బెంగళూరులో ఫస్ట్ ఎక్స్‌పీరియన్స్ జోన్‌ను ప్రారంభించిన టార్క్ మోటార్స్..
దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం రోజురోజుకీ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఉన్న ప్రముఖ ఆటో కంపెనీలు ఈవీ రంగంలో దిగగా.. స్టార్టప్‌లు సైతం ఈవీ రంగంలో పుట్టుకొచ్చాయి. ఈ క్రమంలో భారత్‌లో కొత్తగా మరో ఈవీ ఎక్స్‌పీరియన్స్ జోన్ ప్రారంభమైంది. పూర్తి సమాచారం ఈ కథనంలో చదవండి.
భారతదేశపు మొట్టమొదటి ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ తయారీదారు Tork మోటార్స్, బెంగళూరులో తన మొదటి ఎక్స్‌పీరియన్స్ జోన్‌ను ప్రారంభించింది. ఇది Kratos-R బైక్ అమ్మకాలు, సర్వీస్ మరియు మద్దతును (Sales, Service, Support) అందిస్తుంది. Kratos-R భారతదేశంలో రూపొందించబడిన మరియు అభివృద్ధి చేయబడిన దేశంలో మొట్టమొదటి ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్.

Tork Motors ఎక్స్‌పీరియన్స్ జోన్ బెంగళూరులోని జయనగర్లో 5వ బ్లాక్‌లో ఉంది. ఇది బెంగళూరు మరియు పరిసర ప్రాంతాల వినియోగదారులకు సేవలు అందిస్తుంది. వినియోగదారులు Kratos-Rని కొనుగోలు చేసేముందు దాని ఫీచర్లు మరియు పనితీరును పరిశీలించడానికి టెస్ట్ రైడ్ చేసుకోవచ్చు. బెంగళూరు తమకు చాలా ముఖ్యమైన మార్కెట్ అని, ఇది దేశపు 'టెక్ క్యాపిటల్' మరియు మోటార్‌సైకిల్‌దారుల నగరమని టార్క్ మోటార్స్ వ్యవస్థాపకుడు & సీఈవో కపిల్ షెల్కే అన్నారు.
Kratos-R ఒక ప్రీమియం కమ్యూటర్ మోటార్‌సైకిల్, ఇది అద్భుతమైన డిజైన్, పంచ్ పవర్‌ట్రెయిన్, మంచి సామర్థ్యం గల ఛాసిస్‌ను కలిగి ఉంది. ఇది 4.0kWh లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్ (IP-67 రేట్) తో వస్తింది. ఇది TORK మోటార్స్ ద్వారా పేటెంట్ పొందిన 9kW యాక్సియల్ ఫ్లక్స్ మోటార్‌కు శక్తినిస్తుంది.

ఈ ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్లో రివర్స్ మోడ్ ఫంక్షనాలిటీ కూడా ఉంటుంది. Kratos-R ఈ సంవత్సరం ప్రారంభంలో కొన్ని అప్‌డేట్‌లను అందుకుంది. ఇందులో పూర్తిగా బ్లాక్ మోటార్, బ్యాటరీ ప్యాక్, స్టైలిష్ డీకాల్స్, ఫాస్ట్ ఛార్జింగ్ పోర్ట్ ఉన్నాయి. ఇది ఐదు అధునాతన కలర్ ఆప్షన్‌లలో లభిస్తుంది.

Kratos-R ను కొనుగోలు చేసేందుకు Tork మోటార్స్ ఫైనాన్స్ ఆప్షన్ కూడా కల్పించింది. నెలకు రూ. 2,999 నుంచి EMI లో ఈ టూ వీలర్ కొనుగోలు చేసేందుకు ప్రముఖ ఫైనాన్స్ సంస్థలతో భాగస్వామ్యం కలిగి ఉంది. కస్టమర్లు తమ Kratos-Rని కంపెనీ అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవచ్చు.
ఈ నేపథ్యంలో టార్క్ మోటార్స్ తమ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిళ్ల శ్రేణిని విస్తరించే యోచనలో ఉంది. భవిష్యత్తులో, ఈ కంపెనీ పెద్ద బ్యాటరీతో పూర్తిగా ఫెయిర్డ్ బైక్ వంటి విభిన్నమైన ఇ-బైక్‌లను విడుదల చేయాలని భావిస్తోంది. అదేవిధంగా భవిష్యత్తులో తమ నగర-బైక్‌లు మరియు ప్రయాణీకుల పరిధిని పెంచుతారు, ప్రతి ఒక్కటి విభిన్న ఫీచర్లు మరియు ప్రత్యేక శైలిని కలిగి ఉంటాయి.

టార్క్ మోటార్స్ తమ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిళ్ల శ్రేణిని విస్తరించే యోచనలో ఉంది. భవిష్యత్తులో, ఫుల్ ప్యాక్ బ్యాటరీతో పూర్తిగా ఫెయిర్డ్ బైక్ వంటి విభిన్నమైన ఇ-బైక్‌లను విడుదల చేయాలని భావిస్తోంది. ప్రతి ఒక్కటి విభిన్న ఫీచర్లు మరియు ప్రత్యేక శైలిని కలిగి ఉంటాయి.
దేశీయంగా అభివృద్ధి ఈ ఎలక్ట్రిక్ బైక్ ప్రారంభించినప్పటి నుంచి వినియోగదారుల నుండి విపరీతమైన స్పందనను కలిగి ఉంది. దీని ఫీచర్లు మరియు పనితీరు ఇప్పటికే ఆటో రంగ నిపుణులు మరియు సమీక్షకుల ప్రశంసులు అందుకుంది. TORK మోటార్స్ బెంగళూరులోనే కాకుండా భారతదేశంలోని ఇతర నగరాల్లో కూడా తమ జోరును కొనసాగించాలని లక్ష్యంగా పెట్టుకుంది.


Click it and Unblock the Notifications








