Bajaj Pulsar N150 బైక్ గురించి తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు!
ప్రముఖ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ బజాజ్ ఇటీవల తన కొత్త బైక్ Bajaj Pulsar N150 బైక్‌ను భారత్‌లో విడుదల చేసింది. భారత్ మార్కెట్‌లో ఈ బైక్ ధర రూ.1.18 లక్షలుగా (ఎక్స్‌షోరూం) ఉంది. పల్సర్ N150 బైక్ ప్రారంభంతో దేశీయ మార్కెట్‌లో ప్రస్తుతం విస్తృతమైన 150cc సెగ్మెంట్ బైక్‌లను బజాజ్ కలిగి ఉంది. ఈ కొత్త బైక్ కస్టమర్లను ఆకట్టుకుంటుందని సంస్థ భావిస్తోంది.
డిజైన్ : కొత్త బజాజ్ పల్సర్ N150.. N160తో పోలిస్తే కొన్ని డిజైన్ మార్పులు గమనించవచ్చు. ఈ రెండు మోటార్ సైకిళ్లు ఒకే సిరీస్‌కు చెందినవి కాబట్టి సుమారుగా ఒకే విధమైన పోలిక ఉంటుంది. అయితే కొన్ని చోట్ల చిన్న మార్పులను గమనించవచ్చు. దీంతోపాటు ఈ బైక్ సింగిల్ పీస్ సీట్‌ను కలిగి ఉంటుంది. దీంతోపాటు అనేక రకాల గ్రాఫిక్స్‌ను కలిగి ఉంది.

ఇంజిన్ : కొత్త బజాజ్ పల్సర్ N150 మోటార్ సైకిల్ 149.68cc సింగిల్ సిలిండర్ ఎయిర్ కూల్డ్ ఇంజిన్‌ను కలిగి ఉంటుంది. ఈ ఇంజిన్ 8500 rpm వద్ద 14.3 bhp మరియు 6000 rpm వద్ద 13.5Nm గరిష్ఠ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీంతోపాటు ఈ బైక్ ఇంజిన్ 5- స్పీడ్ గేర్‌బాక్స్‌ను కలిగి ఉంటుంది.
అదే బజాజ్ పల్సర్ N160 బైక్ 164.82cc సింగిల్ సిలిండర్ ఆయిల్ కూల్డ్ ఇంజిన్‌తో వస్తుంది. ఈ ఇంజిన్ 8,750 rpm 15.7 bhp శక్తి మరియు 6750 rpm వద్ద 14.65 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీంతోపాటు ఈ బైక్ ఇంజిన్ కూడా 5 స్పీడ్ గేర్‌బాక్స్‌తో వస్తుంది.
ఫీచర్లు : ఈ బజాజ్ కొత్త బైక్‌లో USB ఛార్జింగ్ పోర్టు సహా ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ ఉంది. దీంతోపాటు LED ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్‌లను కలిగి ఉంది. బజాజ్ పల్సర్ N150 మోటార్ సైకిల్ బైక్.. రేసింగ్ రెడ్, ఎబోనీ బ్లాక్, మోటాలిక్ పెరల్ వైట్ రంగుల్లో లభిస్తుంది. అయితే ఈ మూడు రంగులు కూడా చాలా ఆకర్షణీయంగా ఉంటాయి.
సస్పెన్షన్ : బజాజ్ పల్సర్ N150 మోటార్ సైకిల్ ముందు వైపు టెలిస్కోపిక్, వెనుకవైపు మోనోషాక్ సస్పెన్షన్‌ను కలిగి ఉంది. ఇది ఎత్తుపల్లాలు సహా ఇతర రోడ్లపై సౌకర్యవంతంగా ప్రయాణం చేసే విధంగా సాయపడతాయి. దీంతోపాటు ఈబైక్ మెరుగైన బ్రేకింగ్ వ్యవస్థను కలిగి ఉంటుంది. ABS సింగిల్ ఛానల్‌తో కూడిన 240mm డిస్క్ బ్రేక్, 130mm డ్రమ్ బ్రేక్‌లను కలిగి ఉంది.
డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, Threads, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications








