తక్కువ ధరలో హై రేంజ్ అందించే బడ్జెట్ ఎలక్ట్రిక్ స్కూటర్స్..

గత రెండేళ్లుగా దేశీయ ద్విచక్ర వాహన మార్కెట్‌లో ఎలక్ట్రిక్ స్కూటర్ల హవా కొనసాగుతోంది. బడ్జెట్ ధరలో, ఎక్కువ మోడళ్లు, హై రేంజ్, ఆకర్షణీయమైన ఫీచర్ల కారణంగా వినియోగదారులు ఎక్కువగా వీటిని కొనుగోలు చేయడానికి ఆసక్తి కనబరుస్తున్నారు. ప్రముఖ కంపెనీలు విక్రయిస్తున్న ఎలక్ట్రిక్ స్కూటర్ల గురించి మీకు ఈ కథనంలో అందిస్తున్నాం.

సింపుల్ ఎనర్జీ: మొదటగా బెంగుళూరులోని ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ సింపుల్ ఎనర్జీ తయారు చేసిన సింపుల్ వన్ ఇ-స్కూటర్ వినియోగదారుల నుంచి మంచి ఆదరణ పొందింది. ఇది రూ.1.45 లక్షల ఎక్స్-షోరూమ్ ధరతో మే (2023)లో భారత మార్కెట్లో విడుదలైంది. 5 kWh లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్‌ను కలిగి ఉంది. పూర్తి ఛార్జ్‌పై 212 కిమీ రేంజ్‌ను ఇస్తుంది.

Simple-One-E-Scooter

ఇంట్లోనే ఛార్జింగ్ చేసుకునే సదుపాయంతో సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ బ్యాటరీ 0 నుంచి 80 శాతం వరకు ఛార్జ్ చేయడానికి 5 గంటల 54 నిమిషాలు పడుతుంది. ఈ స్కూటర్ కేవలం 2.77 సెకన్లలో 0-40 kmph వేగం అందుకుంటుంది. గరిష్ఠంగా గంటకు 105 కి.మీ వేగంతో ప్రయాణిస్తుంది. డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్, బ్లూటూత్ కనెక్టివిటీ ఇంకా డజన్ల కొద్దీ ఫీచర్లతో వినియోగదారుల ఫేవరెట్‌గా ఉంది.

ఓలా ఎస్1 ప్రో: ప్రముఖ కంపెనీ ఓలా విక్రయిస్తున్న ఎస్1 ప్రో ఎలక్ట్రిక్ స్కూటర్ రూ.1.40 లక్షల ఎక్స్-షోరూమ్ ధరతో కొనుగోలుకు అందుబాటులో ఉంది. ఇందులో, 4 kWh బ్యాటరీ, 8.5 kW మోటార్‌ను అందిస్తుంది. పూర్తి ఛార్జింగ్‌పై 181 కిమీ రేంజ్ ఇస్తుంది. గరిష్ఠంగా గంటకు 115 కి.మీ వేగంతో ప్రయాణిస్తుంది. 2.9 సెకన్లలో 0-40 kmph వేగాన్ని అందుకుంటుంది.

 Ola-S1-Pro

ఓలా S1 ప్రో 7-అంగుళాల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ మరియు నార్మల్, ఎకో, స్పోర్ట్, హైపర్ వంటి రైడింగ్ మోడ్‌లతో సహా ఆకట్టుకునే వినూత్న ఫీచర్లతో వస్తుంది. నియో మింట్, కోరల్ గ్లామ్, జెట్ బ్లాక్, లిక్విడ్ సిల్వర్ వంటి ఆకర్షణీయమైన కలర్స్‌లో అందుబాటులో ఉంది.

విడా V1 ప్లస్: హీరో కంపెనీకి చెందిన ప్రముఖ విడా వి1 ఎలక్ట్రిక్ స్కూటర్ ప్లస్ మరియు ప్రో వేరియంట్‌లలో వరుసగా రూ. 1.45 లక్షలు మరియు రూ. 1.59 లక్షల ఎక్స్-షోరూమ్ ధరలలో అందుబాటులో ఉంది. Vida V1 Plus వేరియంట్ 3.44 kWh కెపాసిటీతో లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్‌తో వస్తుంది. పూర్తి ఛార్జింగ్‌పై 142 కిమీ రేంజ్‌ను అందిస్తుంది.

Hero-Vida

Hero Vida V1 Pro వేరియంట్ 3.94 kWh బ్యాటరీని కలిగి ఉంది, ఇది 165 కిమీ రేంజ్‌ను ఇస్తుంది. ఈ రెండు వేరియంట్లు కేవలం 3.2 సెకన్లలో 0 నుంచి 40 kmph వేగాన్ని అందుకుంటుంది. ఇంకా గంటకు 80 కి.మీ గరిష్ఠ వేగంతో ప్రయాణిస్తుంది. ఈ స్కూటర్ TFT టచ్‌స్క్రీన్, క్రూయిజ్ కంట్రోల్, కీలెస్ కంట్రోల్, స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ వంటి అనేక ఫీచర్లతో వస్తుంది.

Ather-450x

ఏథర్: మరో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన తయారీదారు ఏథర్ 450X ఇ-స్కూటర్‌ను రూ. 1.45 లక్షల నుండి రూ. 1.65 లక్షల ఎక్స్-షోరూమ్ ధరకు కొనుగోలు చేయవచ్చు. ఇందులో 3.7 kWh కెపాసిటీ బ్యాటరీ ప్యాక్‌ను ఉపయోగించారు, ఇది ఫుల్ ఛార్జింగ్ పై 146 కి.మీల రేంజ్ ఇస్తుంది. గరిష్ఠంగా 90 kmph వేగంతో ప్రయాణిస్తుంది.

Okinawa-Ipraise-Plus

ఒకినావా: చివరగా సరికొత్త ఒకినావా నుంచి Okinawa iPraise+ ఎలక్ట్రిక్ స్కూటర్ రూ. 1.46 లక్షల ఎక్స్-షోరూమ్ ధరతో కొనుగోలుకు అందుబాటులో ఉంది. 3.3 kWh కెపాసిటీతో లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్ మరియు 2.5 kW BLDC మోటార్ ఇందులో ఉపయోగించంారు. ఈ స్కూటర్ ఫుల్ ఛార్జింగ్‌తో 137 కిమీల రేంజ్‌ను అందిస్తుంది. గరిష్ఠంగా గంటకు వేగం 56 కి.మీతో ప్రయాణిస్తుంది.

More from DriveSpark

Article Published On: Thursday, August 10, 2023, 12:09 [IST]
English summary
Top five electric scooters in india with more than 125 km range and low budget
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+