అమ్మకాల్లో దూసుకుపోతున్న TVS అపాచీ.. సరికొత్త రికార్డ్స్ నమోదు

ప్రీమియం బైక్స్ లో అపాచీకి ప్రత్యేక గుర్తింపు ఉంది. 2005లో విడుదలైన ఈ బైక్ మొదటి నుంచి దుమ్మురేపుతుంది. తాజాగా ఈ బైక్ ప్రంపంచ వ్యాప్తంగా 50 లక్షల యూనిట్ల అమ్మకాల మార్క్ ను చేరుకున్నట్లు కంపెనీ అధికారికంగా ప్రకటించింది. TVS అపాచీ బైక్స్ ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 60కిపైగా దేశాల్లో విక్రయాలను సాగిస్తుంది. అన్నీ దేశాల్లో రికార్డ్ స్థాయిలో అమ్మకాలను చేపడుతోంది.

ఈ అపాచీ సిరీస్ లు ఎప్పటికప్పుడు సరికొత్త అప్ డేట్స్ తో కస్టమర్లను ఆకట్టుకుంటుంది. అధునాతన ఫీచర్లతో ఈ బైక్ అందుబాటులో ఉంది. దేశీయంగా కూడా వీటికి చాలా డిమాండ్ ఉంది. అందులో భాగంగా ఈ రికార్డ్ ను సంస్థ సొంత చేసుకుందని చెప్పవచ్చు. యువతలో ఎక్కవగా క్రేజ్ అపాచీ సొంతం చేసుకుంది.

టీవీఎస్ అపాచీ

ఫిబ్రవరి 2022 నుంచి 21% వృద్ధిని నమోదు చేశాయని కంపెనీ తెలిపింది. ఫిబ్రవరి 2022 నెలలో అమ్మకాలు 86,616 యూనిట్ల నుండి ఫిబ్రవరిలో 2023వరకు 104,82023 యూనిట్లకు పెరిగాయని పేర్కొంది. దేశీయ ద్విచక్ర వాహన విక్రయాల్లోనూ టీవీఎస్ 28% వృద్ధి నమోదు చేసిందని తెలిపింది. ఈ మైలురాయిని చేరుకోవడం చాలా సంతోషంగా ఉందని సంస్థ ప్రతినిధులు తెలిపారు.

ప్రపంచ వ్యాప్తంగా ఈ స్థాయి అమ్మకాలు చేపట్టడం థ్రిల్లింగ్‌ గా ఉందని కంపెనీ ప్రీమియం బిజినెస్ హెడ్ విమల్ సంబ్లీ తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా అపాచీ ఉపయోగించిన వారందరికీ ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. భవిష్యత్ లో ఈ బ్రాండ్ ను ఇంకా మరింతగా విస్తరించేందుకు పనిచేస్తామని ఆయన చెప్పారు.

ఈ కంపెనీ నుంచి ప్రీమియం బ్రాండ్స్ లో అపాచీ సిరీస్‌ నేక్డ్‌, సూపర్‌ స్పోర్ట్స్‌ రెండు కేటగిరీలు ఉన్నాయి. ఆర్‌ టీఆర్‌ సిరీస్‌ లో నాలుగు మోడళ్లు ఉండగా స్పోర్ట్స్‌ విభాగం లో సరికొత్త మోడళ్లు ఉన్నాయి. గ్లోబల్‌ మార్కెట్‌ లో ఈ మైల్ స్టోన్ ను చేరుకోవడం టీవీఎస్‌ కు కలిసివచ్చే అంశంగా చెప్పవచ్చు. అయితే దేశంలో టూ వీలర్​ విభాగంలో.. బజాజ్​ ఆటో బైక్స్ అత్యంత ప్రజాదారణ పొందిన బైక్ గా ఓ సర్వే వెల్లడించింది. హీరో మోటోకార్ప్ కంటే భారతీయుల్లో బజాజ్​ పల్సర్ ​తర్వాత హీరో స్ప్లెండర్​ ప్లస్​, బజాజ్​ పల్సర్​ NS​, టీవీఎస్​ అపాచీ RTR​, హోండా సీబీ షైన్​ బైక్ లు ఉన్నాయి.

ఈ బైక్స్ వివిధ రైడ్ మోడ్స్, ఫ్యూయల్ ఇంజక్షన్, డ్యూయల్ ఛానెల్ ఏబీఎస్ సిస్టం, స్లిప్పర్ క్లచ్, స్మార్ట్ ఎక్స్‌ కనెక్ట్ బ్లూటూత్ కనెక్టివిటీ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి. ప్రస్తుతం ఈ సిరీస్‌ లో టీవీఎస్ అపాచీ ఆర్‌ టీఆర్ 160, టీవీఎస్ అపాచీ ఆర్‌టీఆర్ 160 4వీ, టీవీఎస్ అపాచీ ఆర్‌టీ ఆర్ 180, ఫ్లాగ్‌‌ షిప్ టీవీఎస్ అపాచీ ఆర్‌ టీఆర్ 200 4వీలు బాగా ప్రాచుర్యం పొందాయి.

టీవీఎస్ అపాచీ

టీవీఎస్ అపాచీ ఆర్ఆర్ 310..

టీవీఎస్ అపాచీ ఆర్ఆర్ 310 (రేస్ రెప్లికా)ను 2017లో సంస్థ లాంచ్ చేసింది. టాప్ ఎండ్ మోడల్స్‌ లో ఈ బైక్ దుమ్ము రేపింది. ఆసియా బుక్ ఆఫ్ రికార్డుల్లోకి కూడా ఈ అత్యాధునికి టీవీఎస్ స్థానం సంపాదించింది. తాజాగా 2022లో అత్యంత ప్రజాధారణ పొందిన ప్రీమియం బైక్స్ స్థానంలో ఈ అపాచీ కూడా స్థానం దక్కించుకుంది.

ఇటీవలే టీవీఎస్ అపాచీ ఆర్‌ టీఆర్ 165ఆర్పీ కూడా లాంచ్ చేసింది. దీని ఎక్స్-షోరూం ధర ప్రస్తుతం రూ.1.45 లక్షలుగా ఉంది. గతంలో లాంచ్ అయిన అపాచీ ఆర్‌ టీఆర్ 160 4వీ ఆధారంగా దీనిని రూపొందించారు. ఇందులో అత్యాధునిక కొత్త ఇంజిన్‌ ను అందించారు. ఈ విభాగంలో ఇదే అత్యంత ఖరీదైన బైక్ కానుంది. ఇందులో కొన్ని మార్పలు చేర్పులు చేశారు.

More from DriveSpark

Article Published On: Thursday, March 2, 2023, 12:28 [IST]
English summary
Tvs apache bikes crossed 50 lacks units sales
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+