ట్రయంఫ్ స్పీడ్ 400 బైక్ రివ్యూ వీడియో.. ఆ బైక్‌కు గట్టి పోటీ..!!
తక్కువ ధరలో బైక్‌లను అందించడంలో భాగంగా ట్రయంఫ్.. బజాజ్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా ట్రయంఫ్ స్పీడ్ 400 బైక్‌ను భారతదేశంలో విడుదల చేసింది. డ్రైవ్‌స్పార్క్ బృందానికి ఈ బైక్‌ను టెస్ట్ డ్రైవ్ చేసే అవకాశం లభించింది. బృందం సభ్యుడు ఈ బైక్‌ను పూణేలో రైడ్ చేశారు. అనంతరం తన అద్భుతమైన అనుభవాన్ని వీడియోగా రికార్డు చేశారు. ఆ వీడియోను మీకోసం అందిస్తున్నాం.
ట్రయంఫ్ స్పీడ్ 400 బైక్ 398సీసీ సిలిండర్, ప్యూయల్ ఇంజెక్షన్, లిక్విడ్ కూల్డ్ ఇంజిన్‌ను కలిగి ఉంటుంది. ఈ ఇంజిన్ 39.5 bhp శక్తి మరియు 37.5Nm గరిష్ఠ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. మరియు 6-స్పీడ్ గేర్‌బాక్స్‌ను కలిగి ఉంటుంది. ఘర్షణ తగ్గించేందుకు DLC కోటింగ్‌ను కలిగి ఉంటుంది.
సరికొత్త ట్రయంఫ్ స్పీడ్ 400 బైక్ ముందు టైర్ 110/70 మరియు 150/60 వెనుకటైర్లు 17 అంగుళాల అల్లాయ్ వీల్స్‌ను కలిగి ఉంటాయి. అయితే భారత్‌లో అపోలో, MRF టైర్ల అప్షన్లలో అందుబాటులో ఉంటాయి. ఈ బైక్ కేవలం 2.8 సెకన్లలో 0-60kmph వేగాన్ని అందుకుంటుంది. అదే 7 సెకన్లలో 100kmph వేగాన్ని అందుకుంటుంది.

ట్రయంఫ్ స్పీడ్ 400 బైక్‌లో మరో ప్రత్యేకత ఉంది. రోడ్లపై ఎత్తుపల్లాలు సహా ఇతర అస్తవ్యస్తంగా ఉన్న రోడ్లుపై సస్పెన్షన్ వ్యవస్థ చాలా మెరుగైన పనితీరును కనబరుస్తుంది. బ్రేకింగ్ వ్యవస్థ, ఇతర ఫీచర్లు ఆకట్టుకుంటాయి. రాయల్ ఎన్‌ఫీల్డ్‌కు ఈ బైక్ గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉంటుంది.


Click it and Unblock the Notifications








