Kratos R బైక్‌లో సరికొత్త ఫీచర్‌ను ప్రవేశపెట్టిన టార్క్ మోటార్స్‌.. పూర్తి ఛార్జ్‌పై 180 కి.మీ రేంజ్

భారత్‌లో మొట్టమొదటి ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ తయారీదారు TORK మోటార్స్.. దాని KRATOS R ఫ్లాగ్‌షిప్‌లో సరికొత్త ఎకో+ రైడ్ మోడ్‌ను పరిచయం చేసింది. పూర్తి ఛార్జ్‌పై 180 కి.మీ రేంజ్‌ను అందించనుంది.

టార్క్‌ మోటార్స్‌ తన ఎలక్ట్రిక్‌ బైక్‌ల్లో రైడ్‌ మోడ్‌లతో తన పరిధిని విస్తరిస్తోంది. తాజాగా Kratos R దాని ఫ్లాగ్‌షిప్‌లో ECO+ రైడ్‌ మోడ్‌ను పరిచయం చేయడం ద్వారా ఈ బైక్ శ్రేణిని విస్తరిస్తోంది. దీని ద్వారా పట్టణాల్లో రైడింగ్ పరిస్థితులకు అనుగుణంగా రైడర్‌లు పూర్తి ఛార్జ్‌పై 150+ కి.మీ రేంజ్‌ను పొందవచ్చు.

Kratos-R-Eco+-Mode

ఎకో+ అనే ఈ కొత్త రైడ్ మోడ్ ద్వారా Kratos R దాని IDC ఫిగర్ పూర్తి ఛార్జ్‌పై 180km రేంజ్‌కు చేరుతుంది. కాగా ఇప్పటికే KRATOS R ఇప్పటికే ఎకో, సిటీ, స్పోర్ట్‌ అనే మూడు రైడింగ్ మోడ్‌లతో మార్కెట్లో అందుబాటులో ఉంది.

సిటీ కమ్యూటర్లకు అనుగుణంగా క్రాటోస్‌ ఆర్‌ ECO+ మోడ్‌లో, గరిష్ఠంగా గంటకు 35 వేగంతో ప్రయాణిస్తుంది. అంతే కాకుండా దాని సమర్థత కారణంగా పనితీరు కూడా మెరుగుపడుతుంది. పట్టణాల్లో రోడ్లపై జనాల రద్దీ, ట్రాఫిక్‌ కారణంగా ఎకో+ మోడ్‌లో 35 కి.మీ వేగాన్ని పరిమితం చేశారు.

Kratos R లో ECO+ ఫీచర్‌ను అందించడంపై TORK మోటార్స్‌ వ్యవస్థాపకుడు& CEO కపిల్‌ షెల్కే మాట్లాడారు. కస్టమర్ల డిమాండ్‌కు అనుగుణంగా ఈ కొత్త మోడ్‌ను ప్రవేశపెట్టినట్లు తెలిపారు. రైడర్ల తమ రైడింగ్ పరిస్థితులకు అనుగుణంగా రైడింగ్‌ మోడ్‌ను మార్చుకోవచ్చని పేర్కొన్నారు.

మార్కెట్లోకి విడుదలయ్యే ప్రతి కొత్త Kratos R ఎలక్ట్రిక్‌ బైక్‌ ఈ నాలుగు డైనమిక్ రైడింగ్ మోడ్‌లను కలిగి ఉంటుంది. ప్రత్యేకించి పార్కింగ్ సమయంలో రివర్స్ మోడ్‌ను అదనంగా అందించింది. ECO+ మోడ్‌ను ఇప్పటికే ఉన్న Kratos R యజమానులకు కూడా అందించనుంది.

Kratos R ఎలక్ట్రిక్‌ బైక్‌ మోటారు పనితీరును చూసుకుంటే.. ఇది 9kW 'యాక్సియల్ ఫ్లక్స్' మోటార్‌ను కలిగి ఉంది. ఇది 38 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. అసాధారణమైన 96% కెపాసిటీ రేటింగ్‌ను కలిగి ఉంది. IP67 రేటెడ్ 4.0 kWh Li-ion బ్యాటరీ ప్యాక్‌ను అమర్చడం ద్వారా ఈ బైక్‌ ఇది గరిష్ఠంగా 180 కి.మీ రేంజ్‌ను ఇస్తుంది.

Kratos R తన అద్భుతమైన డిజైన్‌తో మార్కెట్లో ట్రెండ్‌ సెట్ చేయడమే కాకుండా పటిష్ఠమైన పవర్‌ట్రెయిన్‌కు ప్రసిద్ధి చెందింది. పనితీరు, సామర్థ్యం ఇంకా మెయింటెనెన్స్‌ ఈ మూడింట్లోనూ ప్రీమియం అర్బన్ మోటార్‌సైకిల్‌గా రాణిస్తోంది. ఎకో ఫ్రెండ్లీగానే కాకుండా థ్రిల్లింగ్ మరియు స్టైలిష్ రైడింగ్ అనుభవాన్ని కోరుకునే రైడర్‌లకు Kratos R బెస్ట్‌ ఆప్షన్‌గా చెప్పవచ్చు.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Friday, October 20, 2023, 17:25 [IST]
English summary
Tork motors adds eco mode to kratos r electric bike range extended to 180km
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+