ట్రయంఫ్ నుంచి 8 కొత్త స్పెషల్ ఎడిషన్ బైక్‌లు విడుదల.. బుక్ చేసుకోవాలంటే అప్పటివరకే ఛాన్స్.!!
గోవాలో ఇండియా బైక్ వీక్(IBW 2023) ఈవెంట్‌లో ట్రయంఫ్ మోటార్‌సైకిల్స్ బోన్నెవిల్లే స్టీల్త్ ఎడిషన్ మోటార్‌సైకిళ్లను అత్యంత గ్రాండ్‌గా లాంచ్ చేసింది. ప్రత్యేకమైన డిజైన్ సిస్టమ్ మరియు చేతితో పెయింట్ చేయబడిన బైక్స్‌గా ఇవి విడుదలయ్యాయి. ఇప్పటికే విదేశాల్లో విడుదల కాగా ఇప్పుడు భారత్‌లో కూడా లాంచ్ అయ్యాయి.
ప్రముఖ బ్రిటిష్ టూ వీలర్ తయారీదారు ట్రయంఫ్(Triumph Bonneville Stealth Editions).. స్పెషల్ ఎడిషన్ సిరీస్ బైక్‌లను భారత మార్కెట్లో విడుదల చేసింది. ఈ కొత్త మోటార్‌సైకిళ్లను ఆకర్షణీయమైన డిజైన్‌తో రూపొందించారు. ప్రీమియం బైక్ ప్రియులను ఈ మోటార్ సైకిళ్లు ఆకర్షిస్తాయనడంలో సందేహం లేదు.

ట్రయంఫ్ కంపెనీ స్టీల్త్ సిరీస్‌లోని 8 మోటార్‌సైకిళ్లను విడుదల చేసింది. వీటి ధర భారత మార్కెట్లో రూ.9.09 లక్షల నుండి రూ.12.85 లక్షల ఎక్స్-షోరూమ్‌గా ఉంది. బుకింగ్‌లు కూడా ప్రారంభమయ్యాయి. వచ్చే ఏడాది (2024) మార్చి నుంచి డెలివరీలు ప్రారంభం కానున్నాయి. కాగా ఇవన్నీ స్పెషల్ ఎడిషన్ బైక్‌లు కావడంతో భారత్‌లో ఏడాది కాలం మాత్రమే కొనుగోలుకు అందుబాటులో ఉంటాయి.
ట్రయంఫ్ బోన్నెవిల్లే స్టీల్త్ ఎడిషన్ మోటార్‌సైకిళ్లను పరిశీలిస్తే.. స్పీడ్‌మాస్టర్ రెడ్ స్టీల్త్ ఎడిషన్, బాబర్ పర్పుల్ స్టీల్త్ ఎడిషన్, బోనెవిల్లే T100 బ్లూ స్టీల్త్ ఎడిషన్, బోన్నెవిల్లే T120 బ్లూ స్టీల్త్ ఎడిషన్, స్పీడ్ ట్విన్ 1200 రెడ్ స్టీల్త్ ఎడిషన్, స్పీడ్ 1200 రెడ్ స్టీ 2 బ్లాక్ స్టీల్త్ ఎడిషన్ ఇందులో ఉన్నాయి.

స్టీల్త్ ఎడిషన్ పోర్ట్‌ఫోలియోలోని ప్రతి మోటార్ సైకిల్ ట్యాంక్‌లు చేతితో పెయింట్ చేయబడిన ఆకర్షణీయమైన డిజైన్‌తో రూపొందాయి. ఇవన్నీ క్రాష్ కలర్స్‌లో హ్యాండ్ పెయింటెడ్ ఫినిషింగ్‌తో డిజైన్ చేశారు. ప్రతి లైటింగ్ కండిషన్‌లో విభిన్న రంగులను ప్రదర్శించేలా వీటిని రూపొందించారు.
ట్రయంఫ్ 7వ ఎడిషన్ బైక్‌లను ప్రత్యేకమైన రంగు థీమ్‌లతో హ్యాండ్-పెయింటెడ్ బైక్‌లుగా తయారుచేసింది. ఈ బైక్‌ల కోసం మొదట సిద్ధం చేసిన ట్యాంకులు మిర్రర్ ఫినిషింగ్ సిల్వర్ బేస్ కోట్‌తో చేతితో పెయింట్ చేశారు. దీని వల్ల ట్రయంఫ్ స్టీల్ ఎడిషన్ బైక్‌లు రోడ్డుపై ప్రజలను ఆక్టుటకుంటుందనడంలో సందేహం లేదు. అంతేకాకుండా ఈ బైక్‌లు కాస్త విలాసవంతమైనవి.

బోన్నెవిల్లే సిరీస్ మోటార్‌సైకిళ్లు అదే ఇంజిన్, ఫీచర్లు మరియు బ్రేకింగ్ సిస్టమ్‌తో పనిచేస్తాయి. బైక్ ధరల విషయానికొస్తే, స్పీడ్ మాస్టర్ రెడ్ స్టెల్త్ ఎడిషన్ ధర రూ. 12.85 లక్షలు, బాబర్ పర్పుల్ స్టెల్త్ ఎడిషన్ ధర రూ. 12.85 లక్షలుగా ఉంది.
బొనావిల్ టి100 బ్లూ స్టిల్స్ ఎడిషన్ ధర రూ. 10.29 లక్షలు, బొనావిల్ టి120 ఎడిషన్ ధర రూ. దీని ధర రూ. 11.89 లక్షలు, మరియు స్పీడ్ డివిన్ 1200. రెడ్ స్టెల్త్ ఎడిషన్ కూడా రూ. 11.89 లక్షల ధరతో ట్రయంఫ్ మోటార్స్ విడుదల చేసింది.
=భారత్‌లో బైక్ ప్రేమికుల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈవెంట్ ఇండియా బైక్ వీక్. ఈవెంట్‌లో ట్రయంఫ్ ఉత్పత్తులను లాంచ్ చేయడం అభిమానులకు సూపర్ న్యూస్ లాంటిదే. దేశంలో ట్రయంఫ్ బైక్‌లకు విపరీతంగా ఫ్యాన్స్ ఉన్నారు. ఈ క్రమంలో ఈ బైక్‌లకు పెద్ద సంఖ్యలో బుకింగ్‌లు వచ్చే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications








