ట్రయంఫ్ స్పీడ్ 400 మరియు స్క్రాంబ్లర్ 400X బైక్స్ గురించి తెలుసుకోవాల్సిన విషయాలు..!
బ్రిటిష్ మోటార్ సైకిల్ తయారీ సంస్థ ట్రయంఫ్ ఎట్టకేలకు తన రెండు బైక్‌లు స్పీడ్ 400 మరియు స్ర్కాంబ్లర్ 400X వాహనాలను మార్కెట్‌లోకి పరిచయం చేసింది. బజాజ్- ట్రయంఫ్ భాగస్వామ్యంతో వచ్చిన ఈ రెండు వాహనాలకు సంబంధించి తెలుసుకోవాల్సిన 5 ముఖ్యమైన అంశాలు మీకోసం.
డిజైన్ : కొత్త ట్రయంఫ్ స్పీడ్ 400 మరియు స్క్రాంబ్లర్ 400X బైక్‌లు నియో రెట్రో థీమ్‌తో టియర్ డ్రాప్ తరహా ఇంధన ట్యాంక్ మరియు హెడ్‌లైట్లు, ఎల్‌ఈడీ ఇండికేటర్లు, రేర్‌వ్యూ మిర్రర్, ఎల్‌ఈడీ టెయిల్ లైట్లు వృత్తాకార డిజైన్ కలిగి ఉన్నాయి. ఈ రెండు మోడల్ బైక్‌లు ప్రీమియం హార్డ్‌వేర్‌తో వచ్చాయి.

కొత్త ట్రయంఫ్ బైక్‌లు 398.15సీసీ లిక్విడ్ కూల్డ్ 4 వాల్స్ DOHC ఓవర్‌స్క్వేర్ ఇంజిన్‌ను కలిగి ఉన్నాయి. ఈ ఇంజిన్ 8000rpm వద్ద 39.5bhp మరియు 6500rpm వద్ద 37.5Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ట్రయంఫ్ స్పీడ్ 400 మరియు స్క్రాంబ్లర్ 400X బైక్‌లు స్లిప్, అసిస్ట్ క్లచ్‌తో కూడిన 6 స్పీడ్ గేర్‌బాక్స్‌ను కలిగి ఉంటాయి. X రింగ్ చైన్ డ్రైవ్ ద్వారా వెనుక చక్రాలకు శక్తి పంపబడుతుంది.

ట్రయంఫ్ స్పీడ్ 400 మరియు స్క్రాంబ్లర్ 400X ద్విచక్రవాహనాలు ట్యుబులర్ పెరీమీటర్ ఫ్రేమ్‌ను కలిగి ఉంటాయి. రెండు బైక్‌లు ట్విట్ కాస్ట్ అల్యుమినియం స్వింగార్మ్‌తో వస్తాయి. ఈ ఫేమ్‌లు కారణంగా ఈ రెండు వాహనాలు తక్కువ బరువును కలిగి ఉంటాయి. ట్రయంఫ్ స్పీడ్ 400 బైక్ బరువు 170కేజీలు, స్క్రాంబ్లర్ 400X బరువు 179 కేజీలు మాత్రమే ఉంటుంది.
ఈ రెండు వాహనాలు మెరుగైన సస్పెన్షన్ వ్యవస్థను కలిగి ఉంటాయి. ఈ బైక్‌ల ముందువైపు 43ఎంఎం USD పిస్టన్ ఫోర్క్‌తో కూడిన సస్పెన్షన్ వ్యవస్థను కలిగి ఉంటుంది. అలాగే గ్యాస్ ఛార్జడ్ మోనోషాక్ సస్పెన్షన్‌ను కలిగి ఉంది. అయితే ఈ రెండు ద్విచక్రవాహనాల్లో సస్పెన్షన్ వ్యవస్థ భిన్నమైన అనుభూతిని కలిగిస్తుంది.

ట్రయంఫ్ స్పీడ్ 400 బైక్ మరియు స్క్రాంబ్లర్ 400X రెండు ద్విచక్రవాహనాలు వెనుకవైపు ప్లోటింగ్ కాలిపర్లతో కూడిన 230mm ఫిక్సిడ్ డిస్క్ బ్రేకులకు కలిగి ఉన్నాయి. మరియు 4 పిస్టన్ కాలిపర్‌తో కూడిన డ్యూయల్ ఛానల్ ABS(యాంటీ బ్రేకింగ్ సిస్టమ్) సపోర్టును ముందు టైర్లు కలిగి ఉంటాయి. ట్రయంఫ్ స్పీడ్ 400 బైక్ ఫ్రంట్‌డిస్క్ 300ఎంఎం, స్క్రాంబ్లర్ 400X 320ఎంఎం ఉంది. రెండు వాహనాలు అత్యుత్తమ బ్రేకింగ్ వ్యవస్థను కలిగి ఉన్నాయి.

బజాజ్- ట్రయంఫ్ భాగస్వా్మ్యంలో వచ్చిన ట్రయంఫ్ స్పీడ్ 400 బైక్ మరియు స్క్రాంబ్లర్ 400X.. మరిన్ని ఫీచర్లు కూడా కలిగి ఉన్నాయి. ఆల్ ఎల్‌ఈడీ లైటింగ్, రైడ్ బై వైర్ టెక్, డ్యూయల్ ఛానల్ ABS, ట్రాక్షన్ కంట్రోల్ (స్విచ్), పార్ట్ అనలాగ్ పార్ట్ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ సహా మరిన్ని ఫీచర్లు ఈ బైక్‌ల సొంతం.

ట్రయంఫ్ స్పీడ్ 400 మరియు స్క్రాంబ్లర్ 400 X ద్విచక్ర వాహనాలు.. భారత్‌లో జులై 5న విడుదల కానున్నట్లు సమాచారం. రెండు బైక్‌ల ధర సుమారుగా రూ.2.5 లక్షల నుంచి రూ.2.8 లక్షల వరకు ఉండే అవకాశం ఉంది. భారత్‌లో రాయల్ ఎన్‌ఫీల్డ్‌కు గట్టి పోటీని ఇచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు.


Click it and Unblock the Notifications








