Triumph scrambler 400 X Full Review Video ట్రయంఫ్ స్క్రాంబ్లర్ 400 X బైక్ ఫుల్ రివ్యూ వీడియో
ఇటీవల భారత మార్కెట్లో ట్రయంఫ్ మోటార్‌సైకిల్స్.. తన కొత్త స్క్రాంబ్లర్ 400 X బైక్‌ను విడుదల చేసింది. పూణేలో ఈ బైక్‌ను మా డ్రైవ్‌స్పార్క్ టీమ్ టెస్ట్ డ్రైవ్ చేసింది.
ట్రయంఫ్ స్క్రాంబ్లర్ 400 X బైక్ ఫుల్ రివ్యూ వీడియో ఇక్కడ ఉంది. స్క్రాంబ్లర్ 400 X డిజైన్ పరంగా LED లైటింగ్ సెటప్, సెమీ-డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, స్విచ్ గేర్, బ్లాక్ పౌడర్-కోటెడ్ ఇంజన్ కేసింగ్‌లు, గోల్డ్ యానోడైజ్డ్ ఫ్రంట్ ఫోర్క్‌లు, ఆకర్షణీయంగా ఫ్యూయల్ ట్యాంక్ అప్‌స్వెప్ట్ ఎగ్జాస్ట్ డిజైన్‌ను కలిగి ఉంది.
స్క్రాంబ్లర్ 400 X బైక్ ఇంజిన్ పనితీరు విషయానికొస్తే ఇందులో 398 cc లిక్విడ్ కూల్డ్ & ఫ్యూయెల్ ఇంజెక్ట్ ఇంజిన్‌ను కలిగి ఉంది. ఇది 39.5 బిహెచ్‌పి పవర్, 37.5 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. Scrambler 400 X లో స్విచబుల్ ట్రాక్షన్ కంట్రోల్, టార్క్-అసిస్ట్ క్లచ్, బాష్ డ్యూయల్-ఛానల్ ABS సిస్టమ్, స్టీరింగ్ లాక్, యాంటీ-థెఫ్ట్ ఇమ్మొబిలైజర్‌ను స్టాండర్డ్ ఫీచర్లుగా చూడవచ్చు.

ఇక ట్రయంఫ్ స్క్రాంబ్లర్ 400 X మూడు కలర్స్ ఆప్షన్స్‌లో ఫ్యూయల్ ట్యాంక్‌పై సెకండరీ కలర్ స్ట్రిప్‌తో ఆకర్షణీయంగా రూపొందించారు. ఫ్యూజన్ వైట్‌తో మ్యాట్ ఖాఖీ గ్రీన్, సిల్వర్ ఐస్‌తో ఫాంటమ్ బ్లాక్ మరియు ఫాంటమ్ బ్లాక్‌తో కార్నివాల్ రెడ్ కలర్ ఆప్షన్‌లను ట్రయంఫ్ ప్రవేశపెట్టింది.
స్క్రాంబ్లర్ 400 X సస్పెన్షన్ సెటప్ ద్వారా ఇందులో అమర్చిన MRF డ్యూయల్-పర్పస్ టైర్‌లతో కఠినమైన రోడ్లపై సైతం ఈజీగా రైడ్ చేయవచ్చు. ఇంకా రోడ్డుపై టర్నింగ్‌లను తీసుకోవడం కూడా పెద్ద కష్టంగా అనిపించదు. స్క్రాంబ్లర్ 400 X లో హై-స్లంగ్ సీటుపై రైడింగ్ పొజిషన్ చాలా నిటారుగా ఉంటుంది. ఇది ఆఫ్-రోడింగ్ పరిస్థితులలో రైడర్‌కు ఫ్రెండ్లీగా ఉంటుంది.


Click it and Unblock the Notifications








