బౌన్స్ ఇన్ఫినిటీ స్కూటర్ ఒక ఫుల్ ఛార్జ్‌పై దాదాపు 85 కిమీ (ఎకో మోడ్‌) పరిధిని అందిస్తుంది. అదే విధంగా పవర్ మోడ్‌లో 65 కిమీల పరిధిని అందిస్తుంది. అంతే కాకుండా ఈ కొత్త స్కూటర్ యొక్క గరిష్ట వేగం గంటాకు 65 కిమీ/గం వరకు ఉంటుంది. ఈ స్కూటర్‌లో 48వి IP67 సర్టిఫైడ్ వాటర్‌ ప్రూఫ్ లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్‌ ఉంటుంది.

టీవీఎస్ ఐక్యూబ్:

దేశీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన ఎలక్ట్రిక్ స్కూటర్లలో ఒకటి టీవీఎస్ కంపెనీ యొక్క ఐక్యూబ్. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ మొత్తం మూడు వేరియంట్స్ లో మరియు 10 కలర్ ఆప్సన్స్ లో లభిస్తుంది. ఐక్యూబ్ యొక్క బేస్ వేరియంట్ మరియు మిడ్ స్పెక్ వేరియంట్ రెండూ కూడా 3.04 kWh బ్యాటరీ ప్యాక్ కలిగి ఉంటాయి. కాగా టాప్ వేరియంట్ మాత్రం 4.56 kWh లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్ పొందుతుంది.

టీవీఎస్ కంపెనీ ఇటీవలే 2023 ఆటో ఎక్స్‌పోలో అప్డేటెడ్ TVS iQube ST ఎలక్ట్రిక్ స్కూటర్ ఆవిష్కరించింది. ఇది టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ (TPMS) మరియు వాయిస్ అసిస్ట్ రూపంలో రెండు కొత్త ఫీచర్‌లను పొందింది. నిజానికి కంపెనీ ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ని గత 2020 సంవత్సరంలోనే ప్రవేశపెట్టింది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ మంచి డిజైన్ కలిగి అధునాతన ఫీచర్స్ పొందుతుంది.

ఓలా ఎస్1:

దేశీయ మార్కెట్లో అడుగుపెట్టిన అతి తక్కువ కాలంలోనే విపరీతమైన ప్రజాదరణ పొందిన ఓలా ఎలక్ట్రిక్ ప్రస్తుతం ఓలా ఎస్1, ఓలా ఎస్1 ప్రో మరియు ఓలా ఎస్1 ఎయిర్ అనే మూడు ఎలక్ట్రిక్ స్కూటర్లను విక్రయిస్తోంది. వీటి ధరలు రూ.99,999, రూ.1.40 లక్షలు మరియు రూ. 84,999 (ఎక్స్-షోరూమ్). ఓలా S1 ఎయిర్, S1 మరియు S1 ప్రో మూడు కూడా చూడటానికి ఒకే విధంగా ఉన్నప్పటికీ ఫీచర్స్ పరంగా వేరుగా ఉంటాయి.

ఓలా 'ఎస్1 ఎయిర్‌' ఎలక్ట్రిక్ స్కూటర్ ఒక ఫుల్ చార్జ్ తో గరిష్టంగా 101 కిలోమీటర్ల పరిధిని అందిస్తుంది. ఇందులో 2.5 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ మరియు 4.5 కిలోవాట్ హబ్-మౌంటెడ్ మోటారు ఉంటుంది. దీని గరిష్ట వేగం గంటకు 90 కిలోమీటర్లవరకు ఉంటుంది. ఇది హోమ్ ఛార్జర్ సాయంతో 0 నుంచి 100 శాతం ఛార్జ్ కావడానికి 4:30 గంటల సమయం పడుతుంది.

ఏథర్ 450ఎక్స్:

ఏథర్ ఎనర్జీ దేశీయ మార్కెట్లో విక్రయిస్తున్న ఎలక్ట్రిక్ స్కూటర్లలో 450ఎక్స్ మరియు 450 ప్లస్ ఉన్నాయి. వీటి ధరలు వరుసగా రూ. 1.58 లక్షలు మరియు రూ. 1.35 లక్షలు (ఎక్స్-షోరూమ్ బెంగళూరు). ఏథర్ 450ఎక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్ లో 6 కిలోవాట్ ఎలక్ట్రిక్ మోటార్‌ మరియు 2.9 కిలోవాట్ అవర్ లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్‌ ఉంటుంది. ఇందులోని ఎలక్ట్రిక్ మోటార్ గరిష్టంగా 8 బిహెచ్‌పి పవర్ ను మరియు 26 ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది.

ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ కేవలం 3.3 సెకన్లలోనే గంటకు 0 నుంచి 40 కిమీ/గం వేగాన్ని చేరుకుంటుంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌ని ఒకసారి పూర్తిగా చార్జ్ చేస్తే గరిష్టంగా 116 కి.మీ పైగా దూరం ప్రయాణించవచ్చని కంపెనీ తెలిపింది. ఈ స్కూర్ టాప్ స్పీడ్ గంటకు 80 కిలోమీటర్లుగా ఉంటుంది. రైడర్ ఎంచుకునే మోడ్‌ని బట్టి ఈ టాప్ స్పీడ్ మరియు రేంజ్ మారుతూ ఉంటుంది.

బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్:

ఇక చివరగా మన జాబితాలో 5 వ ఎలక్ట్రిక్ స్కూటర్ బజాజ్ చేతక్. ఇది ప్రస్తుతం మార్కెట్లో ఎక్కువ అమ్మకాలు పొందుతున్న ఎలక్ట్రిక్ స్కూటర్. ఇది రెట్రో డిజైన్‌ కలిగి ఎల్ఈడి లైట్స్ మరియు డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ వంటి ఫీచర్స్ పొందుతుంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ధర రూ. 1,51,958. ఇది ఒక ఫుల్ ఛార్జ్ తో గరిష్టంగా 85 నుంచి 95 కిమీ రేంజ్ అందిస్తుంది.

Bajaj Chetak ఎలక్ట్రిక్ స్కూటర్ లో 3 కిలోవాట్ IP 67 లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. ఇది ఆన్-బోర్డ్ 3.8 కిలో వాట్ ఎలక్ట్రిక్ మోటార్ కు శక్తినిస్తుంది. ఈ ఎలక్ట్రిక్ మోటార్ గరిష్టంగా 5 బిహెచ్‌పి శక్తిని మరియు 16.2 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ బ్యాటరీ ప్యాక్ ను తొలగించడానికి వీలు లేదు (రిమూవబల్ బ్యాటరీ కాదు).

Most Read Articles

English summary
Top five electric scooters in india telugu details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X